కొరటాల శివ స్టార్ డైరెక్టర్ అవ్వడానికి సింహ సినిమాకు వున్న లింక్ ఏంటో తెలుసా? ఆ మోసం తర్వాతే? సినిమా ఇండస్ట్రీలో దర్శకులు సినిమాలను డైరెక్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని సినిమాలకు కథల దర్శకులు రాస్తూ ఉంటారు. మరికొందరు రచయితలచే కథలను రాయిస్తూ ఉంటారు. ఈ కథను అందించినప్పుడు రచయితల పేరును వేయకపోతే వారికి వారికి అన్యాయం జరిగినట్టే కదా!.
చాలామంది రచయితల పేర్లు తమ పేరు టైటిల్స్ లో వేయలేదని ఇంటర్వ్యూలో ఆయన ఆవేదన చెందుతూ చెప్పారు. ఇలాంటి విషయాలు సాధారణంగా ఎవరికైనా జరుగుతాయి. అలా పేర్లు వేయకపోతే వాళ్ల బాధ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ లో డైరెక్టర్ గా రాణిస్తున్న కొరటాల శివ కూడా ఒకప్పుడు రచయితగా పలు సినిమాలకు కథలను అందించారు.
కొరటాల శివ కు సినిమాలపై చాలా ఆసక్తి ఎక్కువగా ఉండేదట. తన మేనమామ అయినా పోసాని కృష్ణ మురళి వద్ద అసిస్టెంట్ గా ఆయన పనిచేశారు. అంతేకాకుండా పలు చిత్రాలకు స్క్రీన్ రైటింగ్ అసిస్టెంట్ గా కూడా కొరటాల శివ పనిచేశారు. మున్నా, బృందావనం, ఒక్కడున్నాడు సహా పలు చిత్రాలకు పనిచేశారు.2013లో కొరటాల శివ మిర్చి సినిమాలోని దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత కొరటాల శివ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలను అందుకున్నాడు. అదేవిధంగా జనతా గ్యారేజ్,శ్రీమంతుడు,భరత్ అనే నేను లాంటి సినిమాలు సూపర్ హిట్ సినిమాలుగా తెరకెక్కించాడు. ఇక రీసెంట్ గా ఆచార్య సినిమాలతో కొరటాల శివ ఫ్లాప్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇదిలా ఉండగా కొరటాల శివ సినిమాకు రచయితగా పనిచేశానని చెప్పారు.
ఆయన తన పేరును టైటిల్స్ లో వేయలేదు అని వ్యక్తం చేశారు. కానీ తాను ఒక దర్శకుడు అవ్వడానికి కారణం అయిందని చెప్పారు. కొరటాల శివ తన మామ అయిన పోసాని కృష్ణ దగ్గర అసిస్టెంట్ గా ఆయన పని చేశారు. ఆయన ఒక పని రాక్షసుడు అని చెప్పారు. ఇలా కొరటాల శివ ఎన్నెన్నో సమస్యలతోనూ ఎదుర్కొంటూ ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో నిలిచి ఉన్నాడు. అలాగే స్టార్ డైరెక్టర్ గా నిలిచిపోవడం సాగాడు.