Dhanya Balakrishna: మారి మూవీ డైరెక్టర్ తో ధన్య బాలకృష్ణ సీక్రెట్ మ్యారేజ్

ధన్య బాలకృష్ణ పెళ్లయి విడాకులు తీసుకున్న ఓ డైరెక్టర్ని పెళ్లి చేసుకుంది అంటూ ఒక షాక్కు గురి చేసే న్యూస్ ని బయట పెట్టింది నటి కల్పిక గణేష్. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ధన్య బాలకృష్ణ అనే పేరు పెద్దగా పరిశీలించాల్సిన అవసరం లేదు.

తమిళ్, కన్నడ, మలయాళ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు మూవీస్ లో సాఫ్ట్వేర్ సుధీర్, నేను శైలజ, రాజు గారి గది, కార్బన్ అనే మూవీస్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకుంది.

సినిమాల్లోనే కాకుండా, వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది ధన్య. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధన్య బాల కృష్ణ ప్రస్తుతం విడాకులు తీసుకున్న ఓ డైరెక్టర్ని పెళ్లి సీక్రెట్ గా చేసుకుంది అంటూ ఈ వార్తని కల్పిక గణేష్ బయట పెట్టింది.

మారి మూవీ డైరెక్టర్ తో ధన్య బాలకృష్ణ సీక్రెట్ మ్యారేజ్

తన యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి ఒక వీడియో కూడా దాంట్లో పెట్టింది. ఈ కారణంగా తర్వాత ధన్య, కల్పిక మధ్య కొన్ని రోజులు మాటల యుద్ధం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు ఆరోపణలు చేసుకోవడం కూడా తెలిసిందే. ఇది పక్కన పెడితే తమ పెళ్లి నిజమే అంటూ దర్శకుడు బాలాజీ మోహన్ తేల్చి చెప్పేశారు.

మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము అంటూ కోర్టుకి ఈ విషయాన్ని తెలియజేశారు. సినీ నటి కల్పిక తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ బహిర్గతంగా మాట్లాడుతూ ఉంటుందని ఈ విషయం గురించి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు డైరెక్టర్ బాలాజీ మోహన్.

తమకి ఈ సంవత్సరం కిందటే పెళ్లయిపోయిందని, తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతనే ధన్యాను వివాహం చేసుకున్నానని చెప్పి పిటిషన్ లో ఈ విషయం తేల్చి చెప్పేశారు డైరెక్టర్ బాలాజీ మోహన్. కల్పిక తమ వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడుతూ తమ పరువు కు భంగం కలిగేలా మాట్లాడుతూ ఉందని చెప్పి ఆ పిటిషన్ లో తెలియజేశారు.

ఇంతవరకు వీళ్ళిద్దరి పెళ్లి గురించి ఎందుకు బయట పెట్టలేదు తెలియాల్సి ఉంది. ఈ డైరెక్టర్ కి ఇది రెండో వివాహం. మొదట అరుణ అనే ఆమెను వివాహం చేసుకొని విడాకులు ఇచ్చిన తర్వాత ధన్య ను వివాహం చేసుకున్నారు.మారి, మారి 2 , వాయై మూడి పేసవుం లాంటి మూవీస్ కి డైరెక్షన్ చేశారు ఈ డైరెక్టర్. ఎలాగైతేనేమి నది కల్పిగా చేసిన వ్యాఖ్యలు నిజమే అని ఒప్పుకున్నారు డైరెక్టర్ బాలాజీ మోహన్. మేమిద్దరం రహస్యంగానే పెళ్లి చేసుకున్నాము అంటూ చెప్పుకొచ్చాడు.