Nidhhi agerwal: తన సక్సెస్ ఫార్ములా చెప్పేసిన నిధి అగర్వాల్

టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ లో ఒకరైన నిధి అగర్వాల్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా బాగా సక్సెస్ అవ్వాలి అంటే దీనికోసం ఒక సక్సెస్ ఫార్ములా చెప్పింది నిధి అగర్వాల్. ప్రస్తుతం ఈ సక్సెస్ ఫార్ములా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది.

ఒకే ఒక్కటి ఉంటే మాత్రం సక్సెస్ మన సొంతమవుతుంది అని చెప్తుంది. ఇటీవలే తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది నిధి అగర్వాల్. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిధి అగర్వాల్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐదేళ్లు పూర్తయింది.

తన సక్సెస్ ఫార్ములా చెప్పేసిన నిధి అగర్వాల్

ఇలాంటి పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా బాగా రాణించాలి అంటే తన ఎక్స్పీరియన్స్ ని బట్టి ఒక సక్సెస్ మంత్రా చెప్పింది. సినిమాల్లో విజయం సాధించాలంటే, సినిమాలు హిట్ అవ్వాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, టాలెంట్ చూపించాలి అంటుంటారు. ఇదేమీ అవసరం లేదు జస్ట్ లక్ ఉంటే మాత్రం ఈ ఇండస్ట్రీ ని ఎలా వచ్చు అని చెప్పకు వచ్చింది ఆ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్.

దీనికి సంబంధించి కొన్ని ఎగ్జామ్పుల్స్ కూడా చెప్పింది. సినిమా కథలు కొన్ని పేపర్ పైన చాలా అద్భుతంగా కనిపిస్తాయి మరికొన్ని వెండితెరపై తేలిపోతాయి. పేపర్ మీద సాదాసీదాగా అనిపించిన కథలు కూడా వెండితెరపై చాలా అద్భుతాన్ని సృష్టిస్తాయి ఒక్కొక్కసారి. తన ప్రకారం 90% సక్సెస్ కి కారణం లక్కే అంటుంది నిధి అగర్వాల్.

కథల ఆధారంగా సినిమాలు సెలెక్ట్ చేసుకునే రేంజ్కి నేను ఇంకా రాలేదు అంటూ చెప్పింది. తనకి వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించాలని ఉంది అంటూ అలాగే నాట్యం ఆధారంగా తీసే మూవీస్ లో ఎక్కువగా చేయాలి అంటూ ఆసక్తి ఉంది అంటూ చెప్పుకొచ్చింది నిధి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తను నటన పరంగా ఎలాంటి తేడాలు చూపించలేదని అన్నారు.

ఆమె కెరీర్ అంత సక్సెస్ ఫుల్ గా లేదు. వరుస ఫ్లాప్ లతో కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా వచ్చిన “హీరో” అనే మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమాల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ కథానాయకునిగా పెట్టి అత్యధిక బడ్జెట్తో నిర్మిస్తున్న” హరిహర వీరమల్లు “అనే మూవీలో నిధి అగర్వాల్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించనున్నారు.

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్స్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ రిలీజ్ విషయానికి వస్తే వచ్చే సంవత్సరం రిలీజ్ కానుంది. నోరా ఫతేహి అనే మరో హీరోయిన్ కూడా పవన్ కళ్యాణ్ మూవీలో నటిస్తున్నారు. “మున్న మైకేల్ “అనే హిందీ మూవీతో సిల్వర్ స్క్రీన్ లోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ విషయానికొస్తే” సవ్యసాచి “అనే మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నిధి.

నిధి కెరీర్ లోనే ఇస్మార్ట్ శంకర్ మూవీ క్లీన్ హిట్ అందుకుంది. ఈ మూవీలో నభ నటేష్ కూడా హీరోయిన్గా చేశారు. ఈ మూవీ 75 కోట్లు వరల్డ్ వైస్ గ్రా స్ తో వసూళ్లు చేయగలిగింది. ఇలాంటి మూవీ ఆమె కెరీర్ లో ఇంతవరకు ఇంకా రాలేదు.