Guppedantha manasu Serial today:దేవయాని ఉచ్చులో చిక్కుకొని ఇంటి నుండి వెళ్లిపోయిన మహేంద్ర, జగతి. ఒకటైన రిషి ధార:

Guppedantha manasu serial ఈరోజు కథ: ఇంట్లో ప్రేమలు, సంతోషాలు లేవు. రిషి జీవితానికి, ప్రేమకి నేను అడ్డు అని, నేను రాక్షసి అని అనుకుంటున్నారు? నిజానికి రిషి జీవితానికి, ప్రేమకు మీరే శత్రువులు, గురుదక్షిణ ఒప్పందమే లేకపోతే ఈ పాటకి కలిసిపోయేవారు. వాళ్లకి మీరే అడ్డుగా ఉన్నారని అంటుంది. ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ 586 గుప్పెడంత మనసు సీరియల్ పూర్తి కథ.

దేవయాని అన్న మాటలకు జగతి, మహేంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం.

Guppedantha manasu

ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని చెప్పకుండానే చెప్పిన దేవయాని:

దేవయాని, జగతి, మహేంద్ర తో మాట్లాడిన సంఘటన గురించే ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. ప్రొద్దున వెళతాడు, రాత్రికి ఇంటికి వస్తాడు. రిషి మంచి చెడ్డలు పట్టించుకోరు, రిషికి ఏం కావాలో తెలియదు, మీ లోకం మీది, ఏం తల్లిదండ్రులు అని, నేను ఇవన్నీ రిషి ముందు అంటే ఏమవుతుందో తెలుసా? మీరు ఇంట్లో ఉన్నా, లేనట్లే.

మీరు ఇంట్లో నుంచి వెళితే రిషి ఆనందంగా ఉంటాడని, ఇంట్లో ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది, అందరూ స్వార్థపరులుగా మారుతున్నారని దేవయాని అంటుంది. దేవయాని మాటలు విన్న మహేంద్ర మనం పరిష్కారం మార్గం ఆలోచించాలి. ఇలా మాటలు పడడం నావల్ల కాదని అంటాడు.

ఇద్దరం ఒకటేనని చెప్పిన వసుధార:

ఏంటి సడన్ గా వచ్చారని రిషిని వసుధార అడుగుతుంది. నాకు చూడాలనిపించిందని రిషి చెప్పగానే, వసు కూడా అదే మాట చెబుతుంది. నా మీద నీకెందుకు నమ్మకం అని అంటాడు. ప్రేమ అంటుంది. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఆపి మీరు ఏమవుతారు? అని అడుగుతే నువ్వు ఏ సమాధానం ఇస్తావు అంటాడు.

మిమ్మల్ని అడగమని చెబుతాను సార్ అంటుంది. ఎవరో ఎందుకు, నేనే అడుగుతున్నాను, మనం ఏమవుతాం? అంటాడు ఒకరికి ఒకరం తోడవుతామని అంటుంది. ఎండలో నేను మీకు నీడనవుతాను. వానలో మీరు నాకు గొడవ అవుతారు అని సమాధానం ఇస్తుంది.

దేవయాని అన్న మాటలకు పరిష్కారం ఆలోచించాలి అన్న మహేంద్ర:

మహేంద్ర, రిషి మాటలు గుర్తుకు చేసుకొని రిషికి ఫోన్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎందుకు మనల్ని అర్థం చేసుకోవడం లేదని, మనమే రిషికి శత్రువులం అవుతున్నామా? అని చెప్పి అయినా ఫోన్ ఆన్ లో ఉన్న మాట్లాడాలి అనుకుంటే కదా ఫోన్ తీసేది, ఏ గొడవ లేకుండా స్విచ్ ఆఫ్ చేశాడు.

దేవయాని మాటలు గుర్తుకు చేసుకొని దేవయాని వదిన ఒక పెద్ద ప్రశ్న బాణంగా విసిరింది పరిష్కారం ఏంటని? జగతిని అడుగుతాడు. ఆ మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయని జగతి అంటుంది. సమాధానం ఇవ్వాలి లేదా పరిష్కారం ఆలోచించాలని? అంటాడు. నచ్చచెప్పి చూద్దాం అని అంటుంది. నచ్చచెప్పే స్థాయి దాటిపోయింది. నేను చెప్పింది విను అంటాడు.

ప్రేమలో మునిగి తేలుతున్న రిషి, వసుధార:

వసు, రిషి ప్రేమలో మునిగితేలుతూ ఒకరినొకరు అనుకోని కూర్చొని ఉంటారు. మనసు బాగాలేదని ఇక్కడికి వచ్చాము. ఏ మాయో ఏమో తెలియదు. మనసులో బాధంతా ఎగిరిపోయిందని రిషి అంటాడు. నాకు కూడా అలాగే ఉంటుందని చెప్పి, నమ్మకం, ప్రేమ వలనే ఇదంతా జరుగుతుందని చెబుతుంది.

Guppedantha manasu

ఆ చీకటి, ఈ వెలుగు, చినుకుల వల్లే హాయిగా ఉందని అంటాడు. అందుకే ఎలాంటి డిస్టర్బ్ ఉండకూడదని ఇద్దరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టానని అంటుంది. ఏంటని పక్కకు జరగగానే వసు తన ఒళ్ళు పడిపోతుంది .ఎన్నో అనుకున్న అందామని అనుకున్న ఏదీ రాదు ఏంటి పెదవుల పైన అనే బ్యాగ్రౌండ్ సాంగ్ వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.

ఇల్లు విడిచి వెళ్లిపోతున్న జగతి మహేంద్ర:

మహేంద్ర, జగతి ఇంట్లో నుండి వెళ్లిపోవటానికి రెడీ అవుతారు. దేవయాని వదిన చెప్పింది కదా! రిషి అన్ని సమస్యలకు కారణం మనమే. మనం వెళ్లిపోవడమే కరెక్ట్. ఇక ఈ ఇంటికి, అన్నిటికీ ఇలాంటి సంబంధం లేదు. అన్నిటికీ దూరంగా వెళ్దాం రా అని అంటాడు.

వెళుతూ రిషి ఫోటోను చూస్తూ, ఏడుస్తూ రిషి మాటలు గుర్తుకు చేసుకుంటాడు. బాధతో రిసీ ఫోటోను తీసుకొని, దానిపై ఒక మాట రాసి వెళ్లిపోతారు. గాలినింగినీరుభూమినిప్పు రావా వద్దనలేరా అనే పాట బ్యాగ్రౌండ్ లో వస్తుంది. మహేంద్ర ,జగతి ఇల్లు విడిచి వెళ్ళిపోతారు అదంతా దేవయాని దూరం నుంచి చూస్తూ సంతోషపడుతుంది.

రిషి ,వసుధార ఒకరిపై ప్రేమను ఒకరికి తెలియజేసుకోవటం:

ఇక్కడ వసుధార అలాగే కూర్చుని ఉంటారు. జీవితం విచిత్రంగా ఉంటుంది కదా వసుధార అంటాడు.సింపుల్గా

చెప్పాలంటే మన టేబుల్ ముందు ఐస్ క్రీమ్, కాఫీ రెండు ఉన్నట్లే ఉంటుంది. బాగా చెప్పావని అంటూ చిరునవ్వు నవ్వుతాడు. వసుధార తననే చూస్తూ ఉంటుంది. ఎందుకలా చూస్తూ ఉన్నావు? అంటే మీ నవ్వు చాలా బాగుంది. అలాగే చూడాలనిపిస్తుంది అని అంటుంది. నవ్వకుండా ఉండాలని నేనేమీ ఎప్పుడూ అనుకోను నా జీవితంలో గడిచిన సంఘటన వలన అలా అయిపోయాను, నువ్వు వస్తూ వస్తూ టన్నుల కొద్ది సంతోషాన్ని, నవ్వులను తీసుకొచ్చావేమో? అని అంటాడు.

నేను రావడం కూడా జగతి మేడం వలనే కదా అని అంటుంది. మనం ప్రతిసారి మన ఇద్దరి గురించి తక్కువగా మాట్లాడుకుంటాం. ఈరోజు కాస్త మన గురించే ఎక్కువగా మాట్లాడుకున్నాము. ప్రతిసారి ఇలానే ఉందాం అంటాడు. ఎప్పుడూ గలగల మాట్లాడే దానివి, ఇప్పుడేంటి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావు? నేనే మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడవా? అంటాడు. మాట్లాడుతుంటే వినడం, నవ్వుతుంటే చూస్తూ ఉండడం చాలా బాగుంటాయని అంటుంది.

ఎప్పటినుండో మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను? అని అంటుంది. ఏంటని అడుగుతాడు. మీ ఫోన్లో నా పేరు పొగరు అని ఎందుకు ఉంది? వసుధార అనే పేరు ఉంది కదా అంటుంది. చిన్నపిల్లలకు బుజ్జి, చిన్ను, చంటి అని పేర్లు ఉన్న ఎందుకు పేర్లతో పిలుస్తారు. ముద్దు పేర్లుగా అని అంటుంది. నీ పేరు బాగుంది. ఎందరో ఆ పేరుతో పిలుస్తారు. అందరు ఫోన్ లో అదే పేరుతో ఉంటుంది. నువ్వు నాకు స్పెషల్.

పొగరు అంటే తిట్టు అనుకున్నావా? కాదు, ప్రేమ. అని ఈ పిలుపు నాకే సొంతం అంటాడు. వసుధార రిషిభుజంపై వాలి, ఈరోజు గుండె తట్టుకోలేనంత హాయిగా ఉందని అంటుంది. ఇలాంటి అప్పుడే నాకు చాలా భయం వేస్తుంది. నేను ఎవరిని ఇష్టపడ్డ వాళ్ళు నాకు దూరం అవుతారు. మనం కూడా అని చెబుతుండగానే వసుధార నోటుకి చేయి అడ్డం పెట్టి, అలా అనవద్దని అంటుంది. నాకంటూ నేను ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉన్నారు? నువ్వు, డాడీ. నాకు డాడ్ కదా లోకం.

డాడీకి నేనంటే ప్ ప్రాణం,డాడ్ అంటే నాకు ప్రాణం, డాడీని చూడకుండా నేనొక్క రోజు కూడా ఉండలేను,నా సంగతి పక్కన పెడితే ఆయన కూడా ఉండలేదని చెబుతాడు. ఏదేమైనా ఈరోజు మనం చాలా కొత్తగా మాట్లాడుకుంటున్నాం అంటాడు. మీరు ఎప్పటికీ ఇలాగే ఆనందంగా ఉండాలని వసు అంటుంది.

జగతి, మహేంద్ర కు అలాగే రిషికి, వసుధారకు కారులో జరుగుతున్న సంభాషణ:

ఇక్కడ జగతి, మహీంద్ర,దేవయాని మాటలు, రిషి మాటలు గుర్తుకు చేసుకుంటూ కార్లో వెళ్ళిపోతుంటారు. కారులో రిషి వసుధార కూడా హాయిగా ఉందని మాట్లాడుకుంటూ వస్తారు. గుండె బరువుగా ఉందని, ఎప్పుడు కూడా రిషికి నేను దూరంగా వెళతాను అనుకోలేదని, జగతితో చెబుతూ బాధపడతాడు మహేంద్ర.

గుండెల నిండా ప్రేమ ఉన్నవారికి బాధ, కోపం వెంటనే మారిపోతాయని వసు ,రిషితో అంటుంది. మహేంద్ర రిషికి నేను దూరంగా వెళుతున్నాను, ఇది కళ అయితే బాగుంటుందని అంటాడు. భరించాలి మహేంద్ర, భరిద్దాం. రిషికి మనం ఇచ్చే కానుక అని అనుకుందామని జగతి అంటుంది. నిన్ను ఆ దేవుడే నాకు ఇచ్చిన కానుక అని రిషి అంటాడు.

Guppedantha manasu

లేదు మీరే నాకు ఒక గొప్ప కానుక, అపురూపమైన కానుకగా మీరు నాకు దొరికారని, వసుధార అంటుంది. ఇది ఈరోజు జరిగిన గుప్పెడంత మనసు సీరియల్ 587 ఎపిసోడ్ పూర్తి కథ.

దారిలో జగతి మహేంద్ర లను వసుధార కలుసుకొని మాట్లాడుతారా లేక ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.