Guppedantha manasu serial today:రిషి వసుధార మధ్య చిచ్చు పెట్టబోతున్న దేవయాని..

Guppedantha manasu సీరియల్ ఈ రోజు కథ:రిషి వసుధార మధ్య చిచ్చు పెట్టబోతున్న దేవయాని
ప్రేమలో మునిగి తేలుతున్న రిషి, వసుధార:
రిషి సార్ అరిచారు, అరిస్తే అరవని, నా రిషి సార్ కదా! మేడం కలిసిన సంగతి చెప్పకుండా ఉంటే బాగుండేది, ఎంతైనా నేను రిషి సార్ ఒకటే కదా! రిషిధార అంటేనే మేమిద్దరం కదా! అనుకుంటూ, “వి ఆర్” అక్షరాన్ని నోట్ బుక్ లో రాసి మురిసిపోతూ ఉంటుంది.

ఇంతలో రిషి వచ్చి నోట్స్ లాక్కుంటాడు. నోట్ బుక్ ఇవ్వండి అంటుంది. నోట్స్ అంతా చూసి, ఇందులో నా పేరు కూడా ఉందని అంటాడు. అది నా నోట్స్, నేను రాసుకున్నాను అంటుంది. అలిగావా అని అడుగుతాడు. మీ కోపం నాకేం కొత్త కాదు, అలవాటయింది అని అంటుంది. తిట్టినా ప్రేమ పెరుగుతుందా? అంటాడు. ప్రేమ దేనికి ప్రభావితం కాదని వసు చెప్పగానే, వసూ చెయ్యి పై ఆటోగ్రాఫ్ అంటూ “వి ,ఆర్ “మరియు జెంటిల్మెన్ అని రాస్తాడు.

పొగరుగా సమాధానం ఇస్తున్నావుగా అంటాడు. మీరే పేరు పెట్టారు కదా అంటుంది. నేను పొగరు అని పిలుస్తానని నీకు ఎలా తెలుసు? అని అడుగుతాడు. వసుధార పడిపోయినప్పుడు పొగరు అని పిలిచిన విషయం గుర్తుకు చేసుకుంటూ, అలాగే రిషి కోసం వచ్చి ఫోన్ చేస్తే ,తన ఫోన్ లో పొగరు అనే పేరు చూసి మీరు ఈ పేరు ఎందుకు పెట్టారు అని అన్నా. విషయం గుర్తుకు చేసుకొని చెబుతుంది. ఒక ఇలా ఒకరినొకరు మాట్లాడుకుంటుంటారు.

Guppedantha manasu

అక్షరాలను చూస్తూ ఇవి అక్షరాలు కాదు రెండు మనసులు, రెండు జీవితాలు అంటూ మురిసిపోతుంది. ఈ రెండు అక్షరాల మధ్య ఎడబాటు లేదు, మనము అలాగే ఉండాలని అంటాడు. ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాం అని, చేతిలో చేయి పెట్టి ఇదే నా ప్రామిస్ అంటాడు.


రిషి బాధను చూసి తట్టుకోలేకపోతున్నాను అన్న గౌతమ్:
మహేంద్ర దగ్గరికి గౌతమ్ వచ్చి రిషి బాధపడుతున్నాడు అని చెబుతాడు. ఎందుకు ఇదంతా, ఎన్నాళ్ళు ఇలా ఉంటారు. వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లేలా ఉంది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అంటున్నాడు. ఇలా జరిగితే మీ మీద, నా మీద నమ్మకం పోతుంది. నన్ను క్షమించడు, ఎందుకు మీరు బాధపడుతూ రిషి ని బాధపడుతున్నారు, రిషి మనుషుల పట్ల తప్పుగా ఆలోచించేటట్లు మనం అవకాశం ఇస్తున్నాము, ఇలాగే ఉంటే రిషి కి మనుషుల మీద, బంధాల మీద నమ్మకం లేకుండా పోతుంది అని చెబుతాడు.

ఈ అజ్ఞాతవాసం విడిచిపెట్టండి. ఇది ఇక్కడితో ఆపండి. అని చేతులెత్తి దండం పెడతాడు, పెద్దవాళ్లు మీకు ఇంతకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నాను, వాడి బాధ చూడలేకపోతున్నానని చెప్పి గౌతమ్ వెళ్లిపోతాడు. జగతి గౌతమ్ మాటలు విని భయంగా ఉందని అంటుంది.


రిషి గురించి బాధపడుతున్న వసు:
రిజల్ట్స్ పని అయిపోయాక మినిస్టర్ గారు చెప్పిన మిషన్ ఎడ్యుకేషన్ పని చూడాలని వసుతో అంటాడు రిషి. అలాగే అని చెప్పి, మధ్యాహ్నం భోజనం టైం అయిందని వసు అంటుంది. రిషి నాకు ఆకలిగా లేదు అని అంటాడు. మహేంద్ర సార్ వెళ్లినప్పటి నుండి మీరు సరిగ్గా భోజనం చేయడం లేదని అంటుంది.


వసును రిషికి దూరం చేయాలని ప్రయత్నిస్తున్న దేవయానీ:
రిషి ఆకలి తెలుసుకునేది ఈ పెద్దమ్మ ఒక్కటే అని దేవయాని అంటుంది. నాకు తెలుసు నాన్న నీ ఆకలి గురించి నేను ఇంట్లో ఉన్నానే గాని, నా మనసంతా నీ మీదనే ఉంటుందని అంటుంది. చూసావా? పెద్దమ్మ మనసు ఎంత మంచిదో అంటాడు. అంతా నటన ,ప్రేమ లేదు, ఏమీ లేదు, మీరు ఎప్పుడు తెలుసుకుంటారో, ఏంటో ?అని మనసులో అనుకుంటుంది వసుధార. వసుధారని చూసి ఏంటి అలా చూస్తున్నావ్? నా ప్రేమలో ఏదైనా లోపం ఉందా? అని దేవయాని అడుగుతుంది. పెద్దమ్మ మీ ప్రేమలో ఇసువంతైన లోపం ఉండదు, మీరు ఎప్పుడూ అలా అనుకోకండి, మీ ప్రేమ మీద ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను అంటాడు.

ఏంటి నాన్న నా గురించి కొత్తగా చెబుతున్నావు, నా గురించి వసుధార కు ముందే తెలుసు కదా! అని ఏం వస్తుందార నా గురించి నీకు తెలుసు కదా! అని చెప్పి భోజనానికి రెడీ చేయమని చెబుతుంది.
మాటకు మాట సమాధానం ఇచ్చిన వసుధార:
నేను వడ్డిస్తాను, మీరు కూడా కూర్చుని తినండి మేడం అంటుంది వసు. ఆ ఛాన్స్ నేను నీకు ఇవ్వను. అదే నేనుండగా నీకు పని పెడతానా? అంటూ కూర్చో నీకేం కావాలో చెప్పు, నేనే వడ్డిస్తాను అంటుంది. రిషికి వడ్డిస్తుంటే, పెద్దమ్మ తనక్కూడా వడ్డించండి అని చెబుతాడు.

ఎప్పుడు ఏం వడ్డించాలో నాకు తెలుసు! అని డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడుతుంది. వసుకు వడ్డిస్తూ, తిను బాగా తిను, మొహమాట పడకు ,ఇంకొంచెం వడ్డించనా అంటుంది. వడ్డించండి మేడం. మీరు ఇంత ప్రేమ చూపిస్తుంటే, నేనెందుకు వద్దంటాను అంటూ వసు కూడా కౌంటర్ ఇస్తుంది. నా ప్రేమ ఇప్పుడేం చూసావు, ముందు ముందు చాలా చూస్తావు ,నా ప్రేమను తట్టుకోలేవు అంటుంది. అవును వసుధార పెద్దమ్మ ప్రేమ తట్టుకోలేము అంటాడు. కొంచెం వేసుకో, వసుధార అంటుంది. చాలు మేడం అంటుంది.

అప్పుడే అయిపోతే ఎలా? చూడాల్సిందే చాలా ఉందని అంటుంది. వసుదార తనను చూడగానే, అదే రుచి చూడాల్సింది అంటూ మాట్లాడుతుంది. చిన్నప్పటినుండి పెద్దమ్మ ఇలాగే తినిపిస్తుంది. చూస్తున్నావు కదా! అని అంటాడు. అవును సార్ అంటుంది. ఇప్పుడే చూశావు, చూడాల్సింది ముందు ముందు చాలా ఉందని దేవయాని అంటుంది. దేవయాని మేడం అనుకున్న దానికంటే ప్రమాదకరమైనదని, తనతో జాగ్రత్తగా ఉండాలని వసూ మనసులో అనుకుంటుంది.

రిషి లాంటి తెలివైన వాడినే నా ప్రేమతో తప్పు త్రోవ పట్టించేలా చేశాను? నువ్వు ఒక లెక్క అని దేవయాని కూడా మనసులో అనుకుంటుంది. ఏంటి వసుధర పెద్దమ్మ దగ్గర నీకు భయం ఎందుకు? అర్థం చేసుకోవాలి గాని పెద్దమ్మ మనసు వెన్న అంటాడు. అవును సార్ అర్థం చేసుకోవాలి కదా! అర్థం చేసుకుంటున్నాను అంటుంది. దేవయాని మేడం నిజ స్వరూపాన్ని మీరే కరెక్టుగా అర్థం చేసుకోలేదు సార్, ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను, అప్పుడు ఉంటుంది దేవయాని మేడంకి అని వసు మనసులో అనుకొని తింటుంది.


రిషి గురించి బాధపడుతున్న జగతి, మహేంద్ర:
మహేంద్రకు జగతి కాఫీ తీసుకొని వస్తుంది. జగతి ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి, కాలేజీలో వర్క్ ఎక్కువగా ఉంటుంది, నువ్వు లేవు, నేను లేను, మిషన్ ఎడ్యుకేషన్ పని ఉండి అన్నయ్య కూడా వెళ్లిపోయాడని మహేంద్ర అంటాడు. రిషి ఒంటరి కాలేదు, మనమే రిషిని ఒంటరి చేస్తున్నాం అంటుంది. కాలేజీలో వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిషి ఎలా చేస్తాడో? ఏంటో? అంటాడు. వెళ్లిపోదాం అని జగతి అంటుంది. మనం ఒకటి అనుకున్నాం. దాన్ని చివరిదాకా నమ్ముదాం.

నేను ఆలోచిస్తుంది, వెళ్దామా? వద్దా? కాదు, రిషి టెన్షన్ పడతాడేమో అని ఆలోచిస్తున్నాను అంటాడు. నువ్వేమి టెన్షన్ పడకు, రిషికి తోడుగా వసు ఉంది. రిషి భారాన్ని టెన్షన్ ని తగ్గిస్తుంది అంటుంది, ఏం చేసినా వసుధారనే చేయాలని మహేంద్ర అంటాడు.


రిజల్ట్స్ రాబోతున్నందుకు భయపడుతున్న వసుధార:
వసుధార సెల్ఫోన్లో పుష్పతో సమయానికి జగతి మేడం కూడా లేదు పుష్ప, నాకు చాలా భయంగా ఉందని అంటుంది. ఎందుకు భయపడుతున్నావు? భయపడితే నేను భయపడాలి అంటుంది. పుష్ప జగతి మేడం పక్కన ఉంటే ధీమాగా ఉండేది, రిషి సార్ పక్కనే ఉన్న ధైర్యంగానే ఉంది, కానీ రిజల్ట్స్ ఎలా వస్తాయో? ఏంటో? అని భయపడుతుంది.

టెన్షన్ పడకు నువ్వే టాపర్ అంటుంది. టాప్ గా నిలవాలి, ఆ విజయం కోసమే కదా జీవితంలో అన్నీ వదిలేసి, అమ్మ ,నాన్నను ,అందరిని వదిలేసి వచ్చాను, చివరి ఎగ్జామ్ కైతే లాస్ట్ వరకు టెన్షన్ పడ్డాను అంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చాయో నాకు మాత్రమే తెలుసు అంటుంది. అంత కష్టపడ్డావు కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తావు అంటూ పుష్ప అంటుంది. ఇలా వసుధార పుష్పతో మాట్లాడుకుంటూ రీషి ని చూస్తుంది.