Guppedantha manasu:కృష్ణానగర్ లో రెండు రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. గుప్పెడంత మనసు సీరియల్ లో మేడం క్యారెక్టర్ లో నటిస్తున్న నాగవర్ధిని తన లవర్ ను రెండంతస్తుల పైనుంచి క్రిందకు తోసేసింది. ఈ సంఘటన నిదానంగా వెలుగులోకి వచ్చింది. నాగవర్ధిని క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆమెకు పెళ్లయి, ఒక పాప కూడా ఉంది. అయితే సూర్య అనే అతనితో షూటింగ్స్ లో పరిచయమై వాళ్ళిద్దరి మధ్య ఆ పరిచయం ప్రేమగా మారింది. వీళ్ళిద్దరూ కలిసి ఒక అపార్ట్మెంట్లో లివింగ్ రిలేషన్ లో ఐదేళ్ల నుంచి ఉండేవారు. అయితే ఈ సంవత్సరం సూర్య తన క్లోజ్ ఫ్రెండ్ అని శ్రీను అనే అతనిని తీసుకొని వచ్చి అదే రూమ్ లో పెట్టుకున్నాడు. అయితే కాలక్రమేనా నాగవర్ధిని, శ్రీను ప్రేమలో పడ్డారు. దీంతో నాగావర్ధినికి, శ్రీనుకి, సూర్యకి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవల కారణంగా సూర్య ఆ రూమ్ నుండి బయటకు వచ్చి, అదే అపార్ట్మెంట్లో ఫైవ్ పోర్షన్ లో ఒక చిన్న రూమ్ లో ఉండేవాడు. సూర్య పక్కకు ఉన్న గాని, తరచుగా వీళ్ళ మధ్య గొడవలు వస్తూ ఉండేవి. అతనిని సూటిపూట మాటలు అంటూ ఉండేవారు. అయితే ఆదివారం రోజు సూర్య నాగవర్ధిని దగ్గరకు వచ్చి, తనకు సీరియల్ లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చిందని, తన లైఫ్ ఇక బాగుంటుందని, తనతో వచ్చేయమని అడిగాడు. దీంతో వీరి మధ్య మళ్ళీ గొడవ జరిగింది. నాగవర్ధిని శ్రీను అనే తన లవర్ తో కలిసి సూర్యుని కిందికి తోసేసింది.
ఈ ఘటన ఏ విధంగా జరిగిందో అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షి ద్వారా తెలుసుకుందాం:
నాగవర్ధిని, సూర్య చాలా బాగా ఉండేవారు. వాళ్లు ఐదేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారని, అక్కడున్న వాళ్లు చెబుతున్నారు. అయితే వీళ్ళిద్దరూ ఉన్న రూమ్ కి సూర్య తన ఫ్రెండు తీసుకొని వచ్చాక, అతను వచ్చిన పది రోజులకే వీళ్ళ మధ్య గొడవలు మొదలయ్యాయి. వాళ్ళిద్దరూ కలిసి ఇతనిని సూటిపోటి మాటలు అనడం, సరిగ్గా తిండి పెట్టకపోవడం వంటివి చేసేవారని, దాంతో అతను పక్కకు ఉన్నాడని చెప్పారు. సూర్య పక్కకు వెళ్లిన తర్వాత శ్రీను, నాగవర్ధిని కలిసి ఉండేవారని చెబుతున్నారు. తను పక్కకు వచ్చినా కానీ, ఈ విషయంపై తరుచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. రాఖీ పండుగ రోజు కూడా వీరి మధ్య పెద్ద గొడవ జరిగిందట. శ్రీను, నాగవర్ధిని కలిసి సూర్యుని బాగా కొట్టారని, అక్కడ నివసిస్తున్న వారు కూడా చెబుతున్నారు.
అయితే నాగవర్ధిని అక్కడ ఉండే వారితో ఎవరితో మాట్లాడేది కాదని, తను ఒక సైకో లాంటిదని చెబుతున్నారు. కానీ సూర్య మాత్రం చాలా మంచివాడని, అతనికి ఎటువంటి చెడు అలవాట్లు లేవని, నాగవర్ధిని, శ్రీను వల్లనే తను చాలా సఫర్ అయ్యారని అంటున్నారు.నాగవర్ధునికి దూరంగా ఉండిన తర్వాత అపార్ట్మెంట్స్ వాళ్ళకి క్లోజ్ అయ్యి, అతని విషయాలన్నీ చెప్పేవాడని చెబుతున్నారు. ఎప్పటి లాగానే వారి మధ్య గొడవ మొదలయింది. ఆదివారం రోజు బాగా గొడవపడ్డారు. వాళ్ళు ముగ్గురు గొడవ పడుతుండగానే, కోపంతో నాగవర్ధిని, తన లవర్తో కలిసి సూర్యని రెండు అంతస్తులపై నుంచి తోసేశారు.
ఆ సమయంలో ఒక అమ్మాయి చూసింది. ఆ అమ్మాయి చెప్పిన మాటలు ప్రకారం చూస్తే, కావాలని నాగవర్ధిని, శ్రీను చంపటానికి త్రోసినట్లుగా ఉంది. త్రోసిన వెంటనే నాగవర్ధిని, శ్రీను ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నారట. సూర్య మాత్రం అక్కడ ఉన్న తిగలపై పడి ఆ తర్వాత కిందకు పడిపోయాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే అంబులెన్స్ కూడా ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి నాగవర్ధినిని, శ్రీను ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే ఈ విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది. వాళ్ల మధ్య గొడవలకు కారణం శ్రీను అని అంటున్నారు. శ్రీనుకు కూడా పెళ్లయింది. పిల్లలు ఉన్నారు. ఇతను వచ్చిన తర్వాతనే సూర్యకు, నాగవర్ధినికి గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే సూర్య పరిస్థితి మాత్రం బాగాలేదు అంటున్నారు. ఆయన శరీరం ట్రీట్మెంట్ కు సహకరించట్లేదని ఆయన బ్రతికే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.