Guppedantha manasu serial today:దేవయానికే ఎదురు సమాధానం ఇచ్చిన వసుధార.

దేవయానికే ఎదురు సమాధానం ఇచ్చిన వసుధార.

Guppedantha manasu సీరియల్ ఈ రోజు కథ: సమస్యకు పరిష్కారం నేనే చూస్తానని అన్న వసుధార:
మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, నా మనసులో అలజడి కలిగింది. మనసుకు దగ్గరగా ఉండేవారు మనకు తెలియకుండానే, మనల్ని కలిసినప్పుడు కలిగే ఫీలింగ్. నేను అలాగే ఫీల్ అయ్యాను. డాడ్ వాడే పర్ఫ్యూమ్ పరిమళం నా మనసును ఆస్వాదించింది, కానీ డాడ్ కావాలనే నన్ను దూరంగా పెడుతున్నారు. ఎప్పటికీ కలవకూడదని ఇలా చేస్తున్నారా, నేనంటే తనకు అవసరం లేదా? నేనేం నేనేం చేశానని? అంటూ రిషి బాధపడతాడు.

మీరు ఓపికగా ఉండండి. కచ్చితంగా సార్ వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారు అంటూ వసుదార ఓదార్చుతుంది. ఎయిర్ పోర్టుకు వెళ్లేదారిలో ఉంటారు. మనం వెళితే కనుక్కోవచ్చు అంటుంది. వాళ్ళ మాట నువ్వు నమ్ముతున్నావా? వాళ్ళని మనం కనుక్కోకుండా ఉండటానికి ఆ మాట చెప్పారు. మినిస్టర్ గారికి ఏ విషయాలు తెలియక మనకలాగే చెప్పారు అని అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ విజిట్స్ కోసం వాళ్లకి, ఎయిర్పోర్ట్ కి సంబంధం లేదు. ఇక్కడే ఎక్కడో ఉన్నారని అంటుంది.

వాళ్లు ఎక్కడున్నా ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి, రిజల్ట్స్ రోజు కచ్చితంగా రావాలి కదా! అని అంటుంది. ఆరోజు వస్తారు, అని నేను ఎదురు చూస్తున్నాను అంటాడు. ఏదేమైనా ఈ సమస్యకు పరిష్కారం నేనే చూస్తానని తన మనసులో అనుకుంటుంది వసుదార.


మినిస్టర్ ఇంటి వద్ద జరిగిన విషయాన్ని గౌతమ్ కు చెప్పిన మహేంద్ర:
ఏంటి అంకుల్ రిషికి కనిపించారా? అని గౌతమ్ మహేంద్రను అడుగుతాడు. లేదు కొంచెం మిస్ అయింది. కనిపిస్తే పరిస్థితి ఎలా ఉండేదో? అని అంటాడు. మీరు వాడికి కనిపిస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది? అపార్థం చేసుకునే వాడేమో? ఇదంతా ఎందుకు, వచ్చేయండి అంటాడు. ప్రతిసారి ఇదే మాట చెప్పకు, ఒక నమ్మకంతో రిషికి దూరమయ్యాను, బాధపడుతున్నాడు, నేను బాధపడుతున్నాను. ఇంకా నేనొకటి అనుకున్నాను, అది జరగాలి, అలాగే వసుధారను ఒకటి అడగమని చెప్పాను కదా! అడిగావా? అంటాడు.

ఆ బాధ నుంచి బయటికి తీసుకురావడానికి అనుక్షణం ప్రయత్నిస్తుంది అని అంటాడు. వసు ఒక్కతే ఈ పరిస్థితులను అర్థం చేసుకుంటుంది అని మహేంద్ర అంటాడు.
మహేంద్ర వాళ్ళు వచ్చిన సంగతి ఇంట్లో చెప్పిన రిషి:
గౌతమ్ ఫోన్లో మాట్లాడుతుండడం దేవయాని చూసి, ఎవరితో మాట్లాడుతున్నావని? అడుగుతుంది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో? నాకు తెలుసు! ఇక్కడ విషయాలన్నీ అక్కడ చెబుతున్నావా? అని అనగానే గౌతమ్ షాక్ అవుతాడు. ఏంటి పెదనాన్నకు ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెబుతున్నావా? అవన్నీ నేను చూసుకుంటాను అంటుంది. ఆయన్ని టెన్షన్ పెట్టకు అని అంటుంది. అలాగే పెద్దమ్మ మీరు తెలివైన వారు, పెద్దమ్మ బాగా అర్థం చేసుకుంటారు అంటూ గౌతమ్ మాట మారుస్తాడు.


ఇంతలో రిషి అక్కడికి వచ్చి మినిస్టర్ దగ్గరికి మహేంద్రవాళ్లు వచ్చిన సంగతి చెప్పి, నేను వెళ్లే లోపే వెళ్లిపోయారని చెబుతాడు. కొందరు ఈ ఇంటికి వచ్చాక మనుషులు స్వరూపాలు మారిపోయాయని ఇండైరెక్టుగా వసుధారను అని, నువ్వు బాధపడకు రిషి అని ఓదారుస్తుంది దేవయాని. అందరి స్వరూపాలు, స్వభావాలు అన్ని బాగున్నాయి. మీ గురించే సారుకు తెలియాలి. ఆ తర్వాత అంతా బాగుంటుందని వసుధార మనసులో అనుకుంటుంది.


మహేంద్రను గట్టిగా కౌగిలించుకున్న రిషి:
రిషి, మహేంద్ర రూమ్ కు వచ్చి చూస్తూ, కలిసి ఉన్న విషయాలన్నీ గుర్తుకు చేసుకుంటూ, బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మహేంద్ర వచ్చినట్లుగా, డాడ్ అంటూ గట్టిగా కౌగిలించుంటాడు. కానీ అక్కడ వచ్చింది గౌతమ్. గౌతమ్ ఏంటి? ఏమైంది? అని రిషిని అడుగుతాడు. ఇదంతా కళ అనుకొని బాధపడతాడు. నువ్వు టెన్షన్ పడకు, వాళ్ళు కచ్చితంగా తిరిగి వస్తారని గౌతమ్ ఓదార్చుతాడు. దీనికి నేను ఏదో ఒకటి చేయాలి. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని, ఇవ్వాలని డిసైడ్ అయ్యాను అంటూ రిషి చెప్పగానే, గౌతమ్ తడబడుతూ పోలీస్ స్టేషన్కు అవసరమా? అని అంటాడు. వాళ్లు కావాలనే తప్పించుకొని తిరుగుతున్నారు, అసలు ఏమైందో తెలియదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటాడు. కంప్లైంట్ ఇచ్చి అందరికీ తెలిసేలా చేయడం మంచిది కాదు. అని గౌతమ్ చెప్తుండగానే, నన్ను ఒంటరిగా వదిలేయమని చెప్పగానే గౌతమ్ వెళ్ళిపోతాడు.


వసుధారకు ధైర్యం చెప్పిన రిషి:
వసుధార లాస్ట్ ఎగ్జామ్ రాసిన దాని గురించి గుర్తుకు చేసుకొని, భయంగా ఉంటూ ఆలోచిస్తూ ఉంటుంది. రిజల్ట్స్ ఎలా వస్తాయో, అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ రిషి తన తండ్రిని గుర్తుకు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అంత లోపల రిషి, వసుధారని చూసి, ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకు నిద్రపోవడం లేదని? అడుగుతాడు. రిజల్ట్స్ గురించి టెన్షన్ గా ఉంది, భయంగా ఉందని అంటుంది. రిషి వసుధారకు ధైర్యం చెప్పి, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకో, ఆలోచించకు అన్ని విషయాలలో ధైర్యంగా ఉండే నువ్వు ,ఎందుకిలా భయపడుతున్నావు? అని తనని దగ్గరికి తీసుకుంటాడు.
దేవయాని మాటకు మాట సమాధానం ఇచ్చిన వసు: వసు కూరగాయలు కట్ చేస్తూ ఉండగా ధరణి అన్ని పనులు చేస్తావు, విసుగు పడకుండా ఉంటావు అని అంటుంది. విసుగు లేకుండా చేస్తే మన మనసుకు ఆనందంగా ఉంటుందని అంటుంది.

కాఫీ ఎవరికి అని అడగగానే, అత్తయ్యకి అని సమాధానం ఇస్తుంది. నేను వెళ్లి మేడమ్ కి కాఫీ ఇచ్చి వస్తాను అంటూ తీసుకొని వెళుతుంది. దేవయాని రూమ్ తలుపు తడుతుంది. కాఫీ తీసుకొని రావాలంటే తలుపు తడుతున్న ఏంటి ధరణి అని అంటుంది తలుపు తట్టి లోపలికి రావడం మర్యాద కదా! మేడం అని వసుధార అంటుంది. లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి, కాఫీ ఇస్తుంది. నా కోడలు,లేదు. నువ్వు కాఫీ తీసుకొని వచ్చావు అంటుంది. ఎవరి తెస్తే ఏంటి? మేడం. నేను మీ కోడలు లాంటి దానినే అని అంటుంది. దేవయాని ఎందుకు ఇంటి పనులు చేస్తున్నావు? అడగకుండానే కాఫీలు ఇస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఎన్నాళ్లు తిష్ట వేయాలని అనుకుంటున్నావు ?అంటుంది .

మన జీవితం సాగాలి అంతే రిషి సార్, ను ఒంటరిగా వదిలి వెళ్ళడం బాగుండదు. ఇక్కడే ఉంటానని సమాధానం ఇస్తుంది. నీకు ఈమధ్య ధైర్యం ఎక్కువయింది. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నామని అంటుంది. అవును మేడం కావాలనే కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఈ విషయం నాకు అర్థం అవుతుంది. మనసులోని ఆలోచనలు వివరంగా వివరించాలి కదా! అందుకే మాట్లాడుతున్నాను అంటూ సమాధానం ఇస్తుంది. నీకు రిషి అండగా ఉన్నాడని ధైర్యం కదా అని దేవయాని అనగానే భలే కనిపెట్టారు. మీరు ఏం చేసినా డైరెక్ట్ గా చేస్తాను కొంతమంది లాగా ఇండైరెక్టుగా చేయడం నాకు నచ్చదు. చెప్పి చేయడం మంచి లక్షణం అని అంటుంది.

చూస్తున్నాను నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాను నిన్ను బాగా గమనిస్తున్నాను జ్యోతి నిన్ను చెంప దెబ్బ కొట్టినందుకే అంతలా మాట్లాడాడు. కాబట్టి నీకు బలం ఎక్కువైందని వసుదారాను అంటుంది దేవయాని. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ 601 గుప్పెడంత మనసు సీరియల్ కథ.