వర్షం సాక్షిగా ఒక్కటైన రిషి, వసుధార: ఈరోజు జరిగిన గుప్పెడంత మనసు సీరియల్ కధ.
ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎగ్జామ్స్ కోసం ఇష్టంగా కష్టపడి మీ కలల్ని నిజం చేసుకోండి, అందరికీ ఆదర్శంగా ఉండండి, గాలిపటం ఎంత దూరం వెళ్లిన ఎగురుతూనే ఉంటుంది. అదేవిధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. మీరు ఎంత దూరం వెళ్లిన, మీరు డిబిఎస్టి కాలేజ్ స్టూడెంట్స్ అని, రేపటి సమాజం కోసం మీరే వెలుగు పంచాలి అని స్పీచ్ ఇస్తాడు రిషి. తర్వాత జగతి మాట్లాడుతూ అత్తారింటికి వెళ్లేటప్పుడు అప్పగింతలు పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
గంధం చెట్టును నరికిన అంతమాత్రాన ఎప్పటికీ దాని సువాసన అలాగే ఉంటుంది. అదేవిధంగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఎగ్జామ్స్ బాగా రాయమని చెబుతుంది జగతి. స్టూడెంట్స్ అందరూ వసుధారను మాట్లాడమంటారు
ఇది నిన్న జరిగిన 537 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్ కథ.
ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో రిషి వసుధార ఎలా ఒకటయ్యారో తెలుసుకుందాం.
తన కాలేజ్ లైఫ్ గురించి చెప్పిన వసుధార: నేను ఈ కాలేజ్ నుండి వెళ్లలేక పోతున్నాను, ఈ కాలేజీలో చేరడం నా జీవితంలో మర్చిపోలేనిది. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఈ కాలేజీలో చేరాను ఇలాంటి సంఘట సంఘటనలు ఎదుర్కొన్నాను చెప్పడానికి సమయం కూడా లేదు అని అంటుంది. అప్పుడు రిషి వసుధారను చేర్చుకోను అని చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుంటాడు. తర్వాత వసుధార ఎన్నో జ్ఞాపకాలు, బంధాలు, బంధుత్వాలు ఈ కాలేజీలో నాకు సొంతమయ్యాయి.
కాలేజ్ లేకపోతే వస్తదార లేదు అనేంతగా ఈ కాలేజ్ నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఈ కాలేజ్ వల్లే యూత్ ఐకాన్ అనిపించుకున్నాను. అని ఏడుస్తూ గడిచినవన్నీ జ్ఞాపకాలుగా ఉంటాయని చెప్పి మీరు ధైర్యంగా ఉండాలి, ధైర్యం మన ఆయుధం, మనం ఏది కావాలని అనుకున్న దైర్యంగా ముందుకు వెళితేనే మనకు దొరుకుతుంది, అందువల్లే మీరు ధైర్యంన్నివదులుకోకూడదు.
నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన వాళ్లు ముగ్గురు ఉన్నారు, వాళ్లు జగతి మేడం, మహేంద్ర సార్, రిషి సార్ వీళ్ళకి నా కృతజ్ఞతలు అని చెప్పి ముగిస్తుంది. స్టూడెంట్స్ అందరూ ఆటోగ్రాఫ్ తీసుకుంటుంటారు. అందరూ కలిసి ఫోటోలు దిగుతూ ఉంటారు.
తన మనసులోని ప్రేమను బయటపెట్టిన వసుధార: వసుధార చెప్పకుండా వెళ్ళిపోయింది ఎందుకు ఇలా చేసింది అని అనుకుంటూ రిషి కార్లో వెళ్తూ ఉంటాడు. మధ్యలో వసుధారని చూసి నువ్వు ఇక్కడేంటి ?నువ్వు వెళ్ళిపోలేదా అని అడుగుతాడు. చిన్న పని ఉందని అందుకే ఆగానని సమాధానం ఇస్తుంది.
వసుధార ఏంటి ఆ పని అని రిషి అడుగుతాడు. మనసులోని భారాన్ని తగ్గించుకోవాలని ఆగాను. ఇష్టమైన బరువును మోసినంత కాలం మోసాను, ఇక దింపుకోక తప్పదు అందుకే ఇక్కడ ఉన్నానని సమాధానం ఇస్తుంది. తర్వాత మాట్లాడదాం వెళ్దాం రా అని రిషి అంటాడు. లేదు ఇప్పుడే మాట్లాడాలి అని వసుధార అంటుంది.
కారులో వెళుతూ మాట్లాడే మాటలు కాదు, అయినా మాట్లాడేది ఇప్పుడు నేను కాదు నా మనసు మాట్లాడుతుంది అని చెబుతుంది. ఏంటో చెప్పమని రిషి అడుగుతాడు. ఒకరితో మన ప్రయాణం ఎక్కడి వరకు వెళ్తుందో ఎవరికీ తెలియదు. మీతో నా ప్రయాణం ఎంతవరకు అని అడుగుతుంది వసుధార. నువ్వు ప్రశ్ననే అడగలేదు సమాధానం చెప్పమంటావ్ ఏంటి అని అంటాడు రిషి. వసుధార రిషి ఇచ్చిన గిఫ్ట్ కు ఉంగరాన్ని ఒక తాడుకు కట్టి గిఫ్ట్ కు వేస్తుంది ఆ గిఫ్ట్ను బ్యాగ్ లో నుంచి తీయగానే రిషి తనని వద్దని చెప్పిన మాటలు సాక్షి పెళ్లి వద్దన్న విషయం గుర్తు చేసుకుంటాడు రిషి. గిఫ్ట్ను చూపిస్తూ ఇది మీ మనసు అంటుంది వసుధార.
అది ఒకప్పుడ ముక్కలైంది కదా అని అంటాడు రిషి. ముక్కలైంది అద్దాలు మాత్రమే మనసు కాదని సమాధానం ఇస్తుంది వసుధార. మళ్లీ గిఫ్ట్ ఏంటి ఉంగరంలో అక్షరం పక్కన ఎందుకు ఇంకొక అక్షరం వచ్చింది వచ్చింది అని ప్రశ్నిస్తాడు రిషి. నాకు ఒకప్పుడు మీ మనసు గురించి చెప్పారు. దాని గురించి ఆలోచించ లేకపోయాను, ఒకరి బెదిరింపులకు లొంగిపోయి కాదన్నాను, కానీ కాదనడం ఎంత పెద్ద బాధను ఇస్తుందో అప్పుడు తెలియలేదని సమాధానం ఇస్తుంది.
నేను కాదన్నానని మీరు ఎక్కువ బాధపడ్డారు కానీ కాదు అన్న నేను 100 రెట్లు ఎక్కువగా బాధపడ్డాను అని చెప్పి, మీకు యాక్సిడెంట్ జరిగి దెబ్బ తగిలితే నేను విలవిలలాడిపోయాను, కాలేజ్ ల్యాబ్ లో మీకు ప్రాణహాని కలుగుతే నా గుండె ఆగిపోయినట్టు అయింది, మీరు నా ఎదురుగా ఉంటారు. నేను నో అన్నానని బాధపడుతుంటారు. నేను ఏమీ చెప్పలేకపోయాను, అర్థం చేసుకుంటారో, అపార్థం చేసుకుంటారో అని ఇన్ని రోజులు ఆగిపోయాను.
నేను నా జీవితంలో గొప్ప లక్ష్యం పెట్టుకున్నాను. ఎన్నో అనుకున్నాను, మీ బాధ ముందు అదేమీ గుర్తుకు రావడం లేదు. మీరే గుర్తుకు వస్తున్నారు. నాకు మీరు కావాలని, మీ ప్రేమ కావాలి ,మీతో కలిసి జీవితాంతం ప్రయాణం చేయాలి,” వి “అనే అక్షరం ఒంటరి అక్షరం. ఆ అక్షరానికి “ఆర్” అనే అక్షరం తోడవ్వాలి అందుకే ఈ రెండు అక్షరాలను కలిపానని, ఉంగరాన్ని చూపిస్తూ రిషి లేకుండా వసు పూర్తి అవ్వదు. మీరు లేకుండా ఈ వసుధార ఉండదు, గిఫ్ట్ను చూపిస్తూ ఇక్కడ రెండు గుండెలు ఉన్నాయి ,వాటి చప్పుడు మాత్రం ఒక్కటే అది ప్రేమే. అని నన్ను క్షమించి, నా ప్రేమను అంగీకరించమని “ఐ లవ్ యు “అని వసుధార రిషికి చెబుతుంది ఇది ఈరోజు జరిగిన 538 గుప్పెడంత మనసు సీరియల్ కథ.
రిషి వసుధార ప్రేమను అంగీకరిస్తాడో, లేదో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం: