ఒకరికొకరు వదలి ఉండలేక కలలు కంటున్న రిషి, వసుధార:
ఇది ఈరోజు జరిగిన గుప్పెడంతా మనసు సీరియల్ కధ.
వసుధారలేసి రిషి ఫోటోకు గుడ్ మార్నింగ్ చెబుతుంది. నేను బాగా చదువుకుంటున్నాను, కావాలంటే చూడండి అని ఫోటోకు పుస్తకాలన్నీ చూపిస్తూ, నా ఆశయం లక్ష్యం ఇదే అని గుర్తుపెట్టుకుంటాను అని అంటుంది. మీరు నమ్మడం లేదా అని, నీ ఆశయమే ముఖ్యం అని పేపర్లో రాసి గోడపై అతికించి, దాన్ని చూస్తూ మురిసిపోతుంది. దీనిని ప్రతిక్షణం చూస్తూ ఉంటే మీరే గుర్తుకు వస్తారు. మీరు నాకు ప్రేరణ. ఇది నాకు ప్రేరణగా ఉంటుందని అంటుంది. ఇది న్నిన్న జరిగిన గుప్పెడంత మనసు సీరియల్ కథ.
రిషి వసుధారలు మాటమీద నిలబడి మాట్లాడకుండా కలుసుకోకుండా ఉంటారో లేదో
ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
వసుధార చెప్పిన దానికి ఓకే అన్నానని మహేంద్ర గౌతమ్ కు చెప్పిన రిషి: రిషి లేసి వారిని చూడగానే కంగారుపడి, మీరు ఇక్కడ పడుకున్నారా అని అంటాడు. వసుధారని కలిసావు, ఏం జరిగింది ఒప్పందానికి వచ్చారా అని మహేంద్ర అంటాడు. నీ, వసుధారకు అండర్స్టాండింగ్ అయిందా అనగా, అయ్యింది అని సమాధానం ఇస్తాడు.
వాళ్లు సంతోషంతో కేకలు వేసుకుని అరుస్తారు. వసుధార చెప్పినదానికి ఓకే అన్నావా అని మహేంద్ర అంటాడు. లేదు నేను చెప్పినదానికే వసుధార ఓకే అయ్యింది అని అంటాడు. వసుధార ఒక గొప్ప స్టూడెంట్, కాలేజీకి దొరికిన వజ్రం. తనని ఎలా వదలి పెడతాను. తనకు అర్థం అయ్యేలా నా స్టైల్ లో చెప్పాను అని రిషి అంటాడు.
అదే ఏమని చెప్పావని మహేంద్ర అంటాడు. తనకు ఒక లక్ష్యం ఉంది. దానిని జయించమని, ఈ పరీక్షలలో కష్టపడమని, ఎగ్జామ్స్ అయ్యేవరకు మనసులో ఎలాంటి డిస్టర్బ్ చేసుకోకూడదని చెప్పానని చెప్పాడు. అది విన్న గౌతమ్ అక్కడి నుంచి నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. నువ్వు చాలా గొప్పగా ఆలోచించావు రిషి అని మహేంద్ర కూడా చెప్పి వెళ్ళిపోతాడ.
రిషి చెయ్యి పట్టుకొని ఆల్ ద బెస్ట్ చెప్పమని అన్న వసుధార: వసుధార సంతోషంతో రిషి చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుంటూ, పుష్పతో కలిసి వెళ్తూ ఉంటుంది. ఏంటి వసు ఎలా ఉన్నావు. ఎగ్జామ్స్ వస్తున్నాయి. అలా చదువు, ఇలా చదువు అని చెప్తావు అనుకుంటే, సైలెంట్ గా ఉన్నావని అంటుంది. ఎగ్జామ్స్ వచ్చాయి, ఎంత చదివితే అంత మంచి మార్కులు వస్తాయని అంటుంది. వసుధార నువ్వేనా ఇలా మాట్లాడేదని పుష్ప అనగా, అవును ఎగ్జామ్స్ అయిపోతాయి. అందరం విడిపోతాం. బహుశా హాల్ టికెట్ కోసం కలుస్తామేమో. ఎగ్జామ్స్ రాస్తాం. వెళ్లిపోతాం అంటుంది. దారిలో రిషిని చూసి దగ్గరకు పరిగెత్తుకొని వెళ్లి సంతోషంతో, ఏంటి ఇక్కడున్నారు నాకోసమేనా, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి అని తన చేయి పట్టుకొని ఊపుతూ ఉన్నట్లు కలకంటు, పుష్ప చేయి పట్టుకొని ఊపుతూ ఉంటుంది. ఏంటి ఏమైందని అడుగుతుంది పుష్ప.
ఏమీ లేదని చెబుతుంది. మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను అని ఇద్దరు మనసులో అనుకుంటారు. ఒకరినొకరు కలుసుకోలేక పోతున్నామని బాధపడుతూ ఉంటారు. ఇంతలో రిషి క్యాబ్ బుక్ చేశానని మెసేజ్ చేస్తాడు నే అది చూసి వసు సంతోషంతో రిషి నీ చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
రిషి ని వసుధార దగ్గరకు వెళ్ళమని చెప్పిన మహేంద్ర: ఇంట్లో రిషిని వాళ్ళ పెదనాన్న ఎగ్జామ్స్ పని అంతా అయిపోయింది కదా అని అంటాడు. అంతా అయిపోయింది. ప్రిపరేషన్ హాలిడేస్ కూడా ఇచ్చాం కదా, బాగా చదువుకుంటున్నారని రిషి సమాధానం ఇస్తాడు. ఇంతలో అక్కడికి జగతి వచ్చి గౌతమ్ ను కార్ రెడీ అయిందా అని అడిగి, వసుకి ఇంపార్టెన్స్ నోట్స్ ఇవ్వాలి అని చెబుతుంది. మహేంద్ర రిషి నువ్వు వెళ్లి రావచ్చు కదా అని అంటాడు.
నువ్వు కూర్చో, నేనే వెళ్తాను అని రిషి గౌతమ్ కు చెప్తాడు. రిషికి అందరి మీద ఉన్న శ్రద్ధ చూడు అని మహేంద్ర వాళ్ళ అన్నయ్య అంటాడు. అందరి మీద కాదు, వసుధార మీద ఉన్న శ్రద్ధ. ఏమి అయితే ఏం లే ఈ విధంగానైనా వసుధార దగ్గరకు వెళ్తున్నాడని మహేంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. రిషికి వసుధారకు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి మళ్లీ గౌతమ్ ను పంపిస్తాడు.
రిషి గురించి ఆలోచిస్తున్న వసుధార: ఇక్కడ వసు చదువుతూ, బుక్ పై “V,R”అనే అక్షరాలు రాసి మురిసిపోతూ, తన ప్రపోజ్ చేసిన విషయం రిషి చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుంటూ, రిషి సార్ ఏం చేస్తున్నారో, ఏమో ఫోన్లో మాట్లాడితే ఏమవుతుందని అనుకుంటూ ఉండగా, కారు వచ్చిన శబ్దం విని రిషి సార్ వచ్చినట్టున్నారు అనుకొని బయటకు వెళ్లి చూస్తుంది. అక్కడ గౌతమ్ జగతీలను చూసి రిషి సార్ రాలేదా మేడం అని అడుగుతుంది. ఏంటి వసు ఏం చేస్తున్నావ్, ఎగ్జామ్స్ టైం లో నీ మనసు చదువుపై ఉండాలి.
ఏకాగ్రత అంతా చదువు మీదనే ఉండాలని జగతి అంటుంది. వసు సరే అని సమాధానం ఇస్తుంది. ఇంతకీ మీ ఎండి గారు ఏమంటున్నారు, పోనీ నా కొడుకు ఏమంటున్నాడని జగతి అడుగుతుంది. ఒకటి చెప్పారని అంటుంది. గౌతమ్ ఏంటని అడిగితే, ఆల్ ద బెస్ట్ అని చెప్పారని సమాధానం ఇస్తుంది. జగతి కూడా వసుధారకు ఆల్ ద బెస్ట్ చెప్పి ఈ బుక్స్ తీసుకొని బాగా చదువు అంటుంది. గౌతమ్ కూడా వసుధారకు ఆల్ ద బెస్ట్ అని చెప్పి, కాలేజ్ ఫస్ట్ రావాలని చెబుతాడు. గౌతమ్ కు థాంక్స్ చెబుతూ రిషి సార్ పేరు నిలబెట్టడానికైనా నేను బాగా చదువుతానని మనసులో అనుకుంటుంది.
ఒకరికొకరు కనిపిస్తున్నట్లుగా కలకంటున్న రిషి వసుధార: గౌతమ్ రిషికి కాఫీ తీసుకొని వస్తే వసుధార కాఫీ తెచ్చి ఇచ్చినట్లుగా కలకంటాడు రిషి. ఏంటి ఏమైంది? ఏ మూడులో ఉన్నావని గౌతమ్ రిషిని అడగగా, అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ వసుధార చదువుతూ ఉండగా రిషి వచ్చి ఎదురుగా కూర్చున్నట్టుగా కలకంటుంది.
ఇది కలా నిజమా అని మళ్లీ చూసి, కళ అనుకుని, ఏంటో ఏం చేసినా రిషి సారే గుర్తుకు వస్తున్నారు. ఇలా అయితే నేనెలా చదువుకోవాలి, అని అనుకొని బయటకు వెళ్లడానికి డోర్స్ ఓపెన్ చేస్తుంది. బయట కూడా రిషి కార్ దగ్గర నిలబడినట్టుగా కనిపించి మళ్లీ కలగన్నానని అనుకుంటుంది.
ఇక్కడ కూడా వసుధార సోఫాలో కూర్చొని ఉండడం చూసి వసుధార అని రిషి పిలుస్తాడు. రండి సార్ మీకోసమే వచ్చానని అంటుంది. ఇది ఈరోజు జరిగిన 541 గుప్పెడంత మనసు సీరియల్ కథ.
వసుధార వచ్చి సోఫాలో కూర్చొని ఉన్నట్లుగా రిషి కలగంటున్నాడో, లేదో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.