guppedantha manasu ఈ రోజు కథ: గౌతమ్ దగ్గర తలదాచుకున్న జగతి మహేంద్ర, రిషి జీవితంలోకి వసుధారణ రానివ్వకూడదని ప్లాన్ చేస్తున్న దేవయాని
దేవయాని వచ్చి రిషిని ఎక్కడికి తీసుకొని వెళుతున్నావని? అడుగుతుంది. రిషి సార్ టెన్షన్ లో ఉన్నారు. ఒక కప్పు కాఫీ పంపించమని చెబుతుంది. ఏంటి! నేనా అనే దేవయాని అంటుంది. అవును మేడం మీరే, కాఫీ కాదు స్ట్రాంగ్ కాఫీ అని చెప్పి, రిషి ని తీసుకొని పైకి వెళ్తుంది. దేవయాని కోపంతో రగిలిపోతుంది.
ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ 588 గుప్పెడంత మనసు సీరియల్ పూర్తి కథ.
వసుధార అన్న మాటలకు దేవయాని ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో, మహేంద్ర, జగతి కనిపిస్తారో, లేదో ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం.
వసుధార వచ్చిరిషిని తీసుకొని వెళ్ళిన నిన్నటి సంఘటన సంఘటన నుంచి ఈరోజు సీరియల్ ప్రారంభం అవుతుంది.
వసుదారను అనుమానించిన రిషి:
వసుధార, రిషి ని తీసుకొని బెడ్ రూమ్ లోకి వస్తుంది. జరిగిన విషయం గుర్తుకు చేసుకొని వాళ్ళు తప్పకుండా వస్తారా? నేను తప్పు చేశాను, డాడ్ ను ప్రతిసారి ఏదో ఒకటి అంటూనే ఉన్నాను. ఒకటి రెండు సార్లు పెద్దమ్మ విషయంలో డాడీతో కఠినంగా మాట్లాడాను. అప్పుడు డాడ్ మనసు గాయపరిచి ఉండవచ్చు.
సారి చెప్పమన్నా అంతమాత్రాన డాడ్ మీద ప్రేమ లేనట్లేనా? పెద్దమ్మను గౌరవించడం తప్ప? అని వసు తో అంటాడు. మేడం వాళ్ళు తప్పకుండా తిరిగి వస్తారు. వాళ్ళు వెళ్లిపోవడానికి కారణం కూడా దేవయానిమేడమే. మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది కూడా తనే అని ,ఎప్పటికైనా తన నిజ స్వరూపం మీకు తెలిసేలా చేస్తానని అనుకుంటుంది.
వసుధార మేడంకి, డాడీకి మెసేజ్ చెయ్యి, మిషన్ ఎడ్యుకేషన్ పని ఉందని చెప్పు, కనీసం ఫోన్ ఆన్ చేసినప్పుడు చూసుకొని కాలేజీకి వస్తారు. అప్పుడు నేను డాడీ ని గట్టిగా హాగ్ చేసుకుని సారీ చెబుతాను అంటాడు. మహేంద్ర సార్ వాళ్లు వస్తారు. మీరు రెడీ అవ్వండి. కాలేజీకి వెళ్దాం నీకు మేడమ్ కి మధ్య మంచి అనుబంధ ఉంది కదా, నీకు కూడా ఎక్కడికెళ్తున్నారో చెప్పలేదని ప్రశ్నిస్తాడు.
గురు శిష్యుల బంధం అంతకుమించి ఉంటుంది కదా అంటాడు. మేడం గారు అంటే నాకు చాలా గౌరవం. ఆవిడకి నేనంటే చాలా ప్రేమ అంతేకానీ మేడం నాకేమీ చెప్పలేదని, మిషన్ ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని ఫైల్స్ నాకు పంపించారు. ఎందుకో అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది అంటుంది. అంటే మీ మేడం నిజంగా నీకు ఏమి చెప్పలేదా? అని అంటాడు. అనుమానిస్తున్నారా? అని అంటుంది.
మేడం చెబితే మీ దగ్గర దాస్తాన? మీరు నా కళ్ళలోకి చూసి చెప్పండి. మీరు నన్ను అనుమానిస్తున్నారా? అని అంటుంది. ఈ మాటలన్నీ దేవయాని చాటుగా వింటూనే ఉంటుంది. ప్రపంచంలో నేను వేటిని అనుమానించను, మన బంధాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి దాపరికాలు ఉండకూడదని అడిగాను, అనుమానం, ఆందోళనతో మన మధ్య తెలియని మూర్ఖులు చాలా ఉంటారు. నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు అని అంటాడు.
నేను మీ నీడను సార్, నేను మీ ఆలోచనకు ప్రతి రూపాన్ని, జీవితంలో మీతో ప్రయాణం చేయాల్సిన దాన్ని, నన్ను అనుమానిస్తారా? అని అంటుంది. ఆ మాటలన్నీ విన్న దేవయాని ఈ వసుధార మామూలుది కాదు, ఇంత తెలివైన దానిని రిషి జీవితంలోకి అస్సలు రానివ్వకూడదని దేవయాని అనుకుంటుంది.
తనమీద తనకే అసహ్యంగా ఉంది అన్నారిషి:
ఏం చేయాలో నాకు తెలియడం లేదు, డాడ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళారు అంటే నమ్మలేకపోతున్నాను. నా మీద నాకే అసహ్యంగా ఉందని అంటాడు. సార్ బాధపడకండి. మహేంద్ర సార్ ని మీరు వదిలి ఉండలేనట్లే ,సార్ కూడా ఉండలేడు. సార్ వస్తారు అని అంటుంది. దేవయాని కోపంతో వెళ్ళిపోతుంది.
మన అనుకున్న వాళ్లు మన మధ్య ఉన్నప్పుడు ఎన్నో అంటాం. వాళ్ళు దూరమైనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది అంటాడు. నువ్వు ఎప్పుడో ఒకసారి ఇలా కోపం వచ్చి దూరంగా వెళ్లిపోవు కదా అంటాడు. నేను మీ నీడనని చెప్పాను కదా, నీడ ఎప్పటికీ వీడిపోదు సార్ అంటుంది. మీరు రెడీ అవ్వండి, నేను వెళ్లి కాఫీ తీసుకొని వస్తాను, కాఫీ తాగి కాలేజ్ కి వెళ్దాం అని చెప్పి వసుధార వెళ్ళిపోతుంది.
వాళ్లు ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుండి ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు అన్న ధరణి:
పాలు పొంగుతున్నది చూసి వసు స్టవ్ ఆఫ్ చేసింది. ఏంటి మేడం మీరు, చూసుకోవాలి కదా అంటుంది. చిన్న మామయ్య, అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు నుండి నా మైండ్ పనిచేయటం లేదు, ఏం చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు, ఇలానే కొనసాగితే పెద్ద అత్తయ్యతో తిట్లు తినడం ఖాయం అంటుంది. మనకు కష్టాలు వచ్చినప్పుడు తెలివితేటలు అవసరమవుతాయి. కాస్త తెలివిగా ధైర్యంగా ఉంటే కష్టాల నుంచి బయటపడవచ్చు.
నీలా ధైర్యంగా ఉండటం నావల్ల కాదని, రిషిని చూడు, చాలా టెన్షన్లో ఉన్నాడు అంటుంది. మహేంద్ర సార్ ను చాలా ప్రేమిస్తాడు, కాబట్టి టెన్షన్ లో ఉన్నాడు. జరిగిన విషయం వల్ల కాస్త తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు కొంచెం కుదుటపడ్డాడు. మహేంద్ర సార్ ఎక్కడికి వెళ్లారు? ఎక్కడ ఉన్నారు? అని వెతకాడానికి ప్రయత్నిస్తున్నాడని అంటుంది. ఖచ్చితంగా దొరుకుతారని చెప్పి ధరణి కాఫీ ఇచ్చి, సార్ కాఫీ ఇచ్చి వస్తాను అని వెళుతుంది.
నా గురించి మీరేమీ టెన్షన్ పడగొద్దని దేవయానితో అన్న వసుధార:
దేవయానిని చూసి కాఫీ ఇవ్వమంటారా? అని అడుగుతుంది. నేను నీ రెస్టారెంట్ కి రాలేదు. ఇది నా ఇల్లు. నా రాజ్యం. నువ్వేంటి నాకు కాఫీ ఇచ్చేది అంటుంది. థాంక్స్ మేడం అంటుంది. థాంక్స్ ఎందుకు అని అడుగుతుంది. మీరు కాఫీ అడుగుతే, మళ్ళీ కాపీ కలపాల్సి వచ్చేది. టైం వేస్ట్ అయ్యేది. పిలవని పేరంటానికి వచ్చిన వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు అని ధరణిని అడుగుతుంది దేవయాని. ధరణి మేడమ్ కి ఏం తెలుసు మేడం. నన్ను అడగండి.
నేను చెప్తాను. రిషి సార్ వెళ్ళమనే వరకు నేను వెళ్ళను. మీరు ఫిక్స్ అవ్వండి. నేను ఫిక్స్ అయ్యాను. మహేంద్ర సార్ వాళ్లు ఇంటికి వచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటానేమో అని చెప్పి, నా గురించి ఆలోచించడం మానేయండి. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో? వాళ్ళని ఎలా రప్పించాలో? ఆలోచిస్తే ఉపయోగం ఉంటుంది. నా గురించి టెన్షన్ పడకండి. నేను ఇక్కడే ఉంటాను.
ధరణి మేడం మీరు కూడా ఫిక్స్ అవ్వండి అని చెబుతుంది. మేడం కావాలంటే నన్ను పంపించమని రిషి సార్ కి మీరే చెప్పండి అని దేవయానితో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నాకే ఎదురు సమాధానం చెబుతుంది. అంటే ఆలోచించాల్సిందే అని మనసులో దేవయాని అనుకుంటుంది.
జగతి, మహేంద్ర కాలేజ్ కి తప్పకుండా వస్తారు అని అన్న రిషి:
రిషి వెళ్తున్నాం అని మహేంద్ర రాసిన దాన్ని చూస్తూ మహేంద్ర తో గడిపిన వాటిని గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. వసు కాఫీ తెచ్చి ఇస్తుంది. కాఫీ తాగగానే మనం కాలేజీకి మీటింగ్ కు వెళ్దాం పదా అంటాడు. మీరు ధైర్యంగా కాన్ఫిడెంట్ గా ఉండటం నాకు నచ్చిందని మనసులో అనుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావ్ అని అంటాడు. మేడం వాళ్ళు అని అనగానే, కచ్చితంగా వస్తారు.
మేడం వర్క్ ని నెగ్లెట్ చేయరు. ఆ నమ్మకం నాకు ఉందని అంటాడు. సార్ నమ్మకాన్ని నిలబెడుతూ మేడం వాళ్ళు వస్తే బాగుంటుంది. లోపల ఎంత బాధ పడుతున్నారో? బయటికి ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు రాకపోతే ఫీల్ అవుతారు అనుకుంటుంది. మీరు నన్ను వదిలిపెట్టడం ఎంత కరెక్ట్. ఒకసారి మీరు ఆలోచిస్తే బాగుండేది డాడ్ అని మనసులో అనుకొని కాలేజీకి వెళ్తారు.
చివరికి గౌతమ్ దగ్గరికి చేరిన జగతి, మహేంద్ర:
జగతి, మహేంద్ర, గౌతమ్ ఒకే చోట ఉంటారు. మహేంద్ర రిషి తలుచుకొని బాధపడుతూ రిషి గురించి అడుగుతాడు మహేంద్ర. మీరు లేని రిషి ఎలా ఉంటాడో? మీకు తెలుసు కదా! మీకోసమే మీటింగ్ అరేంజ్ చేసి మీకు మెయిల్ పెట్టాడు అని చెబుతాడు. మాకు అర్థమయింది కానీ, ఎండాకాలంలోనే కదా వానాకాలం విలువ తెలిసేది. చలికాలంలోనే కదా సూర్యుని గురించి ఎదురు చూసేది అని అంటాడు. మహేంద్ర మనం ఇలా గౌతమ్ దగ్గరకి వచ్చి తనని ఇబ్బంది పెడుతున్నామేమో అని జగతి అంటుంది.
మేడం మీకు సేవ చేయడం నా అదృష్టం. కానీ మీరు ఇలా వచ్చేయడమే నాకు బాధగా ఉందని అంటాడు. అంకుల్ రిషి బాధపడటం చూడలేరు కదా! అని అనగా కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోక తప్పదు. నాకు కూడా ఇబ్బందిగా ఉందని అంటాడు. రావడానికి కారణం ఏంటో అని అడుగుతాడు. గౌతమ్ ఒక సమస్య వచ్చింది. దాని కోసం అజ్ఞాతవాసం తప్పదు. మేము ఇక్కడ ఉన్నామని ఎవరికీ చెప్పవద్దు అంటాడు. అదే నా బాధ. రిషి కి అబద్ధం చెప్పలేను. అలాగని నిజం చెప్పలేనని అంటాడు. ఒక మంచి కోసం కాస్త స్నేహ బంధాన్ని పక్కకు పెట్టక తప్పదు అని అంటాడు.
కఠినమైన పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకు వెళ్లాలి. ఒక పరిష్కారం కోసం ఇక్కడికి వచ్చాము. అది జరుగుతుందని అంటాడు. కచ్చితంగా అవుతుందని గౌతమ్ అంటాడు. నా గురించి ఏమనుకున్నా మీరు ఇద్దరు ఒకటి అవడం కోసం తప్పని పరిస్థితి. బాధపడ్డ త్వరలో మనం కలుస్తామని రిషి ఫోటో చూస్తూ మహేంద్ర మనసులో అనుకుంటాడు.
మేడం వాళ్లు వెళ్లిపోవడానికి కారణం మనమే అని అంటున్న వసుధార:
జగతి అన్న మాటలు వసు గుర్తుకు చేసుకొని, వాళ్ళు వెళ్లిపోవడానికి కారణం నేనేనా? అని ఆలోచిస్తూ ఉంటుంది. రిషి ఏం ఆలోచిస్తున్నామని అంటాడు. ఆలోచిస్తే అర్థం అవుతున్నాయి. మనుషుల్ని, మనసులను అర్థం చేసుకోవడం చాలా కష్టం. రిషి కోపంతో వసుధార అని అరిచి, నేను తప్పు చేస్తే డాడ్ వెళ్లిపోవాలా? నిలదీయలి కదా, స్వతంత్రం ఆయనకు లేదా? వెళ్లిపోవడమేనా, నేను ఏమి అవుతాను అని ఆలోచించరా? అని అంటాడు. మీరు వెళ్లడం గురించి ఆలోచిస్తున్నారు.
నేను వెళ్లిపోవడం గురించి ఆలోచిస్తున్నాను. ఎంత బాధ కలిగితే వెళ్ళిపోతారు అని చెబుతూ, వాళ్ళు వెళ్లిపోవడానికి మనిద్దరం కారణం అవ్వవచ్చు అంటుంది. జగతి మేడం విషయంలో అని చెబుతుండగానే కోపంగా అరుస్తాడు. ఇది ఈరోజు జరిగిన గుప్పెడంత మనసు సీరియల్ 589 ఎపిసోడ్ పూర్తి కథ.