Guppedantha manasu సీరియల్ ఈ రోజు కథ: మొన్న జరిగిన మహేంద్ర, జగతిల మధ్య సంభాషణ నుండి ఈరోజు సీరియల్ ప్రారంభం అవుతుంది. మహేంద్ర తప్పు చేశానా? అని అడగగా, తొందర పడ్డావు అంటుంది. ఇలా దూరంగా వచ్చి ఉన్నావు, కానీ రిషి కనబడితే మనసు అదుపు చేసుకోలేవు అంటుంది.
అదే ప్రేమలోని మహత్యం అంటూ, జగతిని తినమని తినిపిస్తాడు. అందరం కలిసి ఆనందంగా ఉండే వాళ్ళం, అంతకంటే ఆనందం ఏముంది అంటుంది. మనిషి జీవితం చెట్ల లాంటిది. మోడు వారి వసంతం కోసం ఎదురుచూస్తుంది చెట్టు. మనం రిషి కోసం, వాళ్ళు కలవడం కోసం అంటాడు. అలాగే వెయిట్ చేద్దాం అంటాడు.
మీరు ఇద్దరూ ఇంకా ఎన్నాళ్లు బాధపడటం అంటుంది. వసంతం వచ్చేదాకా అని చెప్పగానే, జగతి వెళ్ళిపోతుంది. రిషి నా గుండెల్లో ఉన్నాడు, నువ్వు నా పక్కన ఉన్నావు. నేను కోరుకున్నది జరుగుతుందని మనసులో అనుకుని రిషి ఫోటో చూస్తూ బాధపడతాడు మహేంద్ర.
అమ్మవారి సమక్షంలో ఒక్కటైన రిషి, వసుధార:
రిషినీ, వసు అమ్మవారి దగ్గరికి తీసుకుని వచ్చి, అమ్మవారితో, మీతో మాట్లాడాలి. మనసులోని మాటను, మనసైన వాడితో మాట్లాడటానికి ఇంతకంటే మంచి ప్రదేశం ఉండదని అనుకుంటున్నాను అని చెప్పి, అమ్మవారిని మొక్కుతారు. నన్ను క్షమించండి అంటూ, నా ఆలోచనలు, అభిప్రాయాలు మీ మీద రుద్ది, మిమ్మల్ని బాధ పెట్టాను.
జగతి మేడంని అమ్మ అని పిలవమని బాధ పెట్టాను, ఇన్నాళ్లు ఈ భారాన్ని ఇద్దరం మోసాము. ఇక్కడ దాన్ని దించుకుందాం. అమ్మవారి దగ్గర మనసులను తేలిక చేసుకుందాం. నా మొండితనం, నా పంతంతో మిమ్మల్ని బాధ పెట్టాను, ఒక దశలో ఒప్పందం మన బంధాన్ని దూరం చేస్తుందా అని భయపడ్డాను, ఈ విషయంలో మీరు చాలా సహనంగా ఉన్నారు, మీ సహనం ముందు, నా పట్టుదల చిన్న పోయింది అంటుంది.
ఏమయింది? ఏం చెప్పాలి? అనుకుంటున్నావు అంటాడు. మీ వ్యక్తిత్వం, ప్రేమ గురించి చెబుతున్నాను అంటూ, నేను ఎంత మొండిగా ఉన్నా, మీ ప్రేమ కొంచమైనా తగ్గలేదని, చెప్పి రిషి చెయ్యి పట్టుకుని, మీ చేయి పట్టుకొని జీవితాంతం నడవాల్సిన దానిని, మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి అంటుంది.
నువ్వు నాకు క్షమాపణ చెప్పటం ఏంటని అంటాడు. మీరు ఆ రోజు చీర కట్టుకోమంటే, కట్టుకోకుండా బాధ పెట్టాను అంటుంది. ఆ విషయం అప్పుడే అయిపోయింది అంటాడు. నా మనసులో అలాగే ఉందని చెప్పి, మీలో మార్పు కోరుకున్నాను, ఎందుకు మార్చాలి ? ఒకరికోసం, ఒకరు మారితే ప్రేమ ఎలా అవుతుంది? మార్పు కాలక్రమమైన రావాలి, ఎవరికి వారేగా ఉంటూ, ఒకరినొకరు ఉండడమే ప్రేమ.
మిమ్మల్ని మచ్చలేని చంద్రుడుగా చూడాలనుకున్నాను. చందమామను మార్చాలని అనుకోకూడదు. నా పంతంతో మహేంద్ర సార్ మీకు దూరమయ్యారని అనిపిస్తుందని చెబుతుంది. దానికి నీకు ఎటువంటి సంబంధం ఉందని అంటాడు. లేకపోయినా, ఒకవేళ ఉండి ఉండవచ్చు. తల్లి ప్రేమ కోసం, తండ్రిని దూరం చేశాను అని బాధగా ఉందని ఏడుస్తూ, చేతులు పట్టుకొని నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను అంటుంది.
మన మధ్య ఎలాంటి అడ్డంకులు లేనట్లే కదా! అంటాడు. ఉండొద్దు, ఉండవని ఆశిస్తున్నాను. మీకు ఇష్టం వచ్చినట్లు ఉండండి. మిమ్మల్ని మార్చే అర్హత నాకు లేదు, మారితే సంతోషపడే క్షణాన్ని ఆస్వాదిస్తాను అంటుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. మన మధ్య ఏదో అడ్డుతెర ఉన్నట్లుగా ఉండేది. ఇప్పుడు తొలగిపోయింది. ఇంకెప్పుడు అడ్డుతెరలు రవని ఆశిస్తున్నాను అంటాడు. రావు సార్, అని వసు సమాధానం ఇస్తుంది. ఇద్దరూ అమ్మవారికి మొక్కుతారు. మహేంద్ర సార్ కి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేను.
అలాగని రిషి సార్ను బాధ పెట్టలేను, ఎలాగైనా జగతి మేడంను అమ్మ అని పిలిచేలా చూడమని,రిషి సార్ సంతోషంగా ఉండమని కోరుకుంటుంది. అక్కడున్న పూలను వసుతలపై పోస్తాడు. ఏంటని అడుగుతుంది. మన బంధాన్ని అడ్డంకులు తొలగిపోయాయి, కదా! ఇంతకంటే ఎలా థాంక్స్ చెప్పాలో తెలియడం లేదని అంటాడు. వసుధార కూడా రిషికి పూలు పోస్తుంది. ఇక ఇద్దరు సంతోషంగా ఉంటారు.
దేవయాని చెప్పేది కరెక్టు కాదు అన్న గౌతమ్:
మిషన్ ఎడ్యుకేషన్ పని మనల్ని త్వరగా పూర్తిచేయాలని రిషి సార్ చెప్పారు కదా! అని ఇద్దరు మేడం మాట్లాడుకుంటూ, మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. జగతి మేడం తో మాట్లాడితే క్లియర్ అవుతాయని ఫోన్ చేస్తే, స్విచ్ ఆఫ్ వస్తుంది, మహేంద్ర సార్, జగతి మేడం రానందువలన మీటింగ్ ఆగిపోయింది కదా! జగతి మేడం వచ్చేదాకా పనిని వాయిదా వేయలేం అని, అనుకొని జగతి మేడం ల్యాండ్ లైన్ కి ఫోన్ చేద్దామని, ఫోన్ చేస్తారు.
ధరణి వచ్చి ఫోన్ తీస్తుంది. కాలేజ్ నుండి మాట్లాడుతున్నాము జగతి మేడంని పిలుస్తారా? అని అడుగుతుండగానే, దేవయాని ఫోన్ తీసుకొని, జగతి మేడం ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్లారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఇంకోసారి మేడం కోసం ఇంటికి ఫోన్ చేయవద్దు అని చెప్పి పెట్టేస్తుంది. మేడం ఏంటి ఇలా చెప్పారు అని మేడం వాళ్ళు అనుకుంటారు.
ఇక్కడ దేవయానిని కూడా ధరణి ఏంటి అలా చెప్పారు? అత్తయ్య అని అడుగుతుంది. ఎలా చెప్పాలి? ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మళ్ళీ ఫోన్ చేస్తే ఏం సమాధానం చెప్పాలో నీకు తెలుసా? అని చెప్పి అందుకే ఇలా చెప్పాను అంటుంది. అలా చెప్పడం మంచిది కాదేమో అని ధరణి అనగానే, ఇదే సరైనదని, తెలిసినది తెలుసు అని , తెలియనిది, తెలియదు అని చెబుతాము అంటుంది.
ఇంతలో అక్కడికి గౌతమ్ రాగానే ధరణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పెద్దమ్మ మరి దూకుడుగా మాట్లాడతారు, అని గౌతమ్ మనసులో అనుకొని అనుకుంటాడు. నేను చెప్పింది కరెక్టే కదా! అంటుంది. లేదు అంటాడు. వాస్తవాన్ని తెలుసుకొని బతికితే హాయిగా ఉంటుంది. వారు హాయిగా ఎక్కడ దొరుకుతున్నారో తెలియదు?మనం టెన్షన్ పడుతున్నాం. అని చెప్పి ,నేను కరెక్టే కదా అంటుంది. మీరు కరెక్టే అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోతాడు.
సంతోషంలో మునిగితేలుతున్న రీషి, వసుధార:
రిషి, వసు సంతోషంగా వస్తూ ఉంటారు. వసు అన్న మాటలు గుర్తు చేసుకుని, ఇలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఎప్పటికీ దూరం కాలేమని, మరోసారి రుజువైంది అని అనుకుంటాడు. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ 595 గుప్పెడంత మనసు సీరియల్ పూర్తి కథ.