ఒక రకంగా నేను కూడా కారణం. నా ఉనికిని భరించలేని రిషి ఎదురుగా నేను ఇక్కడ కనిపిస్తున్నాను. నేను ఈ ఇంటికి రావడానికి నువ్వే కారణం. మన ఇద్దరం ఒకటయ్యామని రిషి నీకు దూరమయ్యాడేమో? మనం దీని గురించి తెలుసుకోలేకపోయాం అంటుంది జగతి. మన కోసం మనం ఆలోచించి స్వార్థపరులయ్యామా అంటాడు మహేంద్ర. తెలిసో తెలియకో మనం రిషి విషయంలో తప్పు చేశామని ఒప్పుకోవాలని జగతి అంటుంది. ఇది నిన్న జరిగిన 525 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్ కథ.
సాక్షితో రిషి పెళ్లి జరగదని చెప్పిన జగతి: మన బంధాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదేమో, అందుకే దూరమైనట్టున్నాడు, పెళ్లికి ఒప్పుకున్నాడు, నాకు మాత్రం రిషి మీద నమ్మకం ఉంది. ఏం చేసినా అన్ని ఆలోచించే చేస్తాడు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోడు. ఈ పెళ్లి జరగదని నా మనసు అంటుంది అని జగతి మహీంద్రా తో అంటుంది. లగ్నపత్రిక రాసుకుంటుంటే ,పెళ్లి జరగదని అంటున్నావు. తల్లి ప్రేమతో అలా మాట్లాడుతున్నావు, కానీ పెళ్లి జరుగుతుందని మహేంద్ర సమాధానం ఇస్తాడు.
వసుధార గురించి ఆలోచించవద్దని సాక్షికి చెప్పినరిషి: రిషి వసుధార ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని సాక్షి అన్నమాటలను గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. సాక్షి కూడా అక్కడికి వస్తుంది. అన్ని పనులు బెదిరింపులతో అవ్వని తెలుసుకో, వసుధార గురించి మర్చిపో, వసుధార మీదికి నీ దృష్టి అసలు వెళ్ళకూడదని అంటాడు. ఇప్పుడు మన ఇద్దరి మధ్యఈ టాపిక్ ఎందుకని సాక్షి అంటుంది. నేను ఇది చెప్పటానికే వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మా ఇద్దరి గురించి మాట్లాడుతాడు అనుకుంటే ఇది చెప్పి వెళ్ళిపోయాడని, ఇది ఫోన్లో కూడా చెప్పొచ్చు కదా అని సాక్షి తన మనసులో అనుకుంటుంది.
రిషి తో సాక్షి పెళ్లి జరగనివ్వనన్న జగతి: ఇక్కడ దేవయాని జగతి ఈ ఇంటికి వచ్చాను అనుకుంది. వసుధార నామీద పై చేయి సాధించింది అనుకుంది. రిషి వాళ్ళ వైపుకు మారాడని అనుకున్నారు. ఇప్పుడు అంతా రివర్స్ అయింది. నేనేం చెప్తే అది చేస్తున్నాడు. సాక్షిని పెళ్లి చేసుకుంటున్నాడు.
ఆలస్యమైనా దేవయాని సాధించింది విజయం సాధించిందని సంతోషంతో నవ్వుకుంటూ ఉంటుంది. సాక్షి ఫోన్ చేసి రిషి సంగతి నాకు అర్థం కావడం లేదు, నన్ను పిలిస్తే బయటికి తీసుకుని వెళ్తాడని అనుకున్నాను, వసు గురించి మాట్లాడి వెళ్లిపోయాడు, తనని మర్చిపోయినట్లుగా లేదు అని అంటుంది. రిషి నీకు దక్కడమే గొప్ప వరం. నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు ఇంకా ఏం కావాలి . నీకే కదా తాళి కట్టేది అంతవరకు ఓపికగా ఉండు. పెళ్లయిన తర్వాత నువ్వేం చెప్తే అది చేస్తాడు అని సాక్షికి చెబుతుంది దేవయాని.
జగతి వచ్చి ఫోన్ లాక్కొని నేను సాక్షితో మాట్లాడాలని చెప్పి ఏం చేసినా నువ్వు అనుకున్నది జరగదు, ఎలా జరుగుతుందో నేను చూస్తాను అంటుంది జగతి. మీరు చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయడానికి లేదని సాక్షి సమాధానం ఇస్తుంది. నా కొడుకుని ఎలాగైనా సాక్షి బారి నుండి రక్షించుకుంటానని దేవయానికి చెప్పి వెళ్ళిపోతుంది జగతి.
రిషి తో మాట్లాడమనివసు కు చెప్పిన గౌతమ్: వసుధార రిషి ఇచ్చిన గిఫ్ట్ చూస్తూ తనను ప్రేమించిన విషయం రిషి, సాక్షిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న విషయం గుర్తుకు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. గౌతమ్ ఫోన్ చేసి నువ్వు ఏం చేయకుండా ఉంటే ఎలా, నువ్వు రుషి తో మాట్లాడు అంటాడు. వసు ఫోన్ కట్ చేసి ఏం మాట్లాడాలి, నేను చెబితే వింటాడా, నేనేం చేయాలి ,ఎలా పెళ్లిని ఆపాలని ఏడుస్తూ తనతో తనే మాట్లాడుకుంటుంది.
సాక్షిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని రిషిని ప్రశ్నించిన ధరణి: రిషి వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి ధరణి వస్తుంది నాకు డొంకతిరుడుగా మాట్లాడడం రాదు నేను సూటిగా ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు అని నువ్వు సాక్షిని పెళ్లి చేసుకోవడం ఏంటని అడుగుతుంది. నీ మీద ఉన్న అభిమానంతో అడుగుతున్నాను, అధికారంతో కాదు. వసుధార అంటే నీకు ఇష్టం కదా ,సాక్షిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నామని అంటుంది. మీకు వంకాయ అంటే ఇష్టం కదా అని బీరకాయ ఎందుకు చేశారు.
అలాగే జీవితంలో కూడా అంతే ప్రేమ వేరు, ఇష్టం వేరు కోరుకున్నవి జరగాలని లేదు జరిగేవి కోరుకోవాలి అని సమాధానం ఇస్తాడు రిషి. ధరణి తన మనసులో సమాధానం చెప్పడు అని అనుకొని వెళ్ళిపోతుంది.
వసు పెట్టిన మెసేజ్ ను చూసి కంగారు పడిన రిషి: ఆఖరి సారిగా మీతో మాట్లాడాలని ఉంది మెసేజ్ చేస్తుంది వసుదారా. మెసేజ్ చూసి రిషి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అనడంతో కంగారుగా వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్లిందని అనుకుంటాడు. ఎక్కడుందని వెతుకుతూ ఉండగా. వసుధార చందమామ, ఆకాశమా మీ రిషి సార్ కథ చెబుతాను వినండి. అని రిషి సార్ కోపం అంటే భయం వేస్తుంది. ఇప్పుడు అలా కాదు రిషి సార్ చాలా మారిపోయాడు, అంటుండగా రిషి అక్కడికి వచ్చి వసును కొట్టబోయాడు. నీకు బుద్ధి ఉందా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎందుకలా మెసేజ్ చేశావు? అని అడుగుతాడు.
ఆకాశంతో మాట్లాడుతున్నాను. నా సంతోషాన్ని , బాధను ఆకాశానికి చెప్తున్నాను అంటుంది. నువ్వు పెట్టిన మెసేజ్ చూసి నేను ఎంత భయపడ్డానో తెలుసా అంటాడు రిషి. నేను చనిపోతానని అనుకున్నారా? నేను మాట్లాడాలని అనుకున్నాను ,మీరు రారు అందుకే అలా మెసేజ్ చేశాను. మాట్లాడాలి అంటే నేను వస్తాను కదా అంటాడు రిషి. ఇంతకుముందు రిషి సార్ కాదు, మీరు మారిపోయారు అంటుంది వసుధార. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ 526 గుప్పెడంత మనసు సీరియల్.