Guppedantha manasu today:వసుధారకు దూరమవుతున్న రిషి

వసుధారకు దూరమవుతున్న రిషి:

 దేవయాని లేపి ఏమైంది. ఎందుకలా మాట్లాడారు అంటాడు. హాస్పిటల్ కు వెళ్దాం రండి అనగా మందులతో మనోవేదన తీరదు. టెస్టులతో మనసు కష్టాలు తెలియవు. హాస్పిటల్కు వద్దు. కొంచెం సేపు నాతో మాట్లాడు చాలు. చిన్నప్పటినుండి నువ్వు ప్రాణంగా నేను చూసుకున్నాను. మధ్యలో no తెలియకుండా చిన్న పొరపాట్లు చేసి ఉంటాను. నన్ను క్షమించు.సాక్షి విషయంలో నేను పొరపాటు చేశాను అన్నది దేవయాని.

 ఇది నిన్న జరిగిన 521 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్. 

 చనిపోవాలని నిర్ణయించుకున్న దేవయాని:

 సాక్షి విషయంలో పొరపాటు చేశాను. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది. నా కోరిక తీరుస్తావా అంటుంది. మీరు అడిగితే నేను కాదంటానా అనగా గ్లాసు ఒకసారి అందివ్వు చివరిసారిగా నీ చేతిలో విషం తాగాలని నా కోరిక అంటుంది దేవయాని. విషం తాగడం ఏంటి. అంత కష్టం ఏమొచ్చింది. నేను ఉన్నాను కదా ఏం జరిగిందో చెప్పండి అని రిషి అడుగుతాడు. 

నేను ఒక కథ చెప్పనా అని ఆవు లేగ దూడను విడిచి అడివిలోకి మేతకు వెళితే పులి వచ్చి తింటాను అనగా ఒక్కసారి ఇంటికి వెళ్లి లేగ దూడను చూసి  వస్తాన. అంటుంది. నేను కూడా చివరి క్షణంలో చూడలేను అనుకున్నాను. చనిపోవాలని మీరు అనుకుంటే. నేను చనిపోయినట్టే కదా ఎందుకు అని అడుగుతాడు.

సాక్షి విషయంలో తప్పు చేశానన్న దేవయాని: సాక్షి విషయంలో నేను తప్పు చేశాను. తన ప్రేమను చూసి నీకు సరైన జోడి. సాక్షితో నీ పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చాను. మాటను నిలబెట్టుకోలేక పోతున్నాను. సాక్షి మారిపోయింది .నీతో పెళ్లి జరిపించినందుకు నా పరువు తీస్తుంది. నన్ను జైలుకు పంపిస్తాను అంటుంది. రెండు రోజుల్లో లగ్న పత్రిక రాసుకోవడానికి పిలుపు రావాలి లేదంటే కోర్టుకు వెళ్తాను. 

ఇంటి పరువు తీస్తాను. విషం తాగి చనిపోయి మీరే కారణం అని చెబుతాను అంటూ బెదిరిస్తుంది. ఇందులో తన తప్పులేదు. నీకు కరెక్ట్ అని నమ్మాను. తనకు నువ్వంటే అంటే ప్రాణం. ఇప్పుడు నిన్ను పెంచిన ప్రేమతో నీ పెళ్లి నేను చెప్పినట్లుగా జరగాలని అధికారం నాకు లేదు. సాక్షిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పలేను. ఇచ్చిన మాట తప్పడం కన్నా నీ చేతితో చావడం మేలు అంటుంది. నాకు ఇంకొక దారి లేదు. నీ ఆనందమే నా ఆనందం. 

జగతిని ఇంటికి తీసుకొని వచ్చావు వసుధార తెలివైనది. కాలేజీకి మంచి పేరు తెస్తుంది అంటే నేను ఏమీ మాట్లాడలేదు. సాక్షిని నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే నువ్వంటే పిచ్చి ప్రేమ అని ఏడుస్తూ నటన చేస్తుంది దేవయాని. ఇప్పుడు మనకు రెండు మార్గాలు ఉన్నాయి.1. సాక్షిని పెళ్లి చేసుకోవడం

 2. సాక్ష్యం ముందు తలవంచడం నేను అలా చేయలేను అందుకే చనిపోవాలనినిర్ణయించుకున్నాను. మీరు అలా అనకండి. నేను తట్టుకోలేనని రిషి ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాడు.

రిషి ఆలోచనాలను అంచనా వేయ లేకున్నా వసుధార: గౌతమ్, వసుధాలను ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. ఎక్కడికి వెళ్లారు అడగడం కాకుండా రిషి మూడ్ ఎలా ఉంది అని అడగడం మంచిదని మహేంద్ర రిషి ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. నేను ఏమీ చెప్పలేను. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియడం లేదు. సాక్షి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కావటం లేదని అంటుంది వసుదారా. ఇంతలో రిషి వసుధారను చూసి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

రిషిని రక్షించమని చెప్పిన దేవయాని: దేవయాని వసుధారని పిలుస్తుంది. ఎందుకు పిలుస్తుందో అనుకుంటూ దేవయాని  దగ్గరకు వెళుతుంది వసు. రిషి నువ్వే కాపాడుకో. నిన్ను చాలాసార్లు మాటల అన్నాను. సాక్షి భారి నుంచి రిషి ని కాపాడగలవు. నీకు తెలివి, ధైర్యం ఉన్నాయి అంటుంది దేవయాని. రిషి సార్ ను ఎవరూ  కాపాడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో సార్ కు తెలుసు. 

సాక్షికి మీరు ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నిస్తుంది వసుధార. ఏనుగు పెద్దదైన, చిన్న ముళ్ళు బాధపెడుతుంది. ఇక్కడ ఏనుగు నేను. ముళ్ళు సాక్షి అని సమాధానం ఇస్తుంది దేవయాని. ఏంటి నిన్నటి వరకు సాక్షిని వెంటబెట్టుకొని తిరిగి మళ్ళీ ఇలా మాట్లాడుతుందని ఆలోచిస్తున్నావా? ఎవరైనా రిషి తర్వాతే అంటుంది. అమాయకుడు నువ్వు రిషికి సాయం చేయాలి అంటుంది. సరే అని చెప్పి వసుధార వెళ్ళిపోతుంది.

దేవయాని మాటలకు బాధపడుతున్న రిషి: రిషి దేవయాని మాటలు గుర్తుకు చేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. కాఫీ తీసుకొని అక్కడికి వసుధారవస్తుంది. కాఫీ వద్దంటాడు. ఎందుకు  వద్దు అంటున్నాడు ఎందుకని అని మనసులో అనుకొని అక్కడే పెడుతుంది వసు. ఒకసారి వద్దు అనుకున్నవి మళ్లీ కావాలని అనిపిస్తుంది అని అంటుంది. ఇది నా విషయంలో జరిగిందని మనసులో అనుకుంటుంది. వసుధార మాట్లాడుతూ ఉండగానే రిషి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఈరోజు 522 ఎపిసోడ్ లో జరిగిన పూర్తి కథ.