Telugu film industry: ఇండస్ట్రీకి శుభవార్త చెప్పిన నిర్మాతలు

ఫిలిం ఫెడరేషన్ కు జీతాలు పెంచే విషయంలో నిర్మాతలు సంచల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మూడు సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని చెబుతూ ఇటీవల సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అయితే వేతనాలు పెంచుతామని వెంటనే షూటింగ్లో పాల్గొనాలని నిర్మాతల నుండి కబురు రావడంతో సినీ కార్మికులు సమ్మెను విరమించారు.

ఇండస్ట్రీకి శుభవార్త చెప్పిన నిర్మాతలు

అనంతరం సినిమా బడ్జెట్ తగ్గించే విషయంపై నిర్మాతలంతా ఒక చోటికి చేరి షూటింగ్ నిలుపుదల విషయం తెలిసిందే కదా. సినిమా ఇండస్ట్రీలో అన్ని శాఖల వారితో చర్చలు జరుపుతూ ఎవరెవరితో ఏమేం చర్చలు జరపారో అనంతరం ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో అధికారికంగా నిర్మాతలు తెలుపుతూ వస్తున్నారు.

ఇప్పటివరకు నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యూనిరేషన్ సంబంధించి జరిపిన చర్చలలో మెయిన్ ఆర్టిస్ట్ సాంకేతిక నిపుణులు ఎవరైనా ఒక్కసారి నిర్మాత తో మాట్లాడి ఒక్కసారి రెమ్యూనరేషన్ మాట్లాడిన తర్వాత వారికి సంబంధించిన ఎవరికీ కూడా మళ్లీ నిర్మాత వేరేగా చెల్లింపులు చేయడం జరగదనే నిర్ణయం తీసుకున్నారు.

అసిస్టెంట్ లోకల్ ట్రాన్స్పోర్ట్ వారు బస చేసే హోటల్స్ స్పెషల్ ఫుడ్ అన్ని కూడా రెమ్యూనిరేషన్ పరిధిలోని వస్తాయని ప్రకటించారు. అలాగే ఇకపై నటినట్టులకు సాంకేతిక నిపుణుల డైలీ చెల్లింపులు ఉండేలా కూడా తెలిపారు. అలాగే షూటింగ్ ప్రారంభించే ముందు రెమ్యూనిరేషన్ అన్ని ఒప్పందాలకు తప్పనిసరిగా నమోదు చేయాలని అనుకున్నారు.

కాల్ షీట్స్ విషయంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా క్రమశిక్షణ కలిగి ఉండాలని షూటింగ్స్ కి సంబంధించి రోజువారి నివేదికను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఓటిటిలోకి 8 వారాల వరకు సినిమాను విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇవే కాకుండా ఇంకా వి పి ఎస్ కు సంబంధించి చర్చలు జరగాల్సి ఉన్నాయని తెలియజేశారు.

అలాగే ఫిలిం ఫెడరేషన్ వారితో చివరి దశలో చర్చలు వస్తున్నాయని అధికారికంగా ఫిలిం చాంబర్లో ఆఫ్ కామర్స్ తరఫున నిర్మాతలు వెల్లడించారు. ఇక చర్చలు చివరి దశలో ముగిసినట్లు తెలుస్తోంది. సినీ కార్మికులకు వేతనాలు 30% పెంచారని నిర్మాతలు అంగీకరించారని ఈ విషయాన్ని అధికారికంగా గురువారం ఫిలిం ఛాంబర్ లో ఆఫ్ కామర్స్ తెలియజేయునున్నారు సమాచారం.