Ramarao on duty: ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న రామారావ్ ఆన్ డ్యూటీ

తన కెరీర్ లో భారీ హిట్ “క్రాక్” తర్వాత మళ్ళీ ట్రాక్ లోకి వచ్చి మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు ఒకే చేశారు.

Rama Rao and Duty to be streamed on OTT

ఇక అలాగే తన కెరీర్ లో కొత్త దర్శకులకి కూడా రవితేజ ఎన్నో అవకాశాలు ఇచ్చి ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే అలా ఈసారి కొత్త దర్శకుడు శరత్ మండవ కి ఛాన్స్ ఇచ్చి చేసిన చిత్రమే “రామారావు ఆన్ డ్యూటీ”.

చిత్రం ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సోని లివ్ వారు సొంతం చేసుకోగా అందులో తెలుగు తో సహా ఇతర దక్షిణాది భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

మరి అప్పుడు మిస్ అయ్యినవారు అయితే ఈసారి చూడొచ్చు. ఇక ఈ చిత్రంలో మజిలీ ఫేమ్ దివ్యాంక్ష కౌశిక్ హీరోయిన్ గా నటించగా సాం సి ఎస్ సంగీతం అందించాడు.