New Phones in September: సెప్టెంబర్ నెలలో విడుదలవుతున్న ఫోన్ లు ఇవే

New Phones in September: సెప్టెంబర్ నెల అనేది టెక్ ప్రియులకు ఎంతో ప్రత్యేకమైన నెల. ఎందుకంటే ప్రతి సంవత్సరంలోనూ సెప్టెంబర్ నెలలోని టెక్ దిగజమైనటువంటి యాపిల్ సరికొత్త సిరీస్ ఐఫోన్లను విడుదల చేస్తూ ఉంటుంది. ఈసారి కూడా ఐఫోన్ 14 సిరీస్ ను ఈ నెలలోనే లాంచ్ కానుంది. వీటితోపాటు ఈ సెప్టెంబర్ నెలలో చాలా స్మార్ట్ ఫోన్లు విడుదల కానున్నాయి. రియల్ మీ (Realme), పోకో (Poco), షావోమి (Xiaomi), వివో (Vivo), మోటోరోలా (Motorola), తో సహా మరిన్ని బ్రాండ్ల నుంచి కూడా ఫోన్లు విడుదల కానున్నాయి.

iPhone 14 సిరీస్ ఈనెల 7వ తేదీన విడుదల కానుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ మాక్స్, ఐఫోన్ 14 సిరీస్ ఈ మూడు వేరియంట్లలో రానుంది. ఐఫోన్ 13 ఫోన్ తో ఐఫోన్ 14 పోలిస్తే కొన్ని అప్ గ్రేడ్ చేశారు. ఐఫోన్ 14 సిరీస్ తో పాటు ఆపిల్ కొత్త ఐప్యాడ్, ఆపిల్ వాచ్ 8 సిరీస్, ఎయిర్బడ్స్ ను కూడా అదేరోజున విడుదల చేయనున్నారు.

iPhone 14

Poco M5 4G ఈ స్మార్ట్ఫోన్ ఈనెల 7వ తేదీన భారతదేశంలో లాంచ్ కానంది. ఇది బడ్జెట్ రేంజ్ లోనే ఉంటుంది, కానీ ఇది 4G తో వస్తుంది. తక్కువ ధరలోని బెస్ట్ గేమింగ్ ఫోన్ గా పోకో దాన్ని హైలెట్ చేసుకుంటుంది.

Realme GT Neo 3T 5G స్మార్ట్ ఫోన్లు భారతదేశంలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోన్ లో ఆగస్టులో విడుదలవుతాయి అని అంచనా వచ్చిన అలా ఏమీ జరగలేదు. అయితే సెప్టెంబర్ లో తీసుకొస్తున్నట్లు రియల్ మీ కంపెనీ స్పష్టమైన సాంకేతలు వచ్చాయి. ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 870 5జీ వస్తుంది. ఇందులో AMOLED డిస్ప్లే తో ప్రీమియం మిడ్ రేంజ్ లో రియల్ మీ జి టి నియో 3T 5G ఈ ఫోన్ వస్తుంది.

Redmi 11 Prime 5G ఈ ఫోన్ ఈనెల 6వ తేదీన విడుదలవుతుంది. దీని యొక్క ప్రాసెసర్ మీడియా టెక్ డైమన్సిటీ 700 తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా 5 మెగా పిక్స్ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. ఇందులో 5000mah బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

Vivo V25 ఈ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ నెలలో విడుదలవుతుంది ఇటీవల వివో v25 ప్రో కూడా విడుదల కాగా దానికి కాస్త అప్డేట్ వెర్షన్ గా తక్కువ బడ్జెట్లో వివో v25 వస్తుంది. అయితే అఫీషియల్ లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు.

Motorola Edge 30 Ultra ఇది మోటోరోలా పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ గా ఈ మొబైల్ ఈ సెప్టెంబర్ నెలలోనే విడుదల అవుతుంది. చైనాలో మోటో ఎక్స్ 30 ప్రో గా విడుదల అయింది. కానీ ఈ ఫోన్ భారత దేశంలో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రాగా వస్తుంది. ఇందులో 200 మెగాపిక్సన్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీని ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 తో వస్తుంది. అంతేకాకుండా ఫ్లాగ్ షిప్ స్పెసిఫికేషన్ తో వస్తుంది.

Xiaomi 12S Ultra ఈ ప్రీమియం ఫ్లాగ్ షిప్ ఫోన్ Xiaomi 12S Ultra ఈ సెప్టెంబర్ నెలలో భారత్ కు వచ్చే అవకాశం ఉంటుందనీ అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఫోన్ జూలై నెలలో చైనాలో విడుదలయ్యింది. కానీ ఇప్పుడు ఈ ఫోన్ ఇండియాలో విడుదలవుతుందని తెలుస్తుంది. దీని యొక్క ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 తో వస్తుంది. కానీ అన్ని విభాగాలలో ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్పెసిఫికేషన్లను ఈ ఫోన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్లో సెన్సార్లు, ఫ్లాగ్ షిప్ లతో కెమెరా అత్యుత్తమంగా ఉంది.

Motorola Edge 30 Fusion ఈ ఫోన్ కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే లంచ్ అవుతుంది. ఇది మిడ్ రేంజ్ లో పవర్ఫుల్ స్పెసిఫికేషనులతో ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 888+ తో వస్తుంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేటుతో, 68W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో, AMOLED డిస్ప్లే తో ఈ ఫోన్ వస్తుంది.