Visakhapatnam: క్రీడా హబ్ గా విశాఖ
విశాఖని జాతీయ క్రీడా హబ్‌గా తీర్చి దిద్దుతున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.
AU ఇంజనీరింగ్ కాలేజ్ లోని వైవియస్.మూర్తి ఆడిటోరియంలో ఆదివారం రాష్ట్ర స్థాయి క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంత్రి మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో దేశానికి హాకీలో స్వర్ణ పతకాలు సాధించిన మేజర్ ధ్యాన్ చంద్ పుట్టిన రోజును క్రీడా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు.
మంచి క్రీడాకారులను వెలికితీసి వారికి తగిన శిక్షణ నిచ్చి జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేలా పోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత 2 సంవత్సరాలలో క్రీడాకారులకు రూ.2లక్షల 50 వేలు అందించినట్లు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో కొత్త క్రీడా పాలసీ తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. Saap managing director,ఎన్.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ క్రీడలు ఉల్లాసం, ఆరోగ్యం, వినోదాన్ని కల్గిస్తాయని, మనిషిలో పట్టుదల, వ్యక్తిత్వం పెంచుతాయని, ఒత్తిడిని తగ్గాస్తాయని తెలిపారు. పి.అరుణ్ బాబు JC గారు మాట్లాడుతూ విద్యార్ధి దశలో ప్రతి ఒక్కరూ ఆటలు ఆడాలని, ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం సంపాదించాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు AU లోని మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోచ్ లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నెడ్‌క్యాప్ చైర్మన్ కెకె.రాజు, విద్యా మౌలిక వసతుల సంస్థ చైర్మన్ మళ్ల విజయప్రసాద్, ఎమ్మెల్యేలు టి.నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, కార్పొరేటర్ ఉషశ్రీ, డిఇఒ లింగేశ్వరరెడ్డి, జిల్లా క్రీడాధికారి సుర్యారావు, జున్ గెలియట్, ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు.