D విటమిన్ ప్రాముఖ్యత: మన శరీరానికి అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉండాలి. లేకపోతే అనేక అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. మన శరీరానికి అందే పోషకాలలో ఎక్కువ ముఖ్యమైన వాటిలో D విటమిన్ ప్రధానమైనది. ఎముకలకు, దంతాలు బలంగా ఉండటానికి అంతేకాక మన శరీరంలో జరిగే జీవక్రియలకు విటమిన్ D చాలా అవసరం.
ఈ విటమిన్ మనం తినే ఆహారాలలో దొరకడం చాలా తక్కువ. సూర్యుని వేడి మన శరీరంపై పడినప్పుడు మన శరీరంలో కొన్ని జీవ క్రియలు జరిగి విటమిన్ D ఉత్పత్తి అవుతుంది. అందువలన విటమిన్ D ని సన్ షైన్ విటమిన్ అని పిలుస్తారు. అయితే ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో, మారుతున్న కాలాన్ని బట్టి, పగలంతా ఆఫీసులలో, స్కూల్లో కే పరిమితం అవుతున్నారు.
అందువలన ఎండలో తిరగడం జరగక, మన శరీరానికి కావలసిన D విటమిన్ అందడం జరగక అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాం. D విటమిన్ పుట్టిన పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలివారికి సైతం అవసరం. ఇంతకుముందు కాలంలో పెద్దవారు ఏ పని చేసినా ఎండలో కూర్చొని చేసేవారు.
ఎండలో తిరగకపోతే ఆరోగ్యం బాగాలేదని చెప్పేవారు. అంతేకాక పుట్టిన పసిపిల్లలను ఉదయం పూట వచ్చే సూర్య కిరణాలు మంచిదని పిల్లలను మంచంపై ఎండ తగిలేట్టుగా పడుకోబెట్టేవారు. అంతేకాకుండా షుగర్ ఉన్నవారికి కూడా వైద్యులు ఎండలో తిరగాలి అని చెబుతారు. అంతటి ప్రాముఖ్యత ఉంది మన శరీరంలోని D విటమిన్ కు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న మార్పుల వలన శరీరానికి కావాల్సిన D విటమిన్ పొందడానికి సులువైన మార్గాలను వైద్య పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.
D విటమిన్ ప్రాముఖ్యత
పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఎవరెవరికి ఎంత D విటమిన్ అవసరమో తెలుసుకుందాం.
మామూలు వారికి అంటే ఆరోగ్యంగా పనులు చేస్తూ ఉండేవారికి రోజుకు కనీసం 15 మైక్రో గ్రాముల D విటమిన్ అవసరం. అదేవిధంగా ఎదిగే పిల్లలకు, 60 ఏళ్లు పైబడిన వారికి 20 మైక్రోగ్రాముల D విటమిన్ అవసరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
వివిధ పరిశోధనల ప్రకారం మనం ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థాలలో రోజుకు 2.3 నుండి 2.9 మైక్రోగ్రాముల D విటమిన్ లభిస్తుందని తెలియజేశారు.మిగిలిన D విటమిన్ మొత్తం సూర్యరశ్మి ద్వారానే మన శరీరంలో తయారవుతుందని చెబుతున్నారు.
మన శరీరంలో ఉండే కాల్షియం, ఫాస్పరస్లులను సంగ్రహించడానికి D విటమిన్ చాలా అవసరం. అంతేకాక కండరాల పనితీరు మెరుగుపరచడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా చాలా అవసరం.
D విటమిన్ శరీరానికి కావలసిన మోతాదులో లభించకపోతే క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.
మన శరీరంలో ఉండవలసిన మోతాదులో డD విటమిన్ ఉంటే మానసిక పరిస్థితి బాగుంటుందని డిప్రెషన్ వంటి వాటిని అధిగమించవచ్చని తెలియజేస్తున్నారు.
Health tips of the day: ఈరోజు హెల్త్ టిప్స్ ఆఫ్ ద డే లో డి విటమిన్ ను పొందగలిగే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
సూర్యరశ్మి: మన శరీరానికి D విటమిన్ ప్రాముఖ్యత చాలా అవసరమని మనకు తెలిసిందే కదా అందువలన ప్రతిరోజు సూర్యరశ్మిని తగిలేలా ఉండి సూర్యరశ్మి ద్వారా మన శరీరానికి కావాల్సిన D విటమిన్ పొందవచ్చు.
విటమిన్ D టాబ్లెట్స్: సూర్యరశ్మి ద్వారా మన శరీరానికి మన శరీరానికి కావాల్సిన D విటమిన్ పొందవచ్చు. సూర్య రశ్మి బాగా తగలాలి అంటే ఎండాకాలం బాగుంటుంది. అయితే వానాకాలం, చలికాలంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వానకాలం చలికాలంలో ఎండ తగలక మన శరీరానికి కావలసిన మోతాదులోD విటమిన్ అందదు. అటువంటి సమయాలలో మనకు D విటమిన్ అవసరం అని అనుకున్నప్పుడు D విటమిన్ టాబ్లెట్స్ వాడి ఆ లోపాన్ని తగ్గించుకోవచ్చు.
పుట్టగొడుగులు (మష్రూమ్స్): పుట్టగొడుగులు అంటే మనకు తెలిసినవే వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇవి కూడా మనుషులు, జంతువుల లాగానే సూర్యుని నుండి వచ్చే సూర్యరశ్మి ద్వారా విటమిన్ Dని తయారు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. 100 గ్రాముల పుట్టగొడుగులలో 10 మైక్రోగ్రాముల విటమిన్ D ఉంటుందని చెబుతున్నారు.
అంటే మనం మనకు ప్రతిరోజు కావలసిన 15 మైక్రోగ్రాముల D విటమిన్ వీటిలోమూడవ వంతు అనగా 10 మైక్రో గ్రాములు ఉంటుంది. అందువలన పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన D విటమిన్ పుష్కలంగా లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.
ఆయిల్ ఫిష్: కొవ్వు పదార్థాలు నూనెల శాతం ఎక్కువగా ఉండే సాల్మన్, ట్యూనా, మాకురేల్ వంటి చేపలలో కూడా D విటమిన్ అత్యధికంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాక సర్డెన్స్ గా పిలిచే చిన్న చేపలలో కూడా విటమిన్ D ఉంటుందని చెబుతున్నారు. 150 గ్రాముల చేపలలో 13.1 నుంచి 13.6 మైక్రోగ్రాముల D విటమిన్ ఉంటుందని, అదేవిధంగా రెండు టీ స్పూన్ల కాడ్ లివర్ నూనెలో ఐదు మైక్రో గ్రాముల D విటమిన్ అందవచ్చు అని చెబుతున్నారు. అంతేకాకుండా చేపల నుండి వచ్చే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు.
గుడ్లు: ఒక గ్రుడ్డిలో 1.9 మైక్రోగ్రాముల D విటమిన్ ఉంటుంది. ఒక రోజుకు అవసరమయ్యే D విటమిన్ 20% ఒక గుడ్డులో ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గుడ్డులోని పచ్చ సనలో విటమిన్ D తో పాటు పోషకాలు, ప్రోటీన్లు, అత్యధికంగా ఉంటాయి. గుడ్డు శరీరంలో కొవ్వును పెంచుతాయని అంటున్న విషయం కూడా తెలిసిందే. అయినప్పటికీ గుడ్లు ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.
మాంసాలు: మేకలు, గొర్రెల కిడ్నీలు, కాలేయం వంటి వాటిలో కూడా D విటమిన్ ఉంటుందని అంటున్నారు. 100 గ్రాముల గొర్రెల కాలేయంలో 0.9 మైక్రోగ్రాంలో D విటమిన్ ఉంటుందని తెలియజేస్తున్నారు. అంతేకాక వీటి మాంసాలలో విటమిన్ D, ఐరన్ కూడా అధికంగా ఉంటాయని అవి కళ్ళకు, చర్మానికి, ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని చెబుతున్నారు.
పాలు, పాల పదార్థాలు: ప్రస్తుత కాలంలో విటమిన్ D లోపంతో బాధపడుతున్న వారికి కావలసిన Dవిటమిన్ అందడం కోసం మార్కెట్లలో డి విటమిన్ కలిపిన తృణధాన్యాలు, జూసులు, పాలు, పాల పదార్థాలు అమ్ముతున్నారు. వాటిని ఉపయోగించడం ద్వారా డి విటమిన్ పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.