Vitamin c: విటమిన్ సి ని immunity booster vitamin అంటారు. విటమిన్ సి లోపం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టూ ముడుతాయి. మన శరీర పనితీరుకు విటమిన్ సి అత్యంత ముఖ్యమైనది. విటమిన్ సి శాస్త్రీయ నామం ఆస్కార్బిక్ ఆమ్లం. సూక్ష్మజీవులు మరియు అనేక వైరస్ల భారీ నుండి కాపాడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుతుంది. శరీరానికి ఎంతో మేలు చేసే కొల్లాజిన్ అనే ప్రోటీన్ తయారీకి విటమిన్ సి తప్పనిసరి. అలాగే విరిగిన ఎముకలు అతికేందుకు, గాయాలు త్వరగా మానిపేందుకు, కోల్పోయిన శరీర భాగాలు తిరిగి అతికేందుకు విటమిన్ సి ఎంతో సహాయపడుతుంది.
విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ క్యాన్సర్ కారకాలను సమృద్ధిగా శరీరానికి అందిస్తుంది.. విటమిన్ సిను ,శరీరం తానంత ట తానుఉత్పత్తి చేసుకోలేదు. విటమిన్ సి లోపం వల్ల స్కార్వి వ్యాధి వస్తుంది. ఇది శరీరంలో సెల్లులార్ గ్రోత్ మరియు బ్లడ్ సర్క్యులేషన్ సిస్టంను సరిగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది. విటమిన్సిలోపం వల్ల శరీరానికి ముప్పు ఏమిటంటే. ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల విటమిన్ సి,ను పొందవచ్చు.
విటమిన్ సి లోపం లక్షణాలు:
అలసట ,బలహీనత ,బరువు తగ్గడం, దంత వాపులు, జాయింట్ పెయిన్స్, గాయాలు మానకపోవడంతో, పాటు క్యాన్సర్, గుండె జబ్బులు, అస్తమా ,ఎనీమియా, అందువల్ల మనం రెగ్యులర్ డైట్ లో విటమి న్ సి, ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా విటమిన్ సి శరీరంలో నిల్వ చేసుకోలేదు. జాంపండు ,నిమ్మకాయలు, ఉసిరికాయ, టమేటా, నారింజ ,బత్తాయి ,దానిమ్మ లాంటి పండ్లు లో మరియు కొన్ని రకాల కూరగాయలలో విటమిన్ సి ఉంటుంది. ప్రతిరోజు మగవారికి 90 మిల్లీగ్రాములు అవసరం, ఆడవారికి 75 మిల్లీ గ్రాములు విటమిన్ సి అవసరం. గర్భిణి ,పాలిచ్చే తల్లులకు రోజుకు 75 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉపయోగ పడుతుంది.
ఉడకబెట్టిన అర కప్పు బ్రోకలీ తీసుకుంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.. వేడి చేసినప్పుడు విటమిన్ సి నశిస్తుంది. కాబట్టి ఉడకబెట్టిన ఆహారాన్ని మళ్లీ ఉడకబెట్టడం వల్ల లేదా వేడి చేయడం వల్ల విటమిన్ సి నశిస్తుంది. మన శరీరానికి రోజుకు 50 నుంచి 60 మిల్లీగ్రాములు విటమిన్ సి ఉంటే సరిపోతుంది. ఎక్కువగా ఉన్న విటమిన్ సి పదార్థాలు 100 గ్రాముల నిమ్మకాయలో 20 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. 100 గ్రాముల కమలలో ఐదు మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. 100 గ్రాముల కివి 93 మిల్లీ గ్రాములు విటమిన్ సి ఉంటుంది. 100 గ్రాముల జామకాయలలో 228 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.
శరీరంలో విటమిన్ సి నిల్వ ఉండదు .కాబట్టి రోజుకి ఒక జాంపండు తినడం వల్ల విటమిన్ సి వస్తుంది 100 గ్రాముల ఉసిరిలో 600 మిల్లీ గ్రాముల విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిబాగా పెరగడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తకణాలు ద్వారా రోగ నిరోధక శక్తిపెరగడానికి విటమిన్ సి ముఖ్య పాత్ర వహిస్తుంది. రక్తకణాలు ద్వారా వైరస్, బ్యాక్టీరియా చంపినప్పుడు విడుదలయ్యే వ్యర్థాలను తొలగిస్తుంది.విటమిన్ సి. తెల్ల రక్త కణాల ఉత్పత్తి పనితీరుకు, మరియు కదలికలను ప్రేరేపిస్తుంది.
Vitamin c face wash
న్యాచురల్ క్లీనర్ సెల్ఫ్ కణాలు వైరస్, బ్యాక్టీరియాను చంపాలి అంటే విటమిన్ సి అతి ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆటో మాక్తో పేజ్ అనబడే తెల్ల రక్త కణాలు వైరస్, బ్యాక్టీరియాలను చంపడానికి విటమిన్ సి ముఖ్యంగా కావాలి. రక్తంలో రోగనిరోధక శక్తి కణాలు బాగా సంచరిస్తూ గస్తీ చేసేటట్లు చేస్తుంది. దెబ్బలు ,గాయాలు ,పుండ్లు మానడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది. శరీరానికి రిపేర్, క్లీనింగ్ చేయడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి ని పెంచి , శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడానికి విటమిన్ సి తోడ్పడుతుంది.
ఆక్సార్బిక్ ఆమ్లం అని పిలువబడే విటమిన్ సి నీటిలో కరిగే విటమిన్ ,ఫుడ్ ద్వారా మాత్రమే విటమిన్ సి తీసుకోవాలి ..తనంతట తాను సొంతంగా విటమిన్ సి తయారు చేసుకోలేదు. విటమిన్ సి స్థాయి తక్కువగా ఉన్నవారికి మెదడులో రక్తకణాలు చిట్లిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుండె పనితీరును మెరుగుపరచడంలో తోపాటు తీసుకున్న ఆహారంలోని ఐరన్ శోషణ జరిపేందుకు సహాయపడుతుంది.
అలాగేరక్త కణాలఉత్పత్తి, శరీరంలో కొలెస్ట్రాల నియంత్రణ ,హానికర వైరస్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. విటమిన్ సి లోపం వల్ల చిగుళ్ల వ్యాధి, రక్తస్రావం జరగడం ,ఎముకలు, కండరాల నొప్పి ,రక్తహీనత ,అకస్మతంగా బరువు తగ్గడం, జుట్టు మరియు చర్మపు పరిస్థితుల్లో మార్పులు రావడం, దంత సమస్యలు ,మానసిక ఆందోళన వంటి అనేక సమస్యలు విటమిన్లో పం వలన కలుగుతాయి.
విటమిన్ సి లోపం వలన శరీరంలోని రక్తనాళాలు బలహీనపడతాయి. అందువల్ల శరీర అవయవాలకు రక్త సరఫరా సక్రమంగా జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం జామకాయలోవిటమిన్ సి అత్యధికంగా ఉండటంవలన సుమారు 300 గ్రాముల విటమిన్ సి పొందవచ్చునని సూచిస్తున్నారు.
Vitamin c fruits
అలాగే జామకాయ శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అలాగే ఆరెంజ్ లో కూడా విటమిన్ సిపుష్కలంగా లభిస్తుంది .రోజుకు ఒక ఆరెంజ్ తింటే చాలు విటమిన్ సి లోపంతో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు సలహా ఇస్తున్నారు .దాంతో పాటు కివీ పండు లో కూడా విటమిన్ సి అధికంగా అని ఉంటుంది. వీటితోపాటు పైనాపిల్ ,బ్రోకాలి, బొప్పాయి, మామిడి, టమేటా మిరప ,పాలకూర ,బంగాళదుంప ,నిమ్మకాయ, కర్బుజా, ద్రాక్ష వంటి వాటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందువల్ల తరచుగా వీటిని తీసుకోవడం ద్వారా విటమిన్ సి లోపాన్ని నివారించవచ్చు.
ఉపయోగాలు:
విటమిన్ సి తీసుకోవడం వల్ల తెల్ల రక్త కణాల అభివృద్ధికి విటమిన్ సి ముఖ్యపాత్ర వహిస్తుంది. అనిమియా రక్తహీనతతో బాధపడే వారికి కూడా విటమిన్ సి ఉపయోగపడుతుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ముడుతలు పడకుండా మచ్చలు తగ్గించడానికి విటమిన్ సి చాలా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులు ,గర్భధారణ సమస్యలు, కంటి సమస్యలు నుండి రక్షణ కల్పిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, గాయాలు, పుండ్లు, మానడానికికణజాల మచ్చలు, వృద్ధులాస్తి ఎముకలు మరియు దంతాల మరమ్మత్తుకు కావాల్సిన ముఖ్యమైన ప్రోటీన్ ను విటమిన్ సి అందిస్తుంది. మన శరీరం సవ్యంగా పనిచేయడానికి కావలసిన శక్తినిస్తుంది. విటమిన్ సి నీటిలో కరిగే విటమిన్. ఈ విటమిన్ లోపిస్తే స్కర్వివ్యాధి వస్తుంది.
Vitamin c tablets
Limcee,succee,sunceeplus,vincee,talcee,eucee ఈ విధంగా విటమిన్ సి టాబ్లెట్లు మార్కెట్లలో లభిస్తున్నాయి. చప్పరించే టాబ్లెట్స్ ల రూపంలో తీసుకోవాలి.vitamine c+sodiumscorbate. చాలా సమయం వరకు పనిచేస్తాయి సోడియం ఉండటం వల్ల కడుపు నొప్పి రాదు. Limcee plus:
Vitamine+amino acids శరీర, సెల్ రిపేర్ ,హెయిర్ గ్రోత్ 90% మిల్లీగ్రామ్ నుండి కావాల్సిన 200 ఎంజి వరకు విటమిన్ సి తీసుకోవచ్చు. వాటర్ సాలిబుల్ కాబట్టి విటమిన్ సి మన శరీరానికిఎంతవరకు కావాలో అంత వినియోగించుకొని ,మిగిలినది యూరిన్ రూపంలో బయటికి విసర్జిస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్
head ache,diarrhoea,nausea,pinkishurine, వంటివి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
జాగ్రత్తలు:
డయాబెటిక్ ,కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు, డయాలసిస్ ఉన్నవారు ,కొద్దిగా జాగ్రత్తగా విటమి న్ సి ఉపయోగించాలి. ప్రతిరోజు ఉదయం ఒకగ్లాసు గోరువెచ్చని నీటిలో, సగం నిమ్మకాయ పిండి తీసుకోవడం వల్ల విటమిన్ సి లభిస్తుంది. చిగుళ్ల నుండి రక్తం కారడం, గా యాలు మానడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది. ఎముకలు దంతాలు పటిష్టంగా ఉండడానికి వీటెన్సీ ఉపయోగపడుతుంది .నష్టాలు;పెద్దవాళ్ళకి రోజుకి 200 0మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి ఉపయోగపడుతుంది. ఎక్కువగా తీసుకుంటే విరోచనాలు కావచ్చు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడానికి విటమిన్ సి తోడ్పడుతుంది.
Vitamin c foods
రాగి శాతంలో విటమిన్ సి తగ్గిపోతుంది. విటమిన్ సి వేడి చేసిన ,ఉడికించిన, దాని శాతం తగ్గిపోతుంది. భోజనంలో పండ్లు కూరగాయలు ఉండేటట్లు చూసుకోవాలి. అమితంగా తీసుకోవడం వల్ల నష్టాలు వస్తాయి. ఫుడ్ జామా లో ఒక పండులో సుమారు 2o6 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. బొప్పాయిలో ఓ క పండులో సుమారు 76 నుండి 96 మిల్లి గ్రాముల విటమిన్ సి ఉంటుంది. కివి పండులో 24 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. స్ట్రాబెరీ లో ఒక పండులో 52 మిల్లీగ్రాముల విటమిన్ సికలిగి ఉంటుంది. పైనాపిల్ లో 42 నుండి 49 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.
కూరగాయలలో: క్యాప్సికంలో: సగం కప్పు క్యాప్సికంలో 121 నుంచి 144 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. బ్రోకలీలో; సగం కప్పు బ్రోకలీ 54 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. క్యాబేజీ ;ఒక కప్పు క్యాబేజీలో 42 మిల్లి గ్రాముల విటమిన్ సిఉంటుంది. కాబట్టి రోజు వారి ఆహారంలో క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల విటమిన్ సి లోపాన్ని నివారించుకోవచ్చు.