Monkeypox Vaccine: వ్యాక్సిన్ తయారీ కొరకు కంపెనీలను ఆహ్వానించిన ICMR

ప్రస్తుతం అందరిని భయానికి గురి చేస్తున్న మంకీపాక్స్ కు వ్యాక్సిన్ రాబోతుంది. కోవిడ్ ను నియంత్రించిన తరహాలోనే మంకీపాక్స్ ను నియంత్రించాలని కేంద్రం భావిస్తోంది. వ్యాక్సిన్ తయారు చేయడం కోసం కంపెనీలను కేంద్రం ఆహ్వానించింది, వాక్సిన్ తయారు చేయవలసిందిగా సూచించింది. దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ప్రజలకు భయాన్ని కలిగిస్తోంది. ఆ నేపథ్యంలో కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటుంది.

కరోనా వ్యాధి దేశంలోకి ప్రవేశించిన తర్వాత దానిని అరికట్టడానికి వ్యాక్సిన్ ను తయారు చేసింది. ఇప్పుడు మంకీపాక్స్ వ్యాధికి కూడా వ్యాక్సిన్ తయారు చేయాలని కేంద్రం భావిస్తోంది. మంకీపాక్స్ వ్యాధిని నియంత్రించడానికి అవసరమైన వ్యాక్సిన్ తయారు చేయడం కోసం దేశంలోని అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎమ్ఆర్) ప్రయత్నాలు ప్రారంభించింది.




మంకీపాక్స్ వైరస్ ను నియంత్రించడానికి అవసరమైన వ్యాక్సిన్ తయారి కోసం కేంద్రం వ్యాక్సిన్ ను తయారు చేసే కంపెనీలను ఆహ్వానించింది. అలాగే మంకీపాక్స్ వ్యాధిని త్వరగా గుర్తించే విట్రో డయాగ్నస్టిక్ కిట్లు కూడా తయారు చేయాలని కేంద్రం కంపెనీలను కోరింది. మంకీపాక్స్ అనే వ్యాధి వైరస్ వల్ల వ్యాపిస్తుంది. ఇది మనుషుల నుంచి మనుషులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది.

ఇది చాలావరకు ప్రాణాలు తీసే వంటి వైరస్ కాకపోయినా, మంకీపాక్స్ వ్యాధి తీవ్రమైన లక్షణాలను కలిగి ఉంటాయి. కండరాల నొప్పి, తలనొప్పి, నీరసం, వెన్నునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. మంకీపాక్స్ వ్యాధి యొక్క లక్షణాలు దాదాపుగా మనిషి లో ఐదు రోజుల వరకు ఉంటాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 76 దేశాలల్లో విజృంభిస్తున్న మంకీపాక్స్ వల్ల ఐదుగురు మరణించినట్లు అంచనా.

ప్రస్తుతం అర్హత కలిగిన కంపెనీల నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎమ్ ఆర్) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వారానికి కనీసం లక్ష డోసుల వ్యాక్సిన్ లను తయారు చేసే సామర్థ్యం,అనుభవం కలిగి ఉండాలి. కోవిడ్ సందర్భంగా దేశంలో ఎమర్జెన్సీ వినియోగానికి కొవాగ్జిన్ రూపొందించినట్లుగానే, మంకీ పాక్స్ వ్యాధి వ్యాక్సిన్ కూడా తయారు చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీలకు రాయితీ మరియు నిపుణుల సహకారాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది.