Punugulu: ప్రస్తుత కాలంలో ప్రజలు అనేక రకాలుగా వంటలు చేసుకుని తింటున్నారు. పూర్వంలో అన్ని రకాలు ఇలాంటి వంటలు లేవు. రాగి ముద్ద, జొన్న సంగటి, కొర్ర అన్నం ఇలాంటివి చేసుకొని తినేవారు. అందుకే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్తుత కాలంలో తినే ఆహారాలలో చాలా మార్పులు వచ్చాయి.
అంతేకాకుండా ఆహారంలో కలుషితం అలాగే ఉంది. అయితే ఈ కాలంలో ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేసి, సాయంకాలం స్నాక్స్ అని తింటున్నారు. ఎన్ని ఉన్నా లేకపోయినా ఈ స్నాక్స్ ఐటమ్ తినడం తప్పనిసరి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగానే స్నాక్స్ ను తీసుకుంటారు.
ఈ ఐటమ్స్ ను ఇంట్లోనే చేసుకోని, లేద బయట చేసిన వాటినీ తెచ్చుకొని తింటారు. బయట తెచ్చుకుని తినే వాటికంటే, ఇంట్లో చేసుకొని తినడం చాలా మంచిది. అలా ఇంట్లోనే తయారు చేసుకునే వంటలలో పునుగులు ఒకటి. వీటిని బయట హోటల్లో లాగా చాలా రుచిగా, క్రిస్పీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
పునుగుల తయారీకి కావాల్సిన పదార్థాలు:
- ఇడ్లీ పిండి ఒక కప్పు
- ఉప్పు రుచికి సరిపడినంత
- మైదాపిండి అరకప్పు
- వంట సోడా చిటికెడు
- నూనె డీప్ ఫ్రై చేయడానికి కావాల్సినంత.
పునుగులు తయారీ చేసుకునే పద్ధతి: మనం ముందుగా ఒక వెడల్పైన గిన్నెను తీసుకోవాలి. అందులో ఇడ్లీ పిండిని, ఉప్పు, మైదా పిండిని వేసి, కొంచెం కొంచెం నీళ్లు పోసి, ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండిని ఎక్కువ గట్టిగానీ, పలుచగా కానీ లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత పిండిని 15 నిమిషాల పాటు మగ్గనించి, ఆ తర్వాత కొంచెం వంట సోడా వేసుకోవాలి.
ఇక స్టవ్ పై కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనె వేసి, బాగా వేడి అవ్వనివ్వాలి. నూనె బాగా వేడయ్యాక పిండిని చిన్న చిన్న ఉంటల్లా తీసుకొని నూనెలో వేయాలి. అయితే పునుగులు చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే మంటను ఉంచుకోవాలి. నూనెలో వేసిన పిండిని బాగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా పునుగులు రెడీ అవుతాయి. కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకుని, ఉల్లిపాయతో పాటు, పల్లీల చట్నీతో తింటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చేయడం ద్వారా బయట చేసే హోటల్ స్టైల్ పునుగులు ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
పునుగులు చేసుకోవడం కోసం ప్రత్యేకంగా పిండిని కలుపుకోనవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలినవినప్పుడు కూడా, అందులో కొంచెం మైదాపిండి వేసి పునుగులు చేసుకోవచ్చు.