karwa chauth: కర్వా చౌత్ పండుగ విశిష్టత

Karva chauth festial

karwa chauth:మనం జరుపుకునే పండుగలు అంటే మన సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు ప్రతిబింబం. ఈ పండగల వలన మనకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. అలాగే సంతోషాన్ని అందిస్తుంది. అలాంటి పండుగలు అందరూ కలిసి జరుపుకునేవి కొన్ని అయితే, మరికొందరు కేవలం స్త్రీలకు మాత్రమే చెందినవి ఉంటాయి.

వరలక్ష్మి వ్రతం, అట్లతద్ది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అలాగే కర్వా చౌత్ పండగ కూడా ఇందులో ఒకటి. ఎక్కువగా ఆడవారు శ్రావణమాసం, కార్తీక మాసాలలో పూజలు, వ్రతాలు చేసుకుంటూ ఉపవాస దీక్షను చేస్తారు. ఇటువంటివి అన్ని ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నాయి.

ఈ విధంగా కార్వా చౌత్ పండగలో కూడా ఇలాంటి నియమాలు ఉన్నాయి. కర్వా చౌత్ పండుగ రోజున మహిళలు శివుని భార్య అయిన పార్వతి దేవికి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కఠిన ఉపవాస దీక్షలు చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు.

అశ్వయుజ పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజున ఈ కర్వా చౌత్ పండుగను జరుపుకుంటారు. లేకపోతే దీపావళి పండుగకు 11 రోజుల ముందు వచ్చే రోజున జరుపుకుంటారు. ఈ పండుగను ఎక్కువగా ఉత్తర భారతదేశం వారు జరుపుకుంటారు. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో కూడా ఈ పండుగను జరుపుకుంటున్నారు.

కర్వా చౌత్ పండగ అనగా:

Karva chauth festival

పెళ్లయిన వారు కుటుంబ గౌరవం, భర్త క్షేమం కోరి ఉపవాస దీక్షతో అమ్మవారిని పూజించడాన్ని కర్వా చౌత్ పండగ అంటారు. ఈ పండుగను 13 రోజులు జరుపుకుంటారు. ఈ పండుగ భార్యాభర్తల మధ్య ఉండే బంధాన్ని బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ పండగలో పెళ్లయిన ఆడవారు చంద్రోదయం కాగానే జల్లెడలో ముందుగా చంద్రుని చూసి ఆ తర్వాత భర్త మొహాన్ని చూసి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమించుకుంటారు. పెళ్లి కానీ ఆడవారు ఉపవాస దీక్షతో చంద్రోదయం రాగానే జల్లెడలో చంద్రుని చూసి తమ ఉపవాస దీక్షను విరమిస్తారు.

కర్వా చౌత్ పండుగ విశిష్టత:

మహిళలు చేసే పనులు ఎంతో అర్థంతో కూడుకున్నవి. మహిళలు ఏ పూజలు, వ్రతాలు చేసిన దాని ముఖ్య ఉద్దేశం కుటుంబ సంక్షేమం, అలాగే కుటుంబ గౌరవం కోసమే చేస్తారు. భర్తల క్షేమం కోరి ఉపవాసాలు ఉంటారు. ఈ పండగలో ఉదయం నుంచి రాత్రి చంద్రోదయం వరకు ఉపవాసాలు ఉండి, తమ భర్తల క్షేమం కోరి పార్వతీ అమ్మవారిని పూజిస్తారు.

పెళ్లి కానీ కన్నెపిల్లలు తమ మంచి భర్త రావాలని కోరుకునే ఉపవాసం చేస్తూ అమ్మవారిని పూజిస్తారు. కర్వా చౌత్ పండుగలో ఆడవారు ఉపవాసం ఉండడం చూసిన కొందరు భర్తలు కూడా ఉపవాసం ఉంటారు. చంద్రోదయం కాగానే వెన్నెలలో జల్లెడను ఇద్దరి మధ్య ఉంచుకొని అందులో నుంచి ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటారు.

ఆ తర్వాత ఒకరినొకరు తినిపించుకుంటూ ఉపవాస దీక్షను విరమిస్తారు. ఈ పండగలో భాగంగా చేసే ఉపవాస దీక్షను విరమించుకోవడానికి అనేక రకాల వంటలను తయారుచేస్తారు. ఈ పండగ వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. అలాగే అత్త కోడళ్ళ మధ్య కూడా సన్నిహిత్యాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ పండుగలో భాగంగా అత్తా కోడలికి “సర్గి” చేసి పెట్టడం ఆనవాయితీగా ఉంటుంది. దీనిని ఉపవాస దీక్షను ప్రారంభించడానికి ముందే తీసుకుంటారు. అత్తగారు ప్రేమతో చేసి ఇచ్చే ఈ “సర్గీ”ని సూర్యుడు పొడవక ముందే తీసుకోవడం ఆనవాయితీ.

కర్వా చౌత్ పండుగ కథ:

వాయువ్య రాష్ట్రాలలో పురుషులు మొగల్ చక్రవర్తి సైనికులతో కలిసి యుద్ధానికి వెళ్లేవారు. ఆ సమయంలో స్త్రీలులు వారి భర్తలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ పార్వతి అమ్మవారిని పూజిస్తూ, ఉపవాసం చేస్తూ ఉండేవారట. ఆ రోజున భర్త కోసం ప్రత్యేక వంటకాలు చేసి పెళ్లికూతురులా ముస్తాబు అయి భర్త రాక కోసం వేచి చూస్తూ ఉండేవారు. అందువలన అప్పటినుండి భర్త శ్రేయస్సు కోరి ఈ పండుగను జరుపుకుంటారని పెద్దలు చెబుతుంటారు.

Karva chauth festival womens special

కర్వా చౌత్ పండుగ ఆనవాయితి:

శరదృతువులో పంటలు చేతికి వస్తాయి. అందువల్ల ఈ పండుగను శరదృతువులో చేస్తారు. కర్వా అనగా మట్టికుండ. ఈ పండుగ రోజున పెద్దపెద్ద మట్టి కుండలను తీసుకొని వాటిలో గోధుమలను నింపి, శివపార్వతులకు సమర్పిస్తారు. అలాగే ఆడవారు బంధువులను, మిత్రులను కలిసి బహుమానాలను ఇచ్చుకుంటారు. పెళ్లి అయిన

వారికైతే అత్తింటి వారు, తల్లిదండ్రులు విలువైన బహుమతులు ఇస్తారు. సందర్భంగా చాలా చోట్లలో కొత్తగా పెళ్లయిన ఆడవారు పెళ్లిరోజున వేసుకున్న బట్టలు ధరించి ఆ రోజున ఎలా పెళ్లికూతురుల రెడీ అయ్యారు. ఈరోజు కూడా చేతనిండా గాజులు నగలు వేసుకొని అందంగా ముస్తాబు అవుతారు.

అలాగే పెళ్లి జరిగే చాలా సంవత్సరాలు గడిచినవారైతే ఎరుపు, నారింజ, బంగారు రంగులో ఉండే చీరలను కట్టుకుంటారు. చేతులకు గోరింటాకు పెట్టుకొని అందంగా రెడీ అయ్యి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. ఇలా ఉపవాసం ఉండే మహిళలు చంద్రుడిని చూసిన తర్వాత వారి భర్తలను జల్లెడలో చూసి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ విధంగా చేయడం ఆనవాయితీగా వస్తుంది.

ఆడవారు ఉపవాసానికి ఒకరోజు ముందు తీసుకోవలసిన ఆహారం:

మహిళలందరికీ ఈ పండుగ ఎంతో ముఖ్యమైనది. ఈ పండుగను ఉపవాసం చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందువలన ఉపవాసం చేసేవారు ఒకరోజు ముందు పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోమని వైద్య నిపుణులు చెబుతుంటారు. చోలే బాతురే, బర్గర్, పరాటే, బాజీ వంటివి తీసుకోవాలని చెబుతారు. అలాగే పండ్లు ఆకుకూరలు తినాలి. కొబ్బరి నీళ్లు కూడా సేవిస్తూ ఉండాలి. క్వినోవా బత్తాయి, ఓట్స్, ఉడికించిన బంగాళదుంపలు వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.