RDT Admission 2021: ఆర్డీటీ సంస్థ కార్పొరేట్‌ విద్య ప్రవేశ పరీక్ష

ఆర్డిటి సంస్థ కర్నూలు మరియు అనంతపురం జిల్లాలో ఉచిత కార్పొరేట్ విద్య అభ్యసించడానికి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. ప్రతిభావంతులైన పిల్లలకు పదో తరగతి పాసైన విద్యార్థులకు ఈ సంస్థ నుండి ఉచితంగా విద్య అందించబడుతుంది.  ఈ పథకానికి నియమ నిబంధనలను సంస్థ సంచాలకులు విడుదల చేశారు. 

 ఒక్కసారి చూస్తే చాలు పైసా ఖర్చులేకుండా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం విద్యార్థులు పొందవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ సంస్థ నుండి పొందవచ్చు

.ఈ ప్రవేశ పరీక్షను అనంతపురం జిల్లాలోనే కాకుండా కర్నూలు జిల్లా వాసులకు ఆదోనిలో రెండు కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, ఆదోని సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కళాశాలలో ఈ నెల 22న నిర్వహించబోతున్నారు.

ఈ పరీక్షకు దరఖాస్తులను August 16 నుంచి 18 వరకు స్వీకరిస్తున్నారు.

ఆలూరు ఆర్డీటీ ప్రాంతీయ కార్యాలయంలో ఆలూరు, హొళగుంద, ఆదోని, చిప్పగిరి, హాలహర్వి మండలాల విద్యార్థులు,

పత్తికొండ ప్రాంతీయ కార్యాలయంలో తుగ్గలి, పత్తికొండ, ఆస్పరి, దేవనకొండ, మద్దికెర మండల విద్యార్థులు,

కోసిగి ప్రాంతీయ కార్యాలయంలో కోసిగి,మంత్రాలయం, కౌతాళం, మండలాల విద్యార్థులు, ఎమ్మిగనూరు ప్రాంతీయ కార్యాలయంలో ఎమ్మిగనూరు, నందవరం, పెద్దకడబూరు,గోనెగండ్ల మండలాల విద్యార్థులు డోన్‌ కార్యాలయంలో ప్యాపిలి, డోన్‌, మండలాల విద్యార్థులు తమ దరఖాస్తులను అందజేయవచ్చునని సంస్థ సంచాలకుడు షణ్ముఖరావు వివరించారు.

పదో తరగతిలో 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించినవారు మాత్రమే ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హులు.

అర్హత పరీక్ష గణితం, సైన్స్‌ పాఠ్యాంశాల్లోనే నిర్వహిస్తారు. 100 మార్కులకు ఉంటుంది. పదో తరగతి పరీక్షల్లో మార్కులు, ప్రవేశ పరీక్ష మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు.

మొత్తం 360 సీట్లలో అందులో ఆర్డిటి ఉద్యోగుల పిల్లలకు అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే పేద కుటుంబాలకు కొన్ని సీట్లను కేటాయిస్తారు. వెనుకబడిన తరగతులకు 10 శాతం అలాగే బీసీలకు 40,  50%   సీట్లు ఉన్నాయి.

అన్ని కేటగిరీల్లో బాలికలకు 50 శాతం సీట్లు ఉంటాయి. ఆర్డీటీ సంస్థ పరిధిలోని మండల, గ్రామాల కేంద్రాల్లోని ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఇతర పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయొచ్ఛు అయితే ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదివినవారే అర్హులు.

 విద్యార్థులు కళాశాలలో ఉన్నత చదువులు చదవచ్చు.  ఎం బి బి ఎస్ బి టెక్ తదితర కోర్సులు పూర్తి వరకు ఈ సంస్థ నిర్వహిస్తోంది. మొత్తంగా రూ రూ.కోటికి పైగా ఖర్చు చేస్తుంది.  ఒక విద్యార్థి విద్యార్థి విద్యార్థినీ విద్యార్థులు సుమారు 5 లక్షల  వరకు చెల్లిస్తుంది.