నిండుకుండలా ఉన్న సుంకేసుల బ్యారేజ్ :-
సుంకేసుల బ్యారేజ్ సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ డాక్టర్ పి.అనిల్ కుమార్ :-
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు గత రెండు సంవత్సరాలుగా ఎప్పుడు లేనంత నీరు ప్రాజెక్టులోకి వస్తుంది :-
త్వరలో 315 మందిని సిబ్బంది నియామకం
ప్రతి డ్యామ్ కు సిబ్బందిని కేటాయిస్తున్నాం
ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం :-
పాత్రికేయులకు వెల్లడించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పి.అనిల్ కుమార్ :-
కర్నూలు, ఆగస్టు 16 :- రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు గత రెండు సంవత్సరాలుగా ఎప్పుడు లేనంత నీరు ప్రాజెక్టులోకి వస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పి.అనిల్ కుమార్ అన్నారు.
సోమవారం ఉదయం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పి.అనిల్ కుమార్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్ లతో కలిసి నిండుకుండలా ఉన్న సుంకేసుల బ్యారేజ్ ను సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎన్ని వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వస్తుంది, ఎన్ని వేల క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వదులుతున్నారు జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్టు మురళి నాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు విడుదల చేసిన నీటిని మరియు కెనాల్ కు విడుదల చేసిన నీటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ డాక్టర్ పి.అనిల్ కుమార్ పాత్రికేయులతో మాట్లాడుతూ…గత రెండు సంవత్సరాలలో కూడా ఎప్పుడు లేనంతగా నీటిని సుంకేసుల డ్యామ్ కు వదులుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాజెక్టులకు గత రెండు సంవత్సరాలుగా ఎప్పుడు లేనంతగా నీరు ప్రాజెక్టులోకి వస్తోందన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ప్రతి డ్యామ్కు సంబంధించి సేఫ్టీ మెకానిజం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని డ్యామ్ లకు ఎంత మంది సిబ్బంది కావాలని ప్రాథమిక అంచనాకు రావడం జరిగిందన్నారు.
అన్ని డ్యామ్ లకు ఎలక్ట్రీషియన్ , మెకానిక్ లకు సంబంధించి దాదాపు 315 మంది డ్యామ్ ల మీద రిక్రూట్మెంట్ చేసుకునేందుకు ముఖ్యమంత్రి గారు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయం అన్నారు. గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడు ఏ డ్యామ్ లో సిబ్బంది ఉన్నారా లేరా అనేది కూడా పట్టించుకోలేదన్నారు. త్వరలో 315 మందిని నియమించుకొని ప్రతి డ్యామ్ కు సిబ్బందిని కేటాయిస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధితో ఉందన్నారు. ప్రతి ఒకటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏమేమి డ్యామేజ్ జరుగుతున్నాయి తెలుసుకుంటూ మ్యాన్ పవర్ తీసుకోవడం జరుగుతుందన్నారు.
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్టు మురళి నాథ్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ సి రామచంద్రమూర్తి, తదితరులు పాల్గొన్నారు.