కర్నూలు జిల్లా పాణ్యం లో
రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టకపోతే టోల్ గేట్లను ముట్టడిస్తాం —- సిఐటియు
గత 45 రోజుల నుండి రోడ్ల మరమ్మతుల పేరుతో హైవే అధికారులు కాలయాపన
జాతీయ రహదారి 40 పై సిఐటియు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో రాస్తారోకో, నిరసన
మండల కేంద్రమైన పాణ్యం డొoగు సమీపంలో గల జాతీయ రహదారి 40 పై సిఐటియు మండల కార్యదర్శి భాస్కర్ ఆధ్వర్యంలో Monday ఆటో కార్మికులతో భారీ స్థాయిలో రాస్తారోకో నిర్వహించి, నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ గత 45 రోజుల నుండి మరమ్మతుల పేరుతో నేషనల్ హైవే అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. జాతీయ రహదారి పై వన్ వే లో వెళ్లే వాహనాలకు రోడ్డు ప్రమాదాలు జరిగితే హైవే అధికారులు బాధ్యత వహించాలన్నారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు మరమ్మతులు చేపట్టినప్పటి నుండి వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి.
టోల్ గేట్లు, టాక్స్ ల పేరుతో కోట్ల రూపాయలు వాహనదారుల నుండి వసూలు చేస్తున్న హైవే అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం చాలా సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని లేకపోతే చాపిరేవుల టోల్ గేట్లను ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు వెంకట్, ఆటో కార్మికులు తిక్క స్వామి, నాగరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.