అంగన్ వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ల ఆహ్వానం..
నందికొట్కూరు ఐసిడిఎస్ క్లస్టర్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టులకు మహిళ అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సిడిపిఓ కొటేశ్వరమ్మ గురువారం తెలిపారు.
స్థానిక ఐసీడీస్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు.నందికొట్కూరు క్లస్టర్ పరిధిలో మూడు అంగన్ వాడీ కార్యకర్తలు,24 ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
అంగన్ వాడీ కార్యకర్తలు 10 తరగతి పాసై ఉండాలి, ఆయా పోస్టులకు 7 వ తరగతి విద్యా అర్హత కలిగి 2021జులై 1 నాటికి 21 సంవత్సరం పూర్తి అయి 35 సంవత్సరాల లోపు ఉండాలన్నారు.
అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహితులై ఉండాలి. స్థానిక నివాసితురాలై ఉండాలన్నారు.
క్లస్టర్ పరిధిలో అంగన్ వాడీ కార్యకర్తలు ఖాళీలు చౌట్కూరు కేంద్రం 2 లో ఎస్సి,వేంపెంట 2 లో ఎస్టీ, దామగట్ల 2 లో ఓసి జనరల్ కు కేటాయించారు.
అంగన్ వాడీ ఆయా ఖాళీలు శాతనకోట 1లో వికలాంగులు,తలముడిపి 4లో బిసి.సి ,మాసాపేట 1లో బిసి. ఈ ,చెలిమిల్ల1లో చెవిటి వికలాంగులు,తిమ్మాపురం 1లో బిసి.బి,పారుమాంచాల 3లో బిసి.ఈ,కొణిదెల 4లో బిసి.ఏ,పీకే ప్రాగటూరు 1లో ఓసి,దామగట్ల 1లో ఎస్సి, వేంపెంట 2లో ఓసి,అల్లూరు 1లో బిసి. బి,శాతనకోట 3లో ఈ డబ్ల్యూ ఎస్, వేంపెంట 3లో ఓసి జనరల్,ముచ్చుమర్రి 3లో ఎస్సి, క్రిష్ణా రావు పేట 1లో ఓసి,నెహ్రూనగర్ 1లో బిసి.ఏ,మద్దూరు 1లో ఓసి.జనరల్,దామగట్ల 2లో వికలాంగులు, ఎర్రగుడూరు 1లో ఎస్ టి,మల్యాల 1లో ఓసి జనరల్,పాములపాడు 3లో ఓసి,తుమ్మలూరు 2లో ఇడబ్ల్యూ ఎస్, తలముడిపి 2లో బిసి.బి,చౌట్కూరు 2 ఎస్ సి, లకు కేటాయించినట్లు ఆమె తెలిపారు.
అర్హులైన అభ్యర్థుల నుంచి 19నుంచి ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు.