Sports News

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్అరుదైన ఘనత సాధించిన విరాట్ కోహ్లీ.

టి20 వరల్డ్ కప్ 2022 సూపర్ 12 మ్యాచ్లో ఈరోజు భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సృష్టించారు. అతను కేవలం 12 పరుగులు మాత్రమే ఈ మ్యాచ్లో చేసినప్పటికీ ,11 పరుగులు పూర్తి అయ్యేసరికి టి20 మ్యాచ్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఒకవేళ ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 28 పరుగు చేసినట్లయితే టి20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. కోహ్లీ టి20 వరల్డ్ కప్ లో 22 ఇన్నింగ్స్ ఆడి 80 కి పైగా సగటుతో 1001 పరుగులు చేశారు.

దీంట్లో 12 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ మ్యాచ్లో కోహ్లీ28 వరకు చేసి ఉంటే శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనె పేరిట ఉన్న అరుదైన పరుగుల రికార్డు బ్రేక్ చేసేవాడు. కానీ 12 పరుగులు చేసి 11 పరుగు పూర్తి అయ్యేసరికి ఈ రికార్డు సృష్టించడం జరిగింది. ఈ మహేళా జయవర్ధన్ 31 మ్యాచ్లను ఆడి 1016 పరుగులు చేశాడు.

Virat Kohli

ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో చాలా అద్భుతమైన ప్రదర్శన చేసి టీమిండియా జట్టు ను ఒంటి చేత్తో గెలిపించే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ మ్యాచ్ లో 82 నాట్ అవుట్ ఇన్నింగ్స్ ఆడాడు. నెక్స్ట్ నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అద్భుతమైన అర్థ సెంచరీ ని పూర్తి చేసి 62 పరుగులు చేశాడు.

కానీ సౌత్ ఆఫ్రికా తో జరిగిన ఈరోజు మ్యాచ్లో కోహ్లీ 12 బరువులకే అవుట్ కావడం, 49 పరుగులకే సగం వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది భారత్. ఈరోజు జరిగిన మ్యాచ్లో మాత్రం కెప్టెన్ తో సహా, విరాట్ కోహ్లీ మిగతా వారిలో కూడా కొందరు స్టార్ బ్యాటర్స్ కూడాఆటను నిరాశపరిచారు. ఇది ఇలా ఉండగా సూర్య కుమార్ యాదవ్ మరోసారి అర్థసంచరీ చేసి టీమిండియా జుట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. విరాట్ కోహ్లీఈ అరుదైన ఘనత సాధించడం ద్వారా భారత క్రికెటర్లకు మంచి పేరు సాధించాడు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version