వర్కౌట్స్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్న విరాట్ కోహ్లీ.
క్రికెట్ అభిమానులందరికీ కింగ్ అంటేనే గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అంటేనే సెంచరీలు, హాఫ్ సెంచరీలు, డబల్ సెంచరీలు, ఎన్నో అవార్డ్స్ గుర్తొస్తాయి. ఒకసారి స్టేడియంలోకి దిగిన వెంటనే ఫోర్లు, సిక్సర్లతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇటీవల జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ ఆస్ట్రేలియా వేదికన జరిగింది.
ఈ టోర్నీలో టీమిండియా జట్టు సెమి ఫైనల్ వరకు నా చేరింది అంటే ఒక్క విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ యొక్క ఆట ద్వారా మాత్రమే. ఎన్నో హాఫ్ సెంచరీలు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ చివరి వరకు ఉండి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఒంటె చేత్తో మ్యాచ్ గెలిపించాడు.
విరాట్ కోహ్లీ వ్యక్తిగత సమాచారం:-
కోహ్లీ 1988లో నవంబర్ 5వ తేదీ ఢిల్లీలో జన్మించాడు. ప్రస్తుతం ఇతని వయసు 34 సంవత్సరాలు. చీకు అనే ముద్దు పేరు కూడా ఉంది. బ్యాటింగ్ విషయానికొస్తే కుడిచేతి వాటం, బౌలింగ్ అయితే రైట్ ఆర్మ్ మీడియం ఫేస్ లో కూడా బౌలింగ్ చేయగలడు. కవర్ రీజియన్ మీదుగా ఇతను కొట్టే షార్ట్స్ చాలా ఫేమస్. టీమిండియా మాజీ కెప్టెన్.
ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ తర్వాత విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుని అతని ఫ్యామిలీతో గడుపుతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్ నుంచి కూడా దూరంగా ఉన్నాడు. ఈ టైంలో అతను ఈ కుటుంబంతో గడుపుతున్నాడు. అలా అయితే వచ్చేనెల బంగ్లాదేశ్ టూర్కు వెళ్ళనున్నాడు. అందుకోసమే అనుకుంటా తన ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టి వర్కౌట్స్ చేస్తూ ఉన్నాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ షర్టు విప్పి మరీ బరువులు లాగుతున్నట్లు, థ్రెడ్ మిల్ పై పరిగెడుతున్న సన్నివేశాలు ఉన్నా ఒక వీడియోను విరాట్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను తన అభిమానులతో పంచుకున్నాడు.
ఈ వీడియో పై అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే టీమిండియా జట్టులో ఉన్న ప్లేయర్స్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చిరుత ఎమోజిని కామెంట్ రూపంలో పెట్టి విరాట్ ను చిరుతతో పోల్చి చెప్పాడు.
ఈ వీడియోలో కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తున్న విరాట్ కోహ్లీ శాకాహారి అంట. ఈ విషయం నమ్మశక్యంగా లేదు కదా! కానీ ఇదే నిజం. ఒకప్పుడు మాంసాహారం ఎక్కువగా తినే విరాట్ కోహ్లీ ప్రస్తుతం దాన్ని మానేసి కూరగాయలు ఎక్కువగా తింటున్నాడు. 2018 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్ళినప్పుడు సర్వికల్ స్పైన్ సమస్య ఎదురయింది.
ఈ సమస్య విరాట్ ని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది రాత్రిపూట సరిగా నిద్రపోయేవాడు కూడా కాదట. మాంసాహారం మానేయడం తనకు చాలా ఉపయోగంగా ఉంది అని చెప్పుకొచ్చాడు విరాట్. కోడిగుడ్డు మాత్రమే తింటూ ఉంటాడు.
విరాట్ కోహ్లీ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకున్న అతను వర్కౌట్స్ వీడియోను చూసి ఒక అభిమాని స్పందిస్తూ “మాంసాహారం తినకపోతే కండలు పెంచలేమనేది కొందరి అభిప్రాయమనీ”కామెంట్ పెట్టాడు. ఈ విషయంపై విరాట్ స్పందిస్తూ” అది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద అపోహ” అని బదులిచ్చాడు.