29 రోజులు క్రికెట్ అభిమానులకు పరుగుల పండగ
ప్రతి మనిషికి ఉన్న ఒత్తిడి, బిజీ లైఫ్ నుంచి వచ్చే కొన్ని సమస్యల నుంచి ప్రతి వ్యక్తి తప్పించుకోవడానికి వివిధ రకాల పనులు చేస్తూ ఉంటారు .దీంట్లో భాగంగా రకరకాల క్రీడలను ఆడడం, లేదా చూడడం ద్వారా తమ ఒత్తిడిని తగ్గించుకుని కొంతవరకు ప్రశాంతతగా ఉంటారు. అటువంటి క్రీడల్లో ని క్రికెట్ కు సంబంధించి తీసుకుంటే ప్రస్తుతం ఈరోజు నుంచి టి20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి 16 జట్లు బరిలో దిగి పోటీ పడనున్నాయి. 21వ తేదీ వరకు తొలి రౌండు మ్యాచ్ లు జరగబోతున్నాయి. 22వ తేదీ నుంచి గ్రూప్ సమరం ప్రారంభం కానుంది.
టి20 ప్రపంచ కప్ 2021 కు సంబంధించి ఫైనల్ నవంబర్లో 14వ తేదీన జరిగింది. దీనికి సంబంధించి క్యాలెండర్లు సంవత్సరం కూడా పూర్తికాకుండానే మరల క్రీడలకు సంబంధించి విశ్వ సమరం మరల ప్రారంభం కానుంది. డిపెండింగ్ ఛాంపియన్, మాజీ ఛాంపియన్లు, కొత్త ఛాంపియన్గా నిలవాలని పట్టుదలతో ఉన్న జట్లన్నీ మరోసారి తమ సత్తా చాటేందుకు బరిలో దిగనున్నాయి. వన్డే వరల్డ్ కప్ రెండుసార్లు విజయవంతంగా నిర్వహించిన ఆస్ట్రేలియా తొలిసారి ప్రపంచ కప్ ఆతిథ్యం ఇస్తుండగా ప్రస్తుతం కొత్తగా అమల్లోకి వచ్చిన ఐసీసీ నిబంధనల మేరకు ఈ మెగా ఈవెంట్ అనేది మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది.
ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు భార
గత రికార్డులు-
ప్రస్తుతం వరకు 7 టి20 ప్రపంచ కప్ లు జరిగాయి. దీంట్లో భాగంగా వెస్టిండీస్ 2012, 2016లో రెండుసార్లు విజయం సాధించింది. అదేవిధంగా భారత్ 2007 సంవత్సరంలో విజయం సాధించింది. పాకిస్తాన్ 2009లో, ఇంగ్లాండ్ 2010లో, శ్రీలంక 2014 సంవత్సరంలో, ఆస్ట్రేలియా 2021 వ సంవత్సరంలో ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి.
ఫార్మేట్ కు సంబంధించి గత వరల్డ్ కప్ తరహాలోనే ఎలాంటి మార్పు లేదు. మొదటి రౌండ్లో 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ప్రతి టీం తన గ్రూపులో ఉండే మిగతా మూడు టీమ్లతో తలపడాల్సి ఉంటుంది. ఈ గ్రూపులకు సంబంధించి మ్యాచ్ జరిగిన తర్వాత టాప్ టు జట్లు తర్వాత దశకు వెళ్లేందుకు అర్హత సాధిస్తారు. గ్రూప్ ఏ కు సంబంధించి మాజీ ఛాంపియన్స్ అయినా శ్రీలంక ,నామీబియా, నెదర్లాండ్స్ ,యూఏఈ ఉన్నాయి. గ్రూపు బి కి సంబంధించి రెండుసార్లు ఛాంపియన్స్ అయినా వెస్టిండీస్ ,స్కాట్లాండ్,ఐర్లాండ్, జింబాబ్వే ఉన్నాయి.
ఇక్కడ ముందంజలో నిలిచిన నాలుగు టీమ్లతోపాటు ర్యాంకింగ్ ద్వారా నేరుగా అర్హత సాధించిన భారత్ ,పాకిస్తాన్ ,ఆస్ట్రేలియా ,దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ,న్యూజిలాండ్ ,బంగ్లాదేశ్ ,ఆఫ్గనిస్తాన్ కలిసి సూపర్ 12 మ్యాచులు ఆడతారు. ఈనెల 22 నుంచి సూపర్ 12 మ్యాచులు మొదలవుతాయి. సూపర్ 12 మ్యాచ్లకు సంబంధించి గ్రూప్ వన్ లో ఆస్ట్రేలియా ,ఇంగ్లాండ్ ,న్యూజిలాండ్ ,ఆఫ్ఘనిస్తాన్లు ఉన్నాయి.
గ్రూప్ టు కు సంబంధించి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. సూపర్ 12 మ్యాచ్ల లోని రెండు గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన చెట్లు సెమీ ఫైనల్ కు వెళ్లేందుకు అర్హతను సాధిస్తాయి. మొదటి సెమీఫైనల్ నవంబర్ 9వ తేదీన జరగబోతుంది. రెండవ సెమీఫైనల్ నవంబర్ 10వ తేదీన జరగబోతుంది. ఫైనల్ మ్యాచ్ అనేది నవంబర్ 13వ తేదీ నిర్వహిస్తున్నారు.