Suryakumar Yadav: టీం లో బెస్ట్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్- దినేష్ కార్తీక్
టీమిండియా జట్టులో 360 డిగ్రీలలో స్టేడియం కువ్అన్ని వైపులా ఏ కోణంలో అయినా ఎలాగైనా కూడా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కలిగిన ఏకైక ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్. అతను ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా తన బ్యాటింగ్ ద్వారా అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. అతని ప్రదర్శన ద్వారా ఇండియాలో మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తంలో నంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కనిపిస్తున్నాడు. ఇక సూర్య పాటింగ్ చేయడానికి స్టేడియంలో దిగగానే ప్రత్యర్థులకు చమటలు పట్టిస్తాడు.
బౌలర్లు అయితే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఏ టైపు బాల్ వేయాలో కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సిక్సులు, ఫోర్ లతో మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. ప్రజెంట్ ఇతను ఐసీసీ టి20లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఫ్యూచర్లో అతని ఆశ్చర్యపరిచే ప్రదర్శన ద్వారా క్రికెట్ ఆటలోని 3 ఫార్మేట్ లలో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటాదని అనుకుంటున్నారు.
ఇక టి20 ప్రపంచ కప్ 2022 టోర్నమెంట్లో అయితే అతని ప్రదర్శన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫోర్లు ,సిక్సర్లతోనే మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యాన్ని గురీ చేశాడు. ఈ ప్రపంచకప్ టోర్నీలో ఇతను మూడు అర్థ సెంచరీలు చేశాడు. ఇది ఇలా ఉండగా సూర్య ఫామ్ లోకి వచ్చాడంటే ఆ మ్యాచ్ విన్ అయినట్టే.
ఇటీవల కాలంలో జరిగిన ఒక మ్యాచ్లో సెంచరీ కూడా పూర్తి చేశాడు. ఇతని ఫామ్ గురించి తోటి ఆటగాడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయినా దినేష్ కార్తీక్ క్రిక్ బజ్ తో మాట్లాడాడు.క్రికెట్ వెటరన్ లు ఇతని ఫామ్ గురించి చాలాసార్లు ఆలోచించడం జరిగింది.
సూర్య కుమార్ ఫామ్ గురించి తన అభిప్రాయం చెప్పిన దినేష్ కార్తీక్-
క్రికెట్ స్టేడియం చుట్టుపక్కల 360 డిగ్రీలలో ఎలాగైనా కూడా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం సూర్య కుమార్ యాదవ్ కు వుంది. కొద్ది టైంలోనే, స్టేడియం పై కొద్దిసేపు ఉన్నా కూడా అతని బ్యాటింగ్ ప్రదర్శన ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
దానితోపాటు ఎన్నో సందర్భాలలో ఆశ్చర్యానికి కూడా గురి చేశాడు. ప్రజెంట్ టీం ఇండియన్ ప్లేయర్స్లలో మిడిల్ ఆర్డర్లో స్టార్ క్రికెటర్గా, జట్టుకు వెన్నెముకగా వ్యవహరిస్తున్నాడు.
సూర్య కుమార్ ఇప్పటివరకు 42 టి20 మ్యాచ్ లలో, 40 ఇన్నింగ్స్ లలో 180 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. ఈ విషయంపై దినేష్ కార్తీక్ సూర్య గురించి మాట్లాడుతూ ఒక గొప్ప ఆటగాడిగా అభివర్ణించాడు. దినేష్ కార్తీక్, సూర్య బెస్ట్ ప్లేయర్ అని క్రికెట్ బజ్లో మాట్లాడుతూ అతని గురించి ఈ విధంగా చెప్పాడు.
“సూర్య కుమార్ యాదవ్ ఒక అద్భుతమైన ఆటగాడు. స్టైల్ గ్రేట్ 180 కంటే ఎక్కువ మరియు 40 మ్యాచ్లలో 45 కంటే సగటుతో ఆడిన ఆటగాడు” అని చెప్పాడు.
సూర్య టి20 మ్యాచ్ లలో ఇప్పటివరకు 40 మ్యాచులు ఆడాడు. ఈ మ్యాచ్లలో 180.97 స్టైల్ రేట్ లతో ఆడడు. ఈ 40 మ్యాచ్లలో 1408 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లలో రెండు సెంచరీలు, 12 అర్థ సెంచరీలు చేసి 44.00 సగటుతో స్కోర్ చేశాడని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
ప్రపంచకప్ ను ఒక్క ఊపు ఊపిన సూర్య-
టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ అనేది ఆస్ట్రేలియా వేదికన జరిగింది. ఈ టోర్నీలో సూర్య కుమార్ ప్రదర్శించిన ఆటతీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మొత్తం టోర్నీలో సూర్య 6 మ్యాచుల్లో 59.75 సగటుతో 239 పరుగులు చేశాడు. ఈ వరల్డ్ కప్ లో మూడు అర్థ సెంచరీలు కూడా చేశాడు. అతని ప్రదర్శన ఆధారంగా టి20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. పాకిస్తాన్ కి చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహమ్మద్ రిజ్వాన్ ను వెనక్కి నెట్టేశాడు.