Avatar 2: అవతార్ 2 చూడడానికి వెళ్ళిన వ్యక్తి హఠాన్మరణం

ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న అవతార్ 2 మూవీ శుక్రవారం రిలీజ్ అయింది. జేమ్స్ కామెరున్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కావడం జరిగింది.అవతార్ 2మూవీ తెలుగు వర్షన్ కి సంబంధించి డైలాగ్స్ రాసే అవకాశం శ్రీనివాస్ అవసరాలకు దక్కింది. ఈ మూవీ శుక్రవారం రిలీజ్ కావడం జరిగింది.

ఈ మూవీ చూస్తుండగా థియేటర్ లోనే ఒక వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్గా స్పందిం చారు. అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ అనే మూవీ లోని విజువల్ వండర్స్ ని చూడడానికి ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్స్ కి వెళ్తున్నారు. తెలుగు వాళ్ళు కూడా ఈ మూవీ చూడ్డానికి ఎక్కువగా తరలి వెళ్తున్నారు. ఇటీవలే తాజాగా ఈ మూవీ చూస్తుండగా ఒక వ్యక్తి థియేటర్ లోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించాడు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ సంఘటన జరిగింది.

అవతార్ 2 చూడడానికి వెళ్ళిన వ్యక్తి హఠాన్మరణం

ఈ మూవీ శుక్రవారం రిలీజ్ కాగా, లక్ష్మీ రెడ్డి శ్రీను అనే వ్యక్తి ఈ మూవీ చూడడానికి తన తమ్ముడితో కలిసి థియేటర్ కి వెళ్ళాడు. సినిమా చూస్తూ ఉండగా హఠాత్తుగా సినిమా మధ్యలో అతనికి గుండెపోటు రావడం వల్ల అక్కడికక్కడే కూలిపోయాడు. శ్రీను తమ్ముడు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కి అతన్ని తరలించారు. అయితే అప్పటికే ఈ వ్యక్తి మృతి చెందాడు అని డాక్టర్స్ చెప్పారు. ఈ సంఘటన పెద్దాపురంలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. శ్రీనుకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు.

అవతార్ పార్ట్ వన్ రిలీజ్ అయిన సమయంలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. అవతార్ 1 డిసెంబర్ లో 2009 సంవత్సరంలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో తైవాన్ లో కూడా 42 ఏళ్ల ఓ వ్యక్తి అవతార్ 1 చూస్తూ థియేటర్ లోనే గుండెపోటుతో మరణించాడు. అతనికి ఈ అధిక రక్తపోటు ఉందని తర్వాత తేలింది. ఆ వ్యక్తి సినిమా చూస్తూ బాగా ఉద్వేగానికి గురి కావడం వల్ల రక్తపోటు పెరిగి ఆ వ్యక్తి మరణించినట్లు తెలియజేశారు. ఇప్పుడు చోటు చేసుకున్న సంఘటన, అప్పుడు జరిగిన సంఘటన ఒకే విధంగా ఉన్నట్లు తెలిసింది.

సాధారణంగా ఎవరైనా హర్రర్ మూవీస్ చూస్తున్నప్పుడు కొందరు ఎక్కువ భావోద్వేగాలకు , గుండెపోటు కు లోనవుతూ ఉంటారు. కానీ జేమ్స్ కామెర్న్ డైరెక్షన్లో వస్తున్న అవతార్ 2 మూవీలో అలాంటి భయానక సంఘటనలు ఏమీ లేనప్పటికీ, చాలామంది ఈ మూవీ చూస్తూ ఉన్నప్పుడు ఎక్కువ భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు.