Anoushka Kumar: సినీ ఇండస్ట్రీలో మరో కొత్త హీరోయిన్… హీరో అజిత్ రీల్ కూతురు

బాలనటులు హీరో హీరోయిన్లుగా మారాడం అనేది చాలా సులువు అయినా విషయం. గతంలో అనేక మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ హీరోహీరోయిన్లు గా మారి.. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి, రాశి, మీనా మొదలైన వారు బాల నటులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

అనంతరం కొంతకాలనికి హీరోయిన్లు గా మారి ఇండస్ట్రీలో బాగానే వెల్కమ్ చెప్పారు. అలానే విశ్వనటుడు కమల హాసన్ వంటి వారు కూడా చైల్డ్ ఆర్టిస్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత హీరోలుగా మారి.. స్టార్ డిమాండ్ సంపాదించారు. ఆ కోవలోకి తాజాగా బ్యూటీ అనిఖా సురేంద్రన్ చేరింది. ఈ పేరు అంతగా తెలియక పోవచ్చు. విశ్వాసం చిత్రం లో అజిత్ , నయనతార కూతురుగా నటించిన అమ్మాయి అంటే ఠక్కున గుర్తుపడతారు. అంతలా ఆ మూవీతో అనిఖా సురేంద్రన్ పాపులర్ అయ్యింది.

సినీ ఇండస్ట్రీలోకి మరో కొత్త హీరోయిన్… హీరో అజిత్ రీల్ కూతురు

అనిఖా సురేంద్రన్ 2007లో ‘చోటా ముంబై’ అనే మలయాళ చిత్రం తో బాల నటిగా వెండి తెరకు పరిచయమైంది. ఆ తరువాత పలు మలయాళ మూవీస్ లో బాల నటిగా నటించి..మంచి గుర్తింపు సంపాదించింది. అలానే “ఎన్నై అరిందాల్” చిత్రం తో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా పలు చిత్రం లో బాల నటిగా నటించింది.

ఈ క్రమంలో 2019లో అజిత్ హీరోగా వచ్చిన ‘విశ్వాసం’ చిత్రం లో ఫుల్ క్రేజ్ సంపాందించింది. ఆ చిత్రం లో అజిత్, నయనతార కూతురిగా అనిఖా సురేంద్రన్ నటించింది. అలానే తెలుగులో సైతం ఘోస్ట్ మూవీలో అదితి అనే చిన్నారి పాత్రలో నటించి.. అభిమానులను మెప్పించింది. ఇలా తమిళ, మలయాళం, తెలుగు భాషల్లో చాలా చిత్రాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 18వ ఏటలోకి అడుగుపెట్టింది.

దీంతో ఇప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలను చేసిన.. ఆ అమ్మడు హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఇప్పట్లో సోషల్ మీడియాలో ఫుల్ యా క్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అలా తన అందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ….చిత్ర పరిశ్రమ దృష్టి తనపై పడేలా చేసుకోవడం విజయం సాధించింది.

అంతేకాక జూనియర్ నయనతార అనే మచ్చ కూడా వేసుకుంది. ఇప్పటికే బాలనటిగా తెలుగు, మలయాళం భాషల్లో అడుగుపెట్టింది. తాజాగా తెలుగులో బుట్టబొమ్మ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. హీరోయిన్ గా కూడా కెరీర్ న విజయవంతగా కొనసాగించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుత ఈ బ్యూటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి.