Veera Simha reddy: జనవరి 12వ తేదీన విడుదల కానున్న బాలయ్య కొత్త మూవీ

సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ ఆయన అభిమానులే. తనదైన నటనతో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీశాడు.

ఎన్నో అవార్డ్స్ ని సొంతం చేసుకున్నాడు. తన మూవీస్ లో వచ్చే డైలాగ్స్ చాలా ఫేమస్. ఆయన మేనరిజం చాలా ఫేమస్. థియేటర్లలో స్క్రీన్ పైన ఆయన కనిపిస్తే చాలు అభిమానులు పండగ చేసుకుంటారు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఉంటుంది.

తాజాగా బాలకృష్ణ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. “వీర సింహారెడ్డి”అనే టైటిల్ తో ఉన్న మూవీలో హీరోగా చేస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతి పండగ సందర్భంగా రిలీస్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికీ రిలీజ్ అయిన ఈ మూవీలోని “జై బాలయ్య” అనే పాట చాలా ఫేమస్ అయ్యింది.

జనవరి 12వ తేదీన విడుదల కానున్న బాలయ్య కొత్త మూవీ

ఇక అభిమానులు ఆ మూవీలో ఎలాంటి పాటలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మొదటిగా విడుదలైన “జై బాలయ్య” అనే పాట ప్రేక్షకుల్లో బాగా ఉత్సాహాన్ని పెంపొందించింది. ఈ పాటతో భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. మరి ఈ మూవీలో రెండవ పాటైనా” సుగుణసుందరి”అనే పాట ఇటీవలే రిలీజ్ అయింది.

మరి ఈ చిత్రంలో ఉన్న ఇంకొక ప్రత్యేకమైన పాట ను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయాలనుకున్నారు.”మా బావ మనోభావాలు”అంటూ ఉండే ఈ పాట సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతుందని సినివర్గాలు తెలియజేస్తున్నాయి.

ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రాబోతుంది. ఈ మూవీలో బాలకృష్ణ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ మూవీ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రాబోతుంది. నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ ఈ మూవీకి ప్రొడ్యూసర్స్. మరి ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ అన్ని థియేటర్స్ లో విడుదల కానుంది.

పండుగ కానుకగా ప్రేక్షకులకు అందించనున్నారు సినీ వర్గాలు. లాస్ట్ పాట షూట్ ఉడుతవుగానే మూవీ పూర్తవుతుందని తెలుస్తుంది. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన నిర్మాణ అనంతర పనులు వేగంగా జరుగుతున్నాయి. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి లాంటి నటీనటులు నటించారు.

ఈ మూవీకి సంగీతం తమన్ అందిస్తున్నారు. చాయాగ్రహణం విషయానికొస్తే రిషి పంజాబీ అందిస్తున్నారు. ఎడిటర్-నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనింగ్-ఏ. ఎస్. ప్రకాష్, ఈ మూవీకి సంబంధించిన సంభాషణలు -సాయి మాధవ్ బుర్ర అందించారు.