కలర్ ఫోటోను వరించిన తెలుగు ఉత్తమ చిత్రం అవార్డు.

68వ జాతీయ సినిమా అవార్డుల పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. జాతీయ సినిమా అవార్డుల బృందం ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫోటో సినిమాను ఎంపిక చేసింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫోటో 68వ జాతీయ అవార్డును అందుకుంటుంది. ఈ సినిమా మిగిలిన వాటితో పోలిస్తే ఎంతో భిన్నంగా ఉంటుంది. ఇందులో హీరో సాధనాతనమైన జీవితం గడపడం ఎంతో విశేషం. 

కలర్ ఫోటో సినిమా తెలుగు ప్రేక్షకుల మనసుకు హత్తుకుంది.ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీ లాగా అందరినీ అలరించింది.సినీ ప్రముఖులు, చిరంజీవి లాంటి వారు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.సినీ పరిశ్రమకు వస్తున్న నూతన నటీనటులకు ఈ సినిమా ఆదర్శవంతంగా ఉంటుంది.కష్టపడి నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని అవార్డులు ప్రశంసలు వస్తాయని ఈ సినిమా ద్వారా మరొకసారి నిరూపితమైందని సినీ ప్రముఖులు తెలిపారు.

ఉత్తమ తెలుగు చిత్రం.

కలర్ ఫోటో సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రాజుకు ఇదే తొలి చిత్రం. తొలి సినిమాకే జాతి అవార్డు రావడం ఎంతో గర్వకారణం. ఇది తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. లౌక్య ఎంటర్టైన్మెంట్ ,అమృత ప్రొడక్షన్ ఈ సినిమాను రూపొందించారు. సుహాన్, చాందిని చౌదరి, సునీల్ ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమాకి కాలభైరవ సంగీతం చేకూర్చాడు. కాలభైరవ పాటలు పాడిన రెండవ చిత్రం ఇది. ఈ చిత్రం సగటు కంటే తక్కువ వ్యక్తిగత కథఅని పిలవబడింది. కమెడియన్ సుహాన్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. కలర్ ఫోటో సినిమా ఆహా లో23 అక్టోబర్ 20న విడుదల చేశారు. దర్శకుడు సందీప్ రాజ్ తో సహా గతంలో కొన్ని షార్ట్ ఫిలిం లలో నటించిన చాలామంది ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ మచిలీపట్నం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో చిత్రీకరించారు. 

కలర్ ఫోటో సినిమాలో హీరోయిన్ దీప్తి తన తండ్రి మరణ వార్తను అందుకోవటం నుంచి సినిమా  ప్రారంభమవుతుంది. ఆమె మరియు ఆమె భర్త చందు వారి గ్రామానికి చేరుకొని వారి కుటుంబాన్ని కలుసుకుంటారు. రామరాజు సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలో సునీల్ నటించారు. ఆయన దీప్తికి అన్న పాత్రలో నటించారు. దీప్తి తన అన్నతో మాట్లాడకుండా తన జీపులో ఎక్కి తన మాజీ ప్రేమికుడు జయకృష్ణ ఇంటికి వెళుతుంది. దారిలో వారికి ఒక ప్రేమ జంట కనబడడం చూసి వారి సమస్యను తెలుసుకొని గతంలో జయకృష్ణను ప్రేమించినప్పుడు కలిగిన సమస్యలా పోల్చి ఉండటంతో వారికి తన ప్రేమ కథను వివరిస్తుంది.

కలర్ ఫొటో సినిమాలో జయ కృష్ణ పాల వ్యాపారి కొడుకు .అతను చాలా పేదవాడు. దీప్తి చదివే కాలేజీలో చదువుతుంటాడు. అనుకోకుండా ఒక రోజు దేవతలాగా వేషం వేసిన దీప్తిని చూసి ఇష్టపడతాడు. కానీ తనకున్న కలర్ కారణంగా ఆర్థిక స్తోమత వల్ల నిజం చెప్పలేడు. కొంతకాలానికి దీప్తినే వెళ్లి తనను ప్రేమిస్తున్నట్లు చెబుతుంది. వారు కలవడం మాట్లాడడం ఎవరు చూడకూడదని షరతు పెడుతుంది. కొన్ని గొడవల వల్ల విడిపోయి తన హాల్ టికెట్ కోసం వచ్చి మళ్ళీ కలుస్తారు. దీప్తి జయకృష్ణ తమ ప్రేమ ఫలించదని చనిపోవాలని నిర్ణయించుకుని విష0 త్రాగుతారు. దీప్తి అన్న తనను బ్రతికిస్తాడు. జయకృష్ణ మరణిస్తాడు. జయకృష్ణ ఇంటిలో జయకృష్ణ ఒక ఫోటో కూడా లేదని తెలుసుకొని తన బొమ్మ గీసి దానిని కలర్ ఫోటో అని పిలవడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలోని కొన్ని సంఘటనలు ప్రేక్షకులకు కంటతడి పెట్టిస్తాయి. సామాన్యుడి జీవితం గురించి వివరిస్తుంది. ఇలా ఒక చిన్న బడ్జెట్ సినిమాకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం, తీసిన మొదటి సినిమాకే అవార్డు రావడం నటీనటులకు ఎంతో ప్రేరణగా ఉంటుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.