Vijay: రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే అంటున్న దళపతి విజయ్

అటు తమిళ్ ఇండస్ట్రీలో, ఇటు తెలుగులో కూడా బాగా ఫేమస్ అయిన హీరో తళపతి విజయ్. తన నటన ద్వారా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. తన స్టైల్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. 1974 జనవరి 22 పుట్టాడు. 1984లో తండ్రి ఎస్ .ఏ. చంద్రశేఖర్ డైరెక్షన్స్ లో వచ్చిన “వెట్రి”అనే మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తలపతి గా పేరు సంపాదించుకున్నాడు.

” నాలయ్య తీర్పు” అనే మూవీ ద్వారా నటునిగా పరిచయమయ్యారు. ఇది పక్కన పెడితే కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తాజాగా ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళ్ ఇండస్ట్రీ సంబంధించి చూస్తే పారితోషకం విషయంలో ఇప్పటివరకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది ఎక్కువ పారితోషకం గా ఉండేది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే అంటున్నా దళపతి విజయ్

130 కోట్లు పారితోషకం రజనీకాంత్ తీసుకునే వారిని సమాచారం. ఈయన తర్వాత వరుసలో దళపతి విజయ్ కూడా ఉన్నారు. విజయ్ 110 నుంచి 125 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమాచారం. ఇప్పుడు ఈ పారితోషకం విషయంలో లెక్కలు తారుమారవుతున్నాయి.

ప్రస్తుతం విజయ్ రెమ్యూనరేషన్ అన్న పెంచేశాడు అంటూ వార్త కోలీవుడ్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ చేసిన” బీస్ట్” మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. అయినా కూడా ఆయన రెమ్యూనరేషన్ విషయంలో తగ్గకుండా పెరుగుతూనే ఉందని తెలుస్తుంది. ప్రజెంట్ విజయ్ చేస్తున్న కొత్త మూవీ “వారిసు”.

ఈ మూవీ తెలుగులో , తమిళ్లో ఒకేసారి విడుదల కానుంది. తమిళ్లో” వారీసు “అనే పేరుతో తెలుగులో “వారసుడు” అనే పేరుతో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా చేయడానికి విజయ్ ఇంతకుముందు కంటే ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ భారీ చిత్రాల కు తెలుగులో సంక్రాంతికి విడుదల కానుంది.

ఈ మూవీ తర్వాత విజయ్ మరో మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. లోకేష్ కనకరాజు డైరెక్షన్లో నెక్స్ట్ మూవీ సైన్ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్లో “మాస్టర్” అనే హిట్ మూవీ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. విజయ్ నటించిన 67వ సినిమాగా ఈ సినిమా ఉండబోతుంది.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్స్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.విజయ్ “వారీసు “సినిమా తర్వాత చేయబోయే చిత్రం గురించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. మరి ఈ 68వ మూవీ ని సన్ పిక్చర్స్ నిర్మించడానికి తగిన ఏర్పాటు చేస్తుంది. మరి ఈ మూవీ 400 కోట్ల రూపాయల అనే భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. మరి ఈ మూవీకి విజయ్ 150 కోట్ల రూపాయలు పారితోషకం తీసుకొని ఉన్నాడని సమాచారం.

మరి ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ “అట్లీ”డైరెక్షన్ చేయబోతున్నాడు. వీరిద్దరి జంటగా ఇంతకుముందు తేరి, మెర్సల్, బిగిల్ లాంటి చిత్రాలు చేశారు. ప్రజెంట్ ఈ డైరెక్టర్ షారుక్ ఖాన్, నయనతారతో చేస్తున్నా హిందీ చిత్రం” జవాన్” అనే చిత్రం పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు. ఈ మూవీ 2023 సమ్మర్లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.