Samantha: ఆ సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసు కొనుంద సమంత…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్ సమంత. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. తనదైన శైలిలో నటిస్తూ, తన అందం ద్వారా ఎంతోమంది అబ్బాయిల మనసుని సొంతం చేసుకుని, ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు సమంత.

ప్రస్తుతం సమంతకు సంబంధించి కొంతకాలంగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ గా అవుతున్నాయి. సమంత మయోసైటిస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నారని ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజెంట్ దీనికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు సమంత.

తాజాగా సమంత సినిమాలకు దూరంగా ఉన్నారు అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. తను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశారు సమంత.

ఆ సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసు కొనుంద సమంత?

ఈ వార్త వచ్చిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి పై అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇటీవలే సమంత ఆరోగ్య పరిస్థితి క్షీణించింది అంటూ ఇంకొక వార్త వైరల్ గా మారింది. ఈ వార్త నిజం కాదని సమంత చాలా బాగున్నారని తమ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. ఈ దీని ద్వారా ఆమె ఆరోగ్యం పై వచ్చిన అనేక రకాల వార్తలన్నీ కూడా ప్రస్తుతం రూమర్స్ అని అర్థమైంది.

ఈ వ్యాధి చికిత్స కోసం మొదటిగా అమెరికా వెళ్లారు సమంత. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత అదే చికిత్స విధానాన్ని ఇక్కడ కూడా తీసుకున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల వ్యాధి నయం కాకపోవడంతో కేరళ వెళ్లి ఆయుర్వేద వైద్యం తీసుకోవడానికి కేరళ వెళ్లారని సమాచారం వచ్చింది. తన వ్యాధి చికిత్స కోసం ప్రస్తుతం సౌత్ కొరియాకు వెళ్లిందని తెలిసింది.

తన ఆరోగ్యం బాలేనందున సినిమాలు విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె గురించి ఈ వార్త వైరల్ గా మారింది. వరుసగా సినిమాలు చేస్తానంటూ సైన్ చేసింది సమంత. అటు బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ లలో చేసే సినిమాలన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయాయి. ఈ కారణంగా ఆమె నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తుంది.

ఖుషి సినిమా ను పూర్తి చేసి కొద్దికాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వని ఉందని తెలుస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వారు ఎక్కువగా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం తాను వరుసగా సైన్ చేసిన మూవీస్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఖుషి షూటింగ్ లాస్ట్ లో ఉంది కాబట్టి ఈ మూవీ ఒకటి పూర్తి చేయనుంది. ఈ నిర్ణయాన్ని టాలీవుడ్ నిర్మాతలు అంగీకరించినప్పటికీ బాలీవుడ్ నిర్మాతలు అంగీకరించట్లేదు.

సమంత తమ సినిమాలు చేయకపోతే తమకు భారీగా నష్టం ఉంటుందని అందువల్ల ఖచ్చితంగా మా సినిమాలు చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారట. ఈ పరిస్థితుల్లో సమంత దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఖుషి మూవీ లో విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్గా నటిస్తున్నారు సమంత. లవ్, యాక్షన్, రొమాంటిక్, ఎంటర్టైనర్ మూవీ గా ఈ మూవీ శివ నిర్మాణ డైరెక్షన్లో రాబోతుంది.

సమంత నటించిన” శకుంతలo” మూవీ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియట్లేదు. ఖుషి సినిమా కూడా సగం మధ్యలోనే ఆగిపోయింది. రీసెంట్గా యశోద మూవీ ఒకటి హిట్ అవ్వడం వల్ల కొంత ఊరట ఇచ్చింది సమంత కు. ఆమె అభిమానులు త్వరగా కోలుకొని సినిమాలు చేయాలనుకుంటున్నారు.