Guppedantha manasu serial today:దేవయానిని రిషి దగ్గర బుక్ చేసిన వసుధార.

Guppedantha manasu సీరియల్ ఈ రోజు కథ:గౌతమ్ తో తన బాధను వ్యక్తపరిచిన రిషి:
ఎదుటి వాళ్ళ పరిస్థితి గురించి తెలియదని గౌతమంటాడు. నా పరిస్థితి ఏంటో నీకే తెలుసు కదా! నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదని అనుకున్నాను, ఆలోచిస్తే ఆ తప్పు నాదే! రెండు అక్షరాల పిలుపు కోసం తపించి పోయాను. ఆ ప్రేమ నాకు దొరకలేదు. ఇప్పుడు ఆ రెండు అక్షరాల పిలుపే కొత్త సమస్య తెచ్చి పెట్టింది. వసుధార అన్ని అర్థం చేసుకుంటుంది. కానీ ఆ పిలుపు విషయంలో మొండిగా ప్రవర్తిస్తుంది.

నాకు నా ప్రేమ అగ్నిపరీక్ష పెట్టినట్లు ఏంటి ఇదంతా? అని చెబుతున్న మాటలన్నీ వసుధార బయట నుంచి వింటూ బాధపడుతుంది. రెండు అక్షరాల పిలుపు వెనుక ఎంత బాధ ఉందో,ఎంత వేదనో, ఎవరికి తెలుసు? ఎవరు అర్థం చేసుకుంటారు? నేను ఒక లూసర్ను. పోగొట్టుకోవడం అనేది నా లైఫ్ లోనే ఉంది. ఎంతగా కోరుకుంటానో, అంతగా పోగొట్టుకుంటాను.

Guppedantha manasu

డాడ్ వెళ్లిపోయాక ఇంకా ఏమి మిగిలింది పోగొట్టుకోవడానికి. వసుధార, తన ప్రేమ. అది కూడా అని అంటుండగానే వసుధార తన నోటికి చెయ్యి అడ్డం పెట్టి ఆపేస్తుంది. రిషి బాధకి ఊరటను ఇవ్వగలదు అనుకొని గౌతమ్ వెళ్ళిపోతాడు.


రిషికి ఓదార్పునిచ్చిన వసుధార:
ఇంకెప్పుడు మీరు అలా అనవద్దు. వసుధార మీ నీడ. ఈ మాట ఎప్పటినుంచో చెబుతున్నాను. మిమ్మల్ని ఎప్పటికీ విడిపోను. రిషిదార బంధం ఎప్పటికీ నిలిచిపోతుంది అని చెబుతుంది ఇంకొకసారి ఇలా మాట్లాడితే వసుధార తుది శ్వాస విడుస్తాను అని చెబుతుంది.

ఇలా మాట్లాడి నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు. అన్ని అర్థం చేసుకుంటావు. ఒక్క పిలుపు విషయంలో ఎందుకు ఇంత పట్టు. డాడ్ మీద ప్రేమతో చాలా మారాను అంటాడు. ఈ పొగరుకు బుద్ధి లేదని అంటుంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. అన్ని సర్దుకుంటాయి, సర్దుకోవాలని ఆశిస్తున్నాను అంటూ రిషిని పడుకోమని చెప్పి, ఆలోచించవద్దు అంటుంది.

వసుధార వెళుతుండగా రిషి పిలిచి ప్రేమ అంటే శాశ్వతం కాదు. అంకితం అని అంటాడు. ఏడుస్తూ బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఇక్కడ మహేంద్ర, జగతి కూడా బాధపడుతూ ఉంటారు. బ్యాక్ గ్రౌండ్లో పాట వేసి అందరూ ఏడుస్తూ బాధపడుతున్నట్లుగా డైరెక్టర్ చూపిస్తాడు


ధరణిపై విడుచుకుపడిన దేవయాని:
ఉదయాన్నే దేవయాని ధరణిని రిషికి కాపీ ఇచ్చావా? అని తను ఎలా ఉన్నాడు? తన మూడు ఎలా ఉందని? అడుగుతుంది. లేదని సమాధానం ఇస్తుంది. నీకు ఏం పని ఉంటుంది. రిషి ని కూడా పట్టించుకోలేవా? జగతి, మహేంద్రా వదిలేసి వెళ్లారు.

ఇప్పుడు రిషి ని పట్టించుకోకుండా నువ్వు ఉన్నావు. అన్ని నేను చెప్పాలా? నీకు అని అరుస్తుంది. నేనేమీ అన్నానని అలా అరుస్తున్నారని ధరణి అంటుంది. నేను అరుస్తున్నది కనిపిస్తుంది, కానీ నా బాధ నీకు కనిపించడం లేదా అని అంటుండగానే రిషి వచ్చి వాటర్ తాగుతాడు. ధరణి రిషి వచ్చాడు అని చెప్పగానే, రిషి వచ్చావా. నీ గురించే మాట్లాడుతున్నాను. జరుగు అని నేను కాఫీ పెడతాను, అంటూ ధరణిని పక్కకు తోస్తుంది.


వసుధార కే ప్రాముఖ్యత ఇస్తున్న రిషి:
దేవయాని కాపీ ఇచ్చి తాగు నాన్న, నీకు ఎవరు ఉన్న, లేకపోయినా ఈ పెద్దమ్మ ఉంది, కదా నేను చూసుకుంటాను అంటుంది.వసు కాఫీ తాగిందా? అని అడుగుతాడు. ధరణి లేదని సమాధానం ఇస్తుంది. తనకు నేనే కాఫీ తీసుకొని వెళ్లి ఇస్తాను అని అంటాడు. నువ్వెందుకు కాఫీ తీసుకొని వెళ్లడం, తనే ఇక్కడికి వచ్చి తాగుతుంది. అని దేవయాని అంటుంది. తను పరాయిది కాదు.

మన ఇంట్లో ఉంటుంది. తనకు నేనే కాపీ తీసుకుని వెళ్లి ఇస్తాను, అంటూ వెళ్ళిపోతాడు. ఏంటో రిషి ఇలా మారిపోయాడు. అసలు వసుధార? పేరు వింటేనే కంపరంగా ఉందని అంటుంది దేవయాని. అత్తయ్య గారు ఎదుటి వాళ్ళ మనకు నచ్చినట్లుగా ఉండాలి అనుకోవడం తప్పు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. ఉండనివ్వండి అని అంటుంది. ధరణి నువ్వు నాకు చెప్పేదానివి అయ్యావా? ఈమధ్య నీకు ధైర్యం ఎక్కువవుతుంది. కొంచెం తగ్గించమని అంటుంది. అత్తయ్య కాఫీ కల్మంటారా అంటుంది. నీ బోడి కాఫీ నాకు వద్దని దేవయాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


జగతి తో మాట్లాడుతున్నట్టుగా ఊహించుకున్న వసుధార:
మేడం నేను చేసేది తప్పు అయితే, నన్ను నిందించండి, అంతేకానీ రిసీ సార్ను నిందించడం ఎంతవరకు కరెక్ట్, అని జగతితో మాట్లాడుతూ, నేనేంటో, నా ఆలోచన ఏంటో మీకు తెలుసు! ఆ రోజు చీర విషయంలో నన్ను కొట్టారు. ఇప్పుడు కూడా కొట్టండి. నేను పంతం మీద ఉన్నాను. నా పంతం, మొండితనం మీకు తెలుసు కదా! ఇదంతా మీకోసమే చేసేది.

మీ బాధ రిషి సార్ బాధ, రెండు న్యాయమే. ఇప్పటికీ నా మాట మీద నేను కట్టుబడి ఉన్నాను. మీరు రిషి సార్ ను బాగా అర్థం చేసుకోండి. ఇలా దూరం వెళ్లడం ఏంటి మేడం. వచ్చేయండి అని అంటూ ఉండగా రిషి వచ్చి వసుదారని పిలవగానే, జగతి మేడంకి మెయిల్ చేసి, అదే ఊహలో ఉండిపోయానని అనుకుంటుంది. ఎవరితో మాట్లాడుతున్నామని రిషి అడుగుతాడు.

ఏమీ లేదు సార్ అని అంటుంది. కప్పు, సాసర్ రెండిట్లో ఏది తీసుకుంటావు? అని అడగగా, మీ ఇష్టం అని అంటుంది. ముందు నిన్ను అడిగాను కదా! చెప్పు అని అంటాడు. వసు సాసర్ తీసుకొని తాగుతున్న, కప్పు తీసుకోవచ్చు కదా! అని అడగగా, సాసర్ కూడా కంఫర్టబుల్ గానే ఉంటుంది. చిన్న చిన్న అలవాట్లు మీకు శాశ్వతం కాకూడదు. సర్దుకుంటాను అంటుంది.

చిన్న చిన్న వాటితో ప్రాబ్లం లేదు. ఆ ఒక్కటి నా ప్రాబ్లం అంటాడు. ప్రాబ్లం లేని వారు ఎవరు ఉండరు అని అంటుంది. నేను మిమ్మల్ని కష్టపెట్టను. ఎందుకంటే మీరు ప్రిన్స్ అంటుంది. నన్ను అంతగా గౌరవిస్తావు. ఆ గౌరవం వెనక ఏముందని అడగగా, టైం వచ్చినప్పుడు చెబుతాను అంటుంది. ఏం చేస్తున్నావు? అని రిషి అడగానే జగతి మేడంకి మెయిల్ పంపిస్తున్నాను అని సమాధానం ఇస్తుంది అఫీషియల్ గానా, పర్సనల్ గానా అంటాడు. బాధ్యత అని సమాధానం ఇస్తుంది. థాంక్స్ ఫర్ కాఫీ అని చెప్పగానే ఇది నా బాధ్యత అంటాడు.


దేవయాని అన్న మాటల గురించి రిషితో చెప్పిన వసుధార:
వసుధార రెడీ అయి కిందికి రాగానే, ఇంట్లో నుండి వెళ్తున్నావా? నీ ఆరోగ్యం జాగ్రత్త ?అని దేవయాని అంటుంది. మనం ఒకటి ఆశిస్తూ, అది జరగాలని కోరుకోవాలి. అంతేగాని అని చెప్పేలోపే ఏంటి నీ ఉద్దేశం. నేను నువ్వు ఇంట్లో నుండి వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను అని అనుకుంటున్నావా అంటుంది.

నిజమేంటో మీకు తెలుసు, నాకు తెలుసు నేను తొందరగా వెళ్ళను, అని చెప్పాను. కదా రిషి సార్ వెళ్ళమంటే వెళ్తాను. అలాగని రిషి సార్ వెళ్ళమన్నప్పుడు నాకు ఉండాలి అనిపిస్తే, ఇంకా కొన్ని రోజులు ఉంటాను అంటుంది. ఈమధ్య అనగానే, కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు మేడం అంటుంది. కోపంతో దేవాయని అరుస్తుంది. అప్పుడే రిషి రూమ్ లో నుండి బయటికి వస్తాడు.

ఏంటి పెద్దమ్మ తనని ఏదో అడుగుతున్నట్లు ఉన్నారు. అని అడుగుతాడు. దేవయనిఅని చెప్పేలోపే, మీరు ఆగండి మేడం. నేను చెబుతాను. అని నేను మీ దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంట, కదా మేడం అంటుంది. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందట .ఇలాగే ఇప్పటికే చూసుకోమని చెప్పారు కదా మేడం అని అనగానే అవును అన్నట్లుగా దేవయాని తల ఊపుతుంది.

ఈ విషయంలో మేడం నన్ను అభినందిస్తున్నారు. అని చెబుతుండగానే, మీరు వచ్చారు. అని అంటుంది. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ 593 గుప్పెడంత మనసు సీరియల్ పూర్తి కథ.