Guppedantha manasu serial ఈ రోజు కథ:దేవయానిని రిషి దగ్గర ఇరికించిన వసుధర:
దేవయాని అన్న మాటలు చెప్పకుండా వసుధార ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, మిమ్మల్ని బాగా చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని, నన్ను అభినందించారు అని వసుధార రిషి తో చెబుతుంది.
మీ ప్రేమ గురించి నాకు తెలుసు. వసుధారకు థాంక్స్ చెప్పడం ఏంటని, వసుధార మన ఫ్యామిలీ మెంబర్ కదా అంటాడు. చెప్పాను కదా మేడం మీరు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పనవసరం లేదు. ఏం చేయాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను అంటుంది. అవును పెద్దమ్మ తను నా జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు జరిగాయి అని చెప్పి వెళ్ళిపోతాడు.
వసుధార దేవయానిని వెళ్ళొస్తాను మేడం, మీ ఆరోగ్యం జాగ్రత్త, మహేంద్ర సార్ వాళ్ళు లేరని మీరు బెంగ పెట్టుకోవద్దని చెప్పి వెళ్తుంది.
తండ్రి కోసం తపిస్తున్న రిషి:
తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటాడురిషి. రిషి అన్న మాటలను గుర్తుకు చేసుకొని తల్లిని, కొడుకుని కలపాలని అనుకుంటే ఇలా జరిగింది. కొడుకు, తండ్రి కి దూరమయ్యాడు, నా మొండితనం వల్ల ఇదంతా జరిగిందని బాధపడుతూ ఉంటుంది.
- Guppedantha manasu serial today:దేవయానికే ఎదురు సమాధానం ఇచ్చిన వసుధార.
- Guppedantha manasu serial today;రిషి ని చూసిన మహేంద్ర జగతి, కావాలనే తన నుంచి తప్పించుకుంటున్నారు అన్న రిషి:
- Guppedantha manasu:ప్రియుడినే చంపబోయిన గుప్పెడంత మనసు సీరియల్ నటి.
- Guppedantha manasu serial today:ప్రేమతో ఒక్కటైపోయినా రిషి, వసుధార..
- Guppedantha manasu serial today:రిషి వసుధార మధ్య చిచ్చు పెట్టబోతున్న దేవయాని..
రిషి ని పిలవగానే అసలు ఏం జరిగి ఉంటుంది? డాడ్ ఇల్లు, నన్ను వదిలి వెళ్లడం ఏంట ఎంత వెతికిన ఎందుకు కనిపించడం లేదు? లోపం ఎక్కడో జరిగింది. ఎప్పటికీ కనిపించరా? నాకు ఎప్పటికీ దూరంగా ఉంటారా? వాళ్ళకి నేను గుర్తుకు రావడం లేదా? వాళ్లకు ఎటువంటి బాధ లేదా? అంటాడు. మీకంటే ఎక్కువ వాళ్ళు బాధపడుతుంటారు. ఎందుకు వెళ్లాలి? ఎందుకు బాధపడాలి. నన్ను ఎందుకు బాధ పెట్టాలి? మీ మేడంకి అన్నీ తెలుసు కదా! నా కోసం ఆలోచించి, వద్దని చెప్పి ఇంటికి తిరిగి తీసుకొని రావచ్చు కదా! అని అంటాడు.
మీ మధ్య ప్రేమ, మంచితనం, త్యాగం పట్టుదల అన్ని ఉన్నాయి అంటుంది. అందుకే ఇంత ఫీలవుతున్నారు అని చెప్పి , రిషి సార్ సమస్యలకు నేనే కారణం కావచ్చు. ఈ సమస్యలను నేనే పరిష్కరిస్తాను. మహేంద్ర సార్ వాళ్ళు లేకపోవడంతో దేవయాని మేడం రిషి సార్ ను మరింత బాధల్లోకి నేడుతుంది, అని మనసులో అనుకుంటుంది. వెళదాం రండి అని చెప్పి, ఎక్కడికి వెళ్తుంది రిషికి చెప్పకుండా తీసుకొని వెళుతుంది.
తను సారీ చెప్పినందుకు వెనక్కి తగ్గవద్దు అని చెప్పిన మహేంద్ర.
జగతి, వసు మెయిల్ చేసినదని చూసుకొని జరిగిన దానికి వసు సారీ చెబుతుంది అంటుంది. జరిగినదానికో, ఇంట్లో నుంచి వెళ్ళిన దానికో, సారి చెప్పి ఉంటుంది. కానీ ఇచ్చిన మాట వెనక్కి తీసుకుందా అని అడుగుతాడు. లేదని చెబుతుంది. సారీ చెప్పిందని మనం వెళ్ళిపోదాము అంటావా? మనం వాళ్లు కలిసి ఉండాలని కోరుకున్నాం. అంతేకానీ సారి కోసం సారీ కోసం ఇంత దూరం రాలేదు కదా! వాళ్ళిద్దరూ ఒక అవగాహనకు వచ్చి, ఒకే మాటపై ఉండాలి.
వాళ్లకి మధ్య మనం అడ్డుగోడగా ఉన్నామని ఇక్కడికి వచ్చాము. సారీ చెప్పిందని వెనక్కి తగ్గొద్దు జగతి అంటాడు. ఇంకా ఇలాగే దూరంగా ఉండి రిషిని బాధను పెంచదామా అంటుంది. బాధ రెండు వైపులా ఉంటుంది. రిషి తెలియకుండా అందర్నీ బాధ పెట్టాడు. కొడుకు మీద ప్రేమతో తిరిగి వెళ్ళిన కరెక్ట్ కాదు అంటాడు. ఇంత మొండితనం వద్దు. ఎంత బాధ పడుతున్నాడో వెళదాం అంటుంది. ని నీడనే ఒప్పుకొని వాడికోసం అల్లాడిపోతున్నావు, దీన్నే తల్లి మనసు అంటారు అని అంటాడు.
నా నీడ సహించని వాడు ఒకప్పటి రిషి. మారిపోయాడు ఇంట్లో ఉండమన్నాడు,రిషి అని పిలవమన్నాడు అంటుంది. రిషి లోని మార్పు శాశ్వతం కావాలి. పూర్తిగా మారేవరకు ఉందాం. వాళ్ళిద్దరూ కలిసేదాకా ఉందామంటాడు. వాళ్ళని కలపాలని అనుకుంటున్నావు, కానీ ఎక్కడ విడిపోతారో అని భయంగా ఉంది అంటుంది. నేను రిషికి తండ్రిని అనగా, నువ్వు తండ్రివైన ఎక్కువ ఆశించకూడదు? వసుతో ఒప్పందం మీద ఉన్నావు.
ఆ ఒప్పందం రిషి నీ బాధ పెడుతుంది. అందుకే మనసును అర్థం చేసుకొని, రిషి దగ్గరికి వెళ్ళిపోదాం అంటుంది. నన్ను బలవంతంగా ఒప్పించకు, కొన్ని గాయాలకు మందు ఆ గాయాన్ని భరించడమే అవుతుంది. వాళ్ళు దగ్గర అవ్వాలి అని కోరుకో, అంతేగాని మనం వెళ్లాలని కోరుకోకు, అలా జరుగుతే మనం వచ్చిన దానికి ఫలితం లేకుండా పోతుంది, మనం వచ్చినందుకు రిషి కంటే నాకు వెయ్యిరెట్ల బాధ ఉంది, కానీ తప్పదు అని చెప్పి వెళ్ళిపోతాడు.
మాటకు మాట సమాధానం ఇచ్చిన ధరణి:
దేవయాని ధరణిని పిలవగానే కాఫీ కావాలా అత్తయ్య అంటుంది. కాఫీ తాగడానికి పుట్టినట్టు అడుగుతావు, ఇలారా అని పిలుస్తుంది. సరదాగా కబుర్లు చెప్పుకుందాం కూర్చో అంటుంది. ధరణి భయంగా చూస్తుంది. కూర్చోమంటే ఎందుకు అంత భయం. కబుర్లు చెప్పుకుందాం అన్నాను, కత్తులతో పొడుచుకుందాం అనలేదు అంటుంది.
మీరంటే నాకు ఎక్కడలేని గౌరవం అంటుంది. గౌరవన్ని తీసుకెళ్లి కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టు, ఏంటో ఈరోజు అత్తయ్య మాటలు మాటలు అర్థం కావడంలేదని మనసులో అనుకుని, గౌరవం అంటున్నాను కదా! అత్తయ్య గారు అంటుంది. సర్లే ఒకసారి నీ ఫోన్ తీసుకొని రా అంటుంది. సరే అని తెచ్చి ఇస్తుంది. ఎవరికి ఫోన్ చేయాలి అనగానే, లాక్ ఓపెన్ చేసి ఇవ్వమంటే అలాగే అని చెప్పి లాక్ ఓపెన్ చేసి ఇస్తుంది.
నాకు జగతి అత్తయ్య వాళ్ళు ఫోన్ చేశారా అని చూస్తున్నారా? అంటుంది. చేయలేదని చెబుతుంది. నేను నమ్మను అంటూ, వెతుకుతుంది. వాళ్లు వెళ్లేటప్పుడు చూసింది మీరే కదా అంటుంది. చూస్తే, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, మొహాలు చూసి అడ్రస్ తెలుసుకోవాల అంటూ, జగతి వచ్చాక నీకు బాగానే ట్రైనింగ్ ఇచ్చిందని అంటుంది. వసుధార దేవయానిని అన్న మాటలు గుర్తుకు చేసుకొని, అత్తయ్య మనం ఎన్నో అనుకుంటాం, అన్ని జరగవు కదా !అంటుంది. దేని గురించి నువ్వు మాట్లాడుతున్నది అని అడుగుతుంది.
ఊరికే అన్నాను, నాకు కిచెన్లో పని ఉంది, నేను వెళ్తున్నాను. చివరికి మూడు రెండులు ఉన్న నెంబర్ తో ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ వస్తే నేను లేనని చెప్పండి అని చెప్పి, దేవయాని పిలిచేలోపే వెళ్ళిపోతుంది. ఎలా కనిపిస్తున్నాను అని కోపంతో చూస్తుంది దేవయాని. మళ్లీ ధరణి వచ్చి అందులో పాము, ముంగిస గేమ్ ఉంటుంది, ఆడుకోండి చాలా బాగుంటుందని చెప్పి వెళ్ళిపోతుంది.
రిషి ని చూస్తూ తపిస్తున్న మహేంద్ర:
మహేంద్ర రిషి ఫోటోలు చూస్తూ, బాధపడుతూ ఉంటాడు. జగతి టిఫిన్ తీసుకుని వచ్చి ఇస్తే, నాకు వద్దు రిషి ని చూస్తుంటే చాలు. ఇంకేమీ వద్దు అంటాడు. కడుపు మార్చుకుంటే బాధ తగ్గుతుందా? అంటుంది. తినాలని లేదు అంటాడు, నువ్వు అనుకున్నట్లే రి షి ఆలోచిస్తే, రిషికి నీ మీద ప్రేమ ఉంది, అలాగని తను కూడా తినకుండా ఉండాలని కోరుకోకూడదు.
నువ్వు తింటే రిషి తింటాడని భావించు. నువ్వు ఆనందంగా ఉంటే, ఇద్దరు త్వరలో కలుస్తారని కోరుకో, నువ్వు ఇక్కడ ఎలా ఉంటే రిషి అక్కడ అలా ఉంటాడని అనుకో అని చెప్పి ,మహేంద్రకు టిఫిన్ తినిపిస్తుంది. రిషి టిఫిన్ తినిపిస్తున్నట్లుగా మహేంద్ర ఊహించుకుంటాడు. మహేంద్ర ఏంటి చూస్తున్నావ్ ?అని జగతి పిలిచి, తిను అని తినిపిస్తుంది. ఏంటి నీకు ఈ బాధ, తీర్పు నీకు నువ్వే ఇచ్చుకొని ,శిక్ష నీకు నువ్వే వేసుకున్నట్లు ఉంది అంటుంది. నేనేమైనా తప్పు చేశానా? జగతి అంటాడు. ఇది ఈరోజు జరిగిన గుప్పెడంతా మనసు ఎపిసోడ్ 594 సీరియల్ పూర్తి కథ.