Balakrishna – Venkatesh: అప్పటి నుంచే ఈ ఇద్దరు మధ్య గట్టి పోటీ ఉందా..?

సినిమా ఇండస్ట్రీలోనే ప్రతి సంవత్సరం అనేక మంది హీరోస్ ,హీరోయిన్స్ మూవీస్ విధలవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎక్కువ మంది స్టార్ హీరోల మూవీస్ ఒకే టైంలో రిలీజ్ కావడం జరుగుతుంది. ఇలాంటి టైం లోనే అభిమానుల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా హీరోల మధ్య చాలా పోటీ ఉంది. ఈ పోటీ ప్రపంచంలో స్టార్ హీరోస్ మూవీస్ ఏ టైం లో రిలీజ్ అయినప్పుడు గట్టి పోటీ జరుగుతుంది. తమ అభిమానం నటులు మూవీ రిలీజ్ అవుతుంది అంటే చాలు ఎంతో హడావిడి చేస్తూ అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య కూడా గట్టి పోటీనే ఉండది. గతంలో బాలకృష్ణ, వెంకటేష్ మూవీ స్ మధ్య కూడా అలాంటి పోటీనే ఉండేది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. 1997 ఆగస్టు 7 లో బాలకృష్ణ “దేశోద్ధారకుడు” మూవీ రిలీజ్ అయింది. ఒక వారం గ్యాప్ లో వెంకటేష్ నటించిన “కలియుగ పాండవులు” మూవీ కూడా రిలీజ్ అయింది.

అప్పటి నుంచే ఈ ఇద్దరు మధ్య గట్టి పోటీ ఉందా?

ఈ మూవీ ద్వారా వెంకటేష్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ రెండు మూవీస్ హిట్ అయ్యాయి. 1987 మే 8 వెంకటేష్ నటించిన” అజయుడు “మూవీ రిలీజ్ అయింది. అదే ఇయర్లో మే 14 బాలకృష్ణ నటించిన “ప్రెసిడెంట్ గారి అబ్బాయి “రిలీజ్ అయింది.

ఈ రెండు సినిమాలు ఒకేసారి ఫ్లాప్ అయ్యాయి. సేమ్ ఇయర్ మే 19 బాలకృష్ణ మూవీ మువ్వగోపాలుడు రిలీజ్ అయింది. హిట్ అందుకుంది. పది రోజుల గ్యాప్లో వెంకటేష్ మూవీ భారతంలో అర్జునుడు రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. 1988 జనవరి 14 వెంకటేష్ మూవీ రక్త తిలకం రిలీజ్ అయింది. పర్వాలేదనిపించింది.

ఒకరోజు గ్యాప్ లో బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ మూవీ రిలీజ్ అయి పర్వాలేదనిపించింది. 1989లో ఒకే కథతో ఇద్దరూ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి అశోక్ చక్రవర్తి, మరొకటి ధ్రువ నక్షత్రం. అప్పట్లో ఒకేరోజు ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలు పలు వివాదాలకు కూడా దారి తీసాయి.

ధ్రువ నక్షత్రం హిట్ అందుకుంది. రీసెంట్గా 2019లో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ రిలీజ్ అయి ప్లాప్ అయ్యింది. సేమ్ టైం లోనే వెంకటేష్ ,వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 మూవీ రిలీజ్ అయ్యి హిట్ అందుకుంది. సేమ్ ఇయర్ డిసెంబర్ 13 వెంకటేష్ నటించిన వెంకీ మామ మూవీ హిట్ కాగా, చెంబరు 20న బాలయ్య నటించిన రూలర్ మూవీ విడుదలై ఫ్లాప్ అయ్యింది. స్టార్ హీరోల మధ్య ఆ కాలం నుంచి ఈ కాలం దాకా గట్టి పోటీ అనేది ఉంది.