Kamal Haasan: ఐదు దశాబ్దాలకు పైగా సినిమాలలో ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించి, అందరినీ మెప్పించిన విలక్షణ నటుడు కమలహాసన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఆరోగ్యం తీవ్ర అస్వస్థతకు గురికావడం వలన చెన్నైలోని కోరూర్ రామచంద్ర హాస్పిటల్ కు తరలించారు.
శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో పోరూరు రామచంద్ర హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. పోస్ట్ కోవిడ్ అయి ఉండవచ్చని, అందువలన శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యినా కారణంగా సోషల్ మీడియాలో కమలహాసన్ గారికి ఏమైంది అనే విషయం చర్చనీయాంశమైంది. అయితే ఇంతవరకు ఆయనకేమైంది అన్న విషయం బయటకి రాలేదు.
కొద్దిరోజుల క్రితం ఆయన తన స్నేహితులు, బంధువులు, సినీ ఇండస్ట్రీ వారితో కలిసి తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంతేకాకుండా బుధవారం రోజున హైదరాబాద్ వచ్చి కళా తపస్వి అయినా కే. విశ్వనాథ్ గారిని కలిసి, వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు.
కమలహాసన్ కె విశ్వనాథ్ గారిని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కే విశ్వనాధ్ గారు కమలహాసన్ కలిసి నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కమలహాసన్, కె. విశ్వనాథ్ గారిని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతలోనే ఈయనకు ఆరోగ్యం బాగాలేదని, హాస్పిటల్కు తీసుకొని వెళ్లారని వార్త వచ్చింది.
ఇప్పుడు ఈ వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కమలహాసన్ కు ఆరోగ్యం బాగాలేదని తెలిసిన అభిమానులు, లోక నాయకుడికి ఏమైంది? అని టెన్షన్ పడుతున్నారు. కొద్దిరోజుల క్రితమే కృష్ణ గారు మరణించిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీ ఆ బాధ నుంచి కోలుకొక ముందే, కమల్ హాసన్ కు బాగాలేక పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లో ఆయన నటించిన సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ హిట్గాయో అందరికీ తెలుసు. ఆ తరం వారికి పోటీగాక, ఈ కాక ఈ తరం వారికి కూడా పోటీగా సినిమాలలో నటిస్తూ ఎన్నో విజయాలను అందుకుంటున్నాడు.
ఆయన నటుడిగా కాక నిర్మాతగా, దర్శకుడుగా ఎన్నో సినిమాలను చిత్రీకరించి, ఎంతో పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తమిళ్ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా పని చేస్తున్నారు. అంతేకాకుండా శంకర్ తో కలిసి భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్నాడు.
2021లో విక్రమ్ సినిమాతో భారీ హీట్ కొట్టాడు. అయితే ఆ సినిమా కంటే ముందే కరోనా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆ సినిమాను తీశారు. ఇప్పుడు భారతీయుడు 2 సినిమా షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉండేవారు, ఇంతలో ఆయనకు ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ కి వెళ్లడం అనేది చాలా బాధాకరం.
అయితే మణిరత్నం దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నాడు అనే సంగతి తెలిసిందే! ఆయనకిద్దరు కూతుళ్లు శృతిహాసన్, అక్షరహాసన్. అయితే వీరు వారసత్వంగా సినిమాలలో నటిస్తూ, తనకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు.కమలహాసన్ “కళ్ళత్తూర్ కన్నమ్మ” అనే సినిమాలో బాలనటుడిగా నటనను ప్రారంభించాడు.
అతిలోకసుందరి శ్రీదేవితో కలిసి పదహారేళ్ళ వయసు సినిమాల్లో కూడా నటించాడు. 23 ఏళ్ల వయసులోనే యువ కథనాయకుడుగా మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి దాదాపుగా 23 సినిమాలలో నటించారు. మరోచరిత్ర, ఆకలి రాజ్యం, ఎర్ర గులాబీలు, కళ్యాణ రాముడు, సాగర సంగమం, స్వాతిముత్యం వంటి ఎన్నో హిట్ సినిమాలలో నటించాడు.
ఒక వ్యక్తి పది అవతారాలుగా మారి, దశావతారం అనే సినిమాలో నటించి మెప్పించాడు. ఈయన నటుడు నిర్మాత, దర్శకుడు, గాయకుడు, నృత్య దర్శకుడు, కథా రచయిత, మాటల రచయిత, కూడా. ఈయన పద్మభూషణ్, పద్మశ్రీ వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు.