Krithi Shetty: తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అతి తక్కువ సినిమాలతోనే ఫేమస్ అయ్యి స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో కృతీ శెట్టి ఒకరు. ఉప్పెన మూవీతో ఇండస్ట్రీకి వచ్చి ఈ మూవీ ద్వారా సక్సెస్ అందుకుని ఓవర్ నైట్ లోనే ఫేమస్ అయ్యింది. తనదైన అందంతో, తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.
ఉప్పెన తర్వాత తీసిన రెండు మూవీస్ కూడా హిట్ అవడంతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని సక్సెస్ సాధించింది. వరుస అవకాశాలతో ప్రస్తుతం బిజీగా ఉంది. ఇటీవలే విజయ్ దేవరకొండ, సమంత చేస్తున్న సినిమాలో నటించే అవకాశం కూడా సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న తర్వాత నెక్స్ట్ చేసిన సినిమాలు అంతగా విజయవంతం కాకపోయినా వరుసగా అవకాశాలు రావడం మాత్రం తగ్గడం లేదు. తెలుగు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది.
” ది వారియర్”మూవీ ద్వారా మొదటి ఫ్లాప్ అందుకుంది. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి…అనే మూవీస్ వరుసగా కొన్ని రోజుల గ్యాప్ లో విడుదలైన సరే మూడు ఫ్లాప్ అయ్యాయి.
వరుస హిట్ లు అందుకని, తర్వాత వరుసగా ఫ్లాపులు అందుకున్న కృతి శెట్టి కి సినిమా చాన్సులు మాత్రం ఎక్కువగానే వస్తున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ, సమంత చేస్తున్న మూవీ లో నటించనుందని సమాచారం. ఇటీవల విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు.
విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో వస్తున్న” ఖుషి” మూవీ కీ డైరెక్టర్ శివ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో సమంత హీరోయిన్గా నటిస్తోంది. విజయ్, సమంత గతంలో మహానటి మూవీలో కలిసి పనిచేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాలో విజయ్ పక్కన ఒక ముఖ్యమైన పాత్రలో కృతి శెట్టి నటించనుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో కృతి శెట్టి నెగటివ్ షేడ్స్ ఉన్నా పాత్రలో నటించనుంది. విజయ్ ఈ సినిమా కంటే ముందే జనగణమన మూవీ చేయాల్సి ఉండగా లైగర్ మూవీ ద్వారా వచ్చిన రిజల్ట్స్ ఈ సినిమా పై చల్లాయి. ఇక కృతి శెట్టి విషయానికొస్తే వెంకట ప్రభు డైరెక్షన్లో హీరో నాగచైతన్య పక్కన బై లింగ్వల్ మూవీలో నటిస్తుంది. మరి ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది కృతి.
ఈ సినిమా కూడా ఫట్ అయితే ఇంకా అంతే సంగతులు. ఉప్పెన, శ్యాంసింగారాయ్, బంగారు రాజు మూవీస్ ద్వారా వరుస హిట్ అందుకుంది. హ్యాట్రిక్ హిట్ అందుకుంది. వీటి తర్వాత తీసిన మూవీస్ అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి.