Nayanthara: తనకు ఇష్టం లేదు అంటున్న నయనతార-కానీ ఆ సినిమాలకు మాత్రం..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ లో నయనతార కూడా ఒకరు. చాలా రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉంటూ, తెలుగులో చాలా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు నయనతార. ఎన్నో సినిమాల్లో బెస్ట్ యాక్టింగ్ అందించారు.

ఎంతోమందిని తన నటనతో ఎంటర్టైన్ చేశారు. నయనతార ఈ ఇయర్లో విఘ్నేశ శివన్ అనే వ్యక్తితో వివాహం చేసుకున్నారు. రీసెంట్గా సరోగసి ద్వారా కవల పిల్లలు కు నయనతార జన్మనిచ్చింది అంటూ ఈ వార్త సోషల్ మీడియా నే షేక్ చేసింది. మరి దీనిపై కొన్ని వివాదాలు తలెత్తాయి.

శ్రీరామరాజ్యం అనే మూవీ సెలబ్రేషన్స్ లో తప్ప ఇక ఏ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ఈవెంట్స్ లో ఆమె కనిపించలేదు. ఇది కూడా చివరి సినిమాగా అనుకుని ఈ వేడుకకు హాజరైంది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆ ప్రమోషన్స్లో ఆమె పాల్గొనలేదు. తమిళంలో కూడా చాలా సినిమాలకి ప్రమోషన్స్ చేసే విషయంలో ఆమె దూరంగానే ఉంటారు.

తనకు ఇష్టం లేదు అంటున్న నయనతార-కానీ ఆ సినిమాలకు మాత్రం..?

ఏదో ఒక వార్తతో ఇప్పుడు సోషల్ మీడియాలో నిలుస్తుంది నయనతార. సోషల్ మీడియాలో కూడా బాగానే ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నటించడం వరకే నా పని అంటూ, ప్రమోషన్స్ కి రానని ముందే చెప్పేస్తాను అని ఆమె చెప్పడం జరిగింది. అలాగని ఆమె ఏ సినిమాను ప్రమోట్ చేయదా అంటే చేస్తుంది.

ఆమె భర్త విగ్నేష్ శివన్ డైరెక్షన్స్, ప్రొడక్షన్లో లో వచ్చే మూవీస్ కి, కొన్ని లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి ప్రమోషన్స్ చేస్తూ ఉంటుంది నయనతార. రీసెంట్ గా నయనతార తన భర్త విగ్నేష్ ప్రొడక్షన్ లో వచ్చిన “కనెక్ట్” మూవీనీ అటు తమిళంలో, తెలుగులో కూడా ప్రమోట్ చేశారు. యాంకర్ సుమతో నయనతార రీసెంట్ గా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసింది.

ఈ ఇంటర్వ్యూలో తాను ప్రమోషన్స్ చేయని విషయానికి సంబంధించిన ప్రశ్నలను అడిగించుకుంది నయన్. సుమ నయనతారని ఎందుకు మీరు సినిమా వేడుకల్లో, ఇంటర్వ్యూసుల్లో పార్టిసిపేట్ చేయరు అంటే ఆమె ఎప్పటి నుంచి సుమతోనే ఇంటర్వ్యూ చేయాలని చూస్తున్నారని కానీ ఆమె బిజీగా ఉండడంతో వేరే వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేయడం ఇష్టం లేక ఇప్పటివరకు ఏంటి అవి చేయలేదని నవ్వుతూ చెప్పేసింది నయనతార.

రీసెంట్ గా ఆమె గాడ్ ఫాదర్ మూవీ లో నటించింది. హరి ఈ మూవీకి సంబంధించిన సక్సెస్ మీట్ లో కూడా ఎందుకు మీరు కనిపించలేదు అని అడిగితే అప్పుడు ఆమె ఫారెన్ లో ఉన్నట్టు చెప్పింది. దీన్ని చూస్తే నయనతార కవరింగ్ చేస్తుంది అని బాగా అర్థమవుతుంది. నిజానికి నయనతార ఒప్పుకొని ఉంటే ఎప్పుడో సుమాతో ఇంటర్వ్యూ చేయించే వాళ్ళు మన నిర్మాతలు.

ఇది పక్కన పెడితే ఆమె ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఎన్నో ఈవెంట్స్ జరిగినాయి. కానీ వాటికి కూడా హాజరు కాలేదు. ఈ ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఏం చెప్పేవారో మరి.