Ram Charan:రామ్ చరణ్ గురించి అందరికీ తెలుసు. మెగాస్టార్ తనయుడు. వారసత్వంగా సినిమాలోకి ఎంటర్ అయ్యాడు. రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే RRR సినిమా ద్వారా పాన్ ఇండియా హీరో రేంజ్ ను దక్కించుకున్నాడు.
రామ్ చరణ్ ఢిల్లీలో జరిగిన హిందూస్థాన్ టైం లీడర్షిప్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. అక్కడ స్టేజ్ పై మాట్లాడిన రాంచరణ్ తన గురించి కొన్ని విషయాలను బయటపెట్టాడు. అక్కడ ప్రేక్షకులు RRR సినిమాలో తన ఎంట్రీ సీన్ గురించి అడిగారు?
అప్పుడు రాంచరణ్ గురించి చెబుతూ ఆ సీన్ చేయడానికి 30 రోజులు పట్టిందని చెప్పాడు. వీరు చాలా టైం టాలెంటెడ్ కదా ఇంత టైం ఎందుకు తీసుకున్నారని అడిగారు అప్పుడు రామ్ చరణ్ తనకున్న జబ్బు గురించి బయట పెట్టాడు. తనకు సైనస్ అనే జబ్బు ఉంది.
దాంతో డస్ట్ ఎలర్జీ వస్తుందని, RRR సినిమాలో ఎంట్రీ సీన్ కోసం తనను 3,000 మంది మధ్యలో ఉంచారు. అని దాంతో ఆ జనాల మధ్య, డస్ట్ లో చేయడానికి చాలా ఇబ్బంది అయ్యిందని, చాలా కష్టపడి తీసినట్లుగా చెప్పాడు. ఆ సీన్ చేసిన తర్వాత తనకు ప్రాబ్లమ్స్ వచ్చాయి, హెల్త్ కండిషన్ బాగా లేక ఇబ్బంది అయిందని, అందుకని ఇంత కష్టపడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.
అయితే సినిమాలో చూశాక ,అభిమానులు ఆ సీన్ గురించి చెప్పాక, నా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని సంతోషపడ్డాను అంటూ, తన మనసులోని మాటలను బయటపేడ్డాడు. అయితే రామ్ చరణ్ కు సైనస్ వ్యాధి ఉన్నట్లు చాలామందికి తెలియదు.
ఈ సైనస్ అనేది ఒక రకమైన ఇన్ఫెక్షన్ వంటిది ఎక్కువ తలనొప్పి ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉండటం వంటివి లక్షణాలుగా ఉంటాయి. ఈ వ్యాధి మానవ శరీరంలో ముక్కుకు సంబంధించినది. దీని వల్ల ఎలర్జీలు జలుబు, బ్యాక్టీరియా ,ఇన్ఫెక్షన్ల వ్యాధి అధికమవుతుంది.
ఇది ఇలా ఉంటే చిరంజీవి రామ్ చరణ్ పెళ్లి గురించి చేసిన కొన్ని మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. చరణ్ ఉపాసన కామినేని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతానికి వీరికి పెళ్ళే పదేళ్లు పూర్తికా వస్తున్నాయి. ఇంతవరకు వీరికి పిల్లలు పుట్టలేదు. ఈ విషయం అందరికీ అనుమానాలు వస్తున్నాయి.
అయితే వాళ్లు మాత్రం ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నాం అని చెప్పే మాట దాటేస్తున్నారు. కానీ వీరికి పిల్లలు పుట్టలేదని మెగాస్టార్ కి ఆందోళన పెరిగింది. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా కొంతవరకు ఆందోళన చెందుతున్నారు. అయితే వీరు పెళ్లిలో జరిగిన కొన్ని తప్పుల వలన వారికి పిల్లలు పుట్టలేదని, మనవడు, మనవరాళ్లతో సంతోషంగా ఉండటానికి నోసుకోలేదని మెగాస్టార్ అన్నారు.
అసలు పెళ్లిలో జరిగిన ఆ తప్పేంటోతెలుసుకుందాం:
రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి తర్వాత మెగాస్టార్ స్వామివారికి కళ్యాణం జరిపిస్తామని మొక్కుకున్నారట, ఆ మొక్కుని ఇంతవరకు తీర్చలేదట మెగాస్టార్. అంతేకాక పెళ్లిలో ఆచారం ప్రకారం, పెళ్ళికి ముందు పెళ్లికూతురు చేయాల్సిన పూజలు, ఉపాసన వాళ్ళ ఇంటి సంప్రదాయం ప్రకారం చేశారని, అంతేకాకుండా పెళ్లి కూడా కామినేని వాళ్ళ ఆచారం ప్రకారమే జరిగిందని, కొనిదెల వారి ఆచారం ప్రకారం జరగలేదని, అందువల్లనే వీరికి పిల్లలు పుట్టలేదని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా ముద్దుల కొడుకు పెళ్లి, కొనిదెల వారి ఆచారం ప్రకారం చేయలేకపోయానని చెబుతూ బాధపడ్డాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా రాంచరణ్ ఉపాసనకు తిరిగి మళ్లీ గుళ్లో కొనిదెల వారి ఆచారం ప్రకారం పెళ్లి జరిపించబోతున్నట్లు తెలిపాడు.
దీంతో ఈ మాటలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ బాధను చూసిన తన అభిమానులు ఎంతో బాధపడుతున్నారు. అంతేకాక త్వరగా గుడ్ న్యూస్ చెప్పమని చరణ్ దంపతులను కోరుకుంటున్నారు. కొంతమంది ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కొందరైతే తొందరగా గుడ్ న్యూస్ చెప్పండి స్వామి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.