బుల్లితెర ప్రోగ్రామ్స్లో బాగా పాపులర్ అయిన షో, అతి తక్కువ కాలంలోనే మంచి రేటింగ్ సంపాదించుకున్న షో జబర్దస్త్. ఈ షో ఇంత మంచి రేటింగ్ సంపాదించుకోవడానికి కారణం ఆ షో లోని కమెడియన్స్. ఇప్పుడు ఆ కమెడియన్స్ టీం లీడర్స్ గా ఎదిగి ప్రస్తుతం సినిమాల్లో ఛాన్సులు కూడా సంపాదించుకుంటున్నారు. ఈ కామెడీ షో వల్ల ఎంతోమంది కమీడియన్స్ కి ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
సినిమాల్లో కూడా నటిస్తున్నారు కొందరు కమెడియన్స్. ఆ కమెడియన్స్లో ఒకడైన సుడిగాలి సుదీర్ విషయానికొస్తే జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొని, జీవితంలో బాగా స్థిరపడ్డాడు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సినిమాల్లో కూడా ఛాన్సులు రావడంతో సినిమాలు తీస్తున్నాడు. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ నటించిన మూవీ గాలోడు. ఈ మూవీ నవంబర్ 18వ తేదీన విడుదలైంది.
ఇప్పటివరకు సుదీర్ నటించిన సినిమాల్లో కెల్లా భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఎలాంటి రివ్యూస్ వచ్చాయో తెలుసుకుందాం.
ఈ మూవీలో గెహ్న సిప్పి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ మూవీ రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల డైరెక్షన్లో రాబోతుంది.
నిర్మాత కూడా ఈయనే.ఈ మూవీని ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలిమ్స్ నిర్మిస్తుంది.2.50 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన మూవీ ఇది. ఈ సినిమా చేయడానికి సుడిగాలి సుదీర్ 40 నుంచి 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని సమాచారం. ఈమూవీకి బీమ్స్ సిసి రోలియో సంగీతం అందించారు. మరి ఈ సినిమా రివ్యూ విషయానికొస్తే ఎలా ఉందో తెలుసుకుందాం.
కథ గురించి తెలుసుకుందాం-
ఈ మూవీ టైటిల్ లోనే ఆ హీరో క్యారెక్టర్ గురించి చెప్పేశాడు డైరెక్టర్. ఊర్లో పని పాట లేకుండా తిరిగే ఓ వ్యక్తి అతని చేతిలో అనుకోకుండా ఆ ఊరి సర్పంచి కొడుకు చనిపోవడం, ఈ విషయం జరగడంతో భయంతో ఆ ఊరు వదిలి హైదరాబాద్ కి రావడం, అక్కడ హీరోయిన్ పరిచయం కావడం, పరిచయం ప్రేమగా మారడం, వీళ్ళిద్దరి పెళ్లికి హీరోయిన్ తండ్రి అడ్డు చెప్పడం. ఇక హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడా? మర్డర్ విషయం ఏమైంది అనేది చెప్పడమే ఈ సినిమా కథ.
మరి టైటిల్ తోనే హీరో క్యారెక్టర్ గురించి చెప్పేసిన డైరెక్టర్. పని పాట లేకుండా తిరిగే ఓ క్యారెక్టర్ గురించి రెగ్యులర్ స్టోరీ నే తీసుకొని మూవీ తీయడం చేశాడు. సుధీర్ క్యారెక్టర్ వరకు బాగానే ఉంది. మిగతా వాళ్ల క్యారెక్టర్స్ కొంతవరకు డల్ అయ్యాయి. రొటీన్ స్టోరీ తోనే ముందుకు వచ్చినా కూడా దాన్ని డిఫరెంట్ గా తీయలేకపోయాడు డైరెక్టర్. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఆధారంగా ఎక్కడ నేరం జరిగిన వెంటనే నేరస్తులను పట్టుకుంటున్నారు పోలీసులు.
అలాంటిది ఊర్లో హత్య కేసులో ఉన్న సుధీర్ ని అంత ఈజీగా వదిలి పెడతారా పోలీసులు అనే డౌట్ వచ్చింది. సినిమాలో కొన్ని ఎలివేషన్ సీన్స్ ఎందుకు వస్తున్నాయి కూడా అర్థం కాలేదు. ఈ సినిమాలో ఎడిటర్ కి బాగానే పని పెట్టాల్సిన పని ఉన్నా కూడా ఎందుకో మర్చిపోయినట్లు అనిపించింది . రొటీన్ స్టోరీ తో వచ్చిన అభిమానులు కొత్తదనం కోరుకుంటున్నారు కదా.
ఇక మూవీలో సుధీర్ పర్ఫామెన్స్ విషయానికి వస్తే నటన, డాన్స్, ఫైట్స్ తో ఇరగదీసాడు. కామెడీ విషయమైతే చెప్పాల్సిన పనిలేదు. నేను కూడా తనకున్నంతలో బాగానే ఆకట్టుకుంది. సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరింది. మిగతా నటీనటులు పరవాలేదనిపించుకున్నారు.
సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు సుధీర్. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సుడిగాలి సుదీర్ కామెడీ, నటన డాన్స్. మైనస్ ల విషయానికి వస్తే రొటీన్ కథ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే లో లోపాలున్నాయి. ఇక టోటల్గా మూవీ రివ్యూ విషయానికొస్తే సుడిగాలి సుదీర్ వన్ మ్యాన్ షో.