Richa Pallod:నువ్వే కావాలి సినిమా హీరోయిన్ గుర్తుందా?

Richa Pallod: హీరోయిన్ రిచా పల్లొడ్ టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. అయితే రీఛార్జ్ పల్లోడ్ అంటే ఎవరు అని కచ్చితంగా అడుగుతారు. అలా చెప్పడం కంటే, నువ్వే కావాలి సినిమా హీరోయిన్ అంటే యూత్ మొత్తం ఇట్టే గుర్తు పడతారు. విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్, రీచా కలిసి నటించిన సినిమా, నువ్వే కావాలి.

ఈ సినిమా 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిందో! ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకుల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా వచ్చి 22 ఏళ్ళు పూర్తి అవుతున్న, ఇప్పటివరకు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాకు ఎంతో మంది వీర అభిమానులు కూడా ఉన్నారు.

Richa Pallod:నువ్వే కావాలి సినిమా హీరోయిన్ గుర్తుందా?

అయితే నువ్వే కావాలి సినిమాలో పక్కింటి అమ్మాయిగా నటించి, కేవలం ఒక్క సినిమాతోనే ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది రిచా. టాలీవుడ్లో తన పేరుకు మంచి గుర్తింపును తెచ్చుకుంది. రిచా ఆ తర్వాత చేసిన సినిమాల ద్వారా గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత 2011లో హిమన్షు బజాజ్ అనే పెద్ద వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటూ, తన జీవితాన్ని గడుపుతూ ఉండేది.

వీరికి ఒక బాబు ఉన్నాడు.పెళ్లి అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి ఆది పినిశెట్టి నటించిన మలుపు సినిమాలో నటించింది. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు ఏ సినిమాలలో నటించలేదు. ప్రస్తుతం భర్తకు సాయంగా ఉంటు, వ్యాపార బాధ్యతలను చూసుకుంటూ, బిజీగా ఉంటుంది.

సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగా ఉంటూ, ఎప్పుడూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె 16 సంవత్సరాల వయసులోనే మోడలింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అనేక వాణిజ్య ప్రకటనలో కూడా నటించింది. మొత్తం 25 సినిమాలలో నటించింది. అలాగే రెండు టీవీ సీరియల్స్ లో, వెబ్ సిరీస్ లో కూడా నటించింది.