ప్రపంచంలోనే అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మూవీ అవతార్. ఈ మూవీకి సంబంధించిన సీక్వెల్ అవతార్ 2 ద వే ఆఫ్ వాటర్ రాబోతుంది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ జేమ్స్ కామెరున్ డైరెక్షన్లో రాబోతుంది.
డైరెక్టర్ ప్రేక్షకులని ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాడు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది మూవీ. అలాంటి మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. మరి ఈ సినిమాను డైరెక్టర్ 60 భాషల్లో రిలీజ్ చేయనున్నాడు.
ఇండియాలో కూడా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఇక తెలుగు లో ఈ మూవీ విషయానికొస్తే దాదాపు 100 కోట్లు వరకు బిజినెస్ చేసే అవకాశం కూడా ఉంది. మరి ఈ తెలుగు వర్షన్ లో వచ్చే అవతార్ 2 మూవీకి సంబంధించిన డైలాగ్స్ రాసే అవకాశం టాలీవుడ్ రచయిత డైరెక్టర్ కం హీరో అయినా శ్రీనివాస్ అవసరాలకు వచ్చింది.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీనివాస్ అవసరాల ఒక రచయితగా, డైరెక్టర్ గా, హీరోగా కూడా తెలుసు. హీరోగా కూడా బాగానే నటించాడు అవసరాల. ఊహలు గుసగుసలాడే అనే మూవీ ద్వారా ఆయన రచన శైలీ, డైరెక్షన్లో ఉన్న ప్రతిభ అందరికీ అర్థమైంది.
మరి అవతార్ 2 కుతెలుగు వర్షన్ కి డైలాగ్ రాసే అవకాశం అవసరాలకు ఎలా వచ్చింది అనే టాపిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు ఈ మూవీ ని 160 సినిమాలో రిలీజ్ చేయనున్నారు. ఈ టైంలోనే చిత్ర నిర్మాణ సంస్థ డబ్బింగ్ వర్షన్ కి సంబంధించిన పనులు చూసుకోవడానికి ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసింది.
డిస్ట్రిబ్యూటర్స్ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారికి సంబంధించిన బయోడేటా ని అవతార్ టీం కి పంపించాల్సి ఉంటుంది. వీరిని అవతార్ టీం ఇంటర్వ్యూ చేసి ఫైనల్ వాళ్లను సెలెక్ట్ చేశారు. డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టులను కూడా వాళ్లే ఫిక్స్ చేస్తారు.మరి శ్రీనివాస్ అవసరాలకు కూడా ఆన్లైన్లో వారితో ఇంటర్వ్యూలో పాల్గొని సెలెక్ట్ అయినట్లు తెలిసింది. శ్రీనివాసరాలకు అమెరికాలో పనిచేసిన అనుభవం కూడా ఉంది.
అలాగే హాలీవుడ్ మూవీస్ గురించి కూడా బాగానే తెలుసు. తెలుగులో కూడా బాగా ఫేమస్ అయిన రచయితల్లో ఒకడు. కాబట్టి ఇతన్ని మూవీకి డైలాగ్స్ రాయడానికి సెలెక్ట్ చేసినట్లుగా తెలిసింది. ఈయన రాసిన డైలాగ్స్ ఎక్కువగా కామెడీ వర్షన్లో ఉన్న డైలాగ్స్ ఉంటాయి. కానీ ఇలాంటి అడ్వెంచర్ మూవీకి డైలాగ్స్ రాసిన ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.