Superstar Krishna Health Bulletin: వైద్యానికి సహకరించని సూపర్ స్టార్ కృష్ణ శరీరం

Superstar Krsihna: స్టార్ హీరో మహేష్ బాబు తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐదు దశాబ్దాలుగా అందరికి సుపరిచితుడు. అయితే కృష్ణ గారు అనారోగ్యం కారణంగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. అసలు కారణం ఏమిటంటే? కృష్ణ గారు కొంతకాలం నుండి శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.

ఆ సమస్య ఈ రోజున ఎక్కువగానే ఆయన్ని వెంటనే హాస్పిటల్కు తీసుకొని వెళ్లారు. వైద్యులు ఆయనకు మెరుగైన వైద్యం చేయిస్తున్నారు, అయితే ఇంతవరకు ఆయన ఎలా ఉన్నాడనే విషయం మాత్రం బయటకు రాలేదు. కొన్ని రోజుల క్రితం ఆయన భార్య ఇందిరా దేవి మరణించిన విషయం అందరికీ తెలిసిందే.

వైద్యానికి సహకరించని కృష్ణ శరీరం:

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 24 గంటలు గడిస్తే కానీ ఒక అంచనాకు రాలేమన్నారు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామన్నారు. అతని శరీరం సహకరించేదానిని బట్టి చికిత్స కొనసాగిస్తామని వైద్యులు తెలిపారు. ఆయన శరీరం చికిత్సకు పూర్తి స్థాయిలో స్పందించడం లేదని తెలుస్తోంది. అతని పరిస్థితి మాత్రం అత్యంత విషమమని వైద్యులు స్పష్టం చేశారు.

అప్పుడు ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ బాధతోనే కృష్ణ గారు ఆరోగ్యం మరింత అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పటివరకు కృష్ణ గారి వయసు 80 సంవత్సరాలు, అయితే ఆయన ఆరోగ్యం పై మరిన్ని వివరాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే!

Superstar Krihna

సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు ఉండరు. అప్పట్లో ఎంతో ఫేమస్ అయిన హీరో. ఈయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. అయితే కృష్ణగా పిలుస్తారు. నటుడే కాక దర్శకుడు, నిర్మాత కూడా. సినిమాలలో ఈయనకు ఐదు దశాబ్దాలుగా అనుభవం ఉంది. 350 సినిమాలకు పైగా నటించారు.

2008 ఆంధ్ర యూనివర్సిటీ నుండి డాక్టర్రేట్ పొందాడు. 1989లో కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. కృష్ణ గారి సొంత ఊరు బుర్రిపాలెం. మే 31- 1942లో జన్మించాడు. ఎన్నో అవార్డులను అందుకున్నాడు. అంతేకాక సూపర్ స్టార్, నటశేఖరుడు అనే బిరుదులను కూడా పొందాడు.

1961 లో వచ్చిన కుల గోత్రాలు అనే సినిమాలో మొదటిగా నటించాడు. ఆ తర్వాత పదండి ముందుకు, పరువు ప్రతిష్ట సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టికల్ ఆర్టిస్ట్ గా పని చేశాడు. 1965 లో వచ్చిన తేనెమనసులు సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల లో నటించాడు.

అప్పట్లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవారు కృష్ణ. ఎంతోమంది హీరోలతో ,హీరోయిన్లతో కలిసిన నటించాడు. ఎంతో మంది పెద్ద దర్శకులతో పనిచేశాడు. విజయనిర్మలతో కలిసి 48 చిత్రాలలో నటించాడు. జయప్రద తో 47 చిత్రాలలో నటించాడు. ఓకే హీరోయిన్తో ఎక్కువ సినిమాలు చేసిన ఘనత ఈయనకే దక్కింది.

వ్యక్తిగతం:

కృష్ణ గారు మొదట ఇందిరా దేవి గారిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 1967లో సాక్షి సెట్స్ లో కృష్ణగారు, విజయనిర్మలను కలిశారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. మొదటి భార్య అయిన ఇందిరా దేవి గారిని ఒప్పించి, విజయ నిర్మల గారిని రెండో వివాహం చేసుకున్నాడు.

అయితే విజయనిర్మల గారికి కూడా ఇది రెండో వివాహం. ఆమెకు కృష్ణమూర్తి అనే నటుడితో మొదట వివాహం అయ్యింది. వీరిరువురికి ఒక కొడుకు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు ప్రస్తుతం నటులలో సీనియర్ నటుడు నరేష్. ఇలా చెప్పడం కంటే పవిత్ర లోకేష్, నరేష్ అంటే చాలా బాగా గుర్తుపడతారు. ఆయనే విజయనిర్మల గారు కొడుకు.

Superstar Krishna and Son Mahesh Babu

అప్పటికే కృష్ణ గారికి, ఇందిరా దేవి గారికి పిల్లలు ఉన్నారు. వారికి ఐదుగురు.( రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని). అయితే కృష్ణ గారు పెద్ద కుమారుడైన రమేష్ బాబు 2022 జనవరి 8వ తేదీన కాలేయ వ్యాధితో మరణించాడు. అంతేకాకుండా రెండో భార్య అయిన విజయనిర్మల గారు 73 సంవత్సరాల వయసులో 2019 లో గుండెపోటుతో మరణించింది.