తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ పైరసీ సినిమాలకు ఇది ఒక కేంద్ర బిందువు. గత కొన్నేళ్లుగా తమిళ,కన్నడ,మలయాళ,హిందీ,తెలుగు,ఇంగ్లీష్ భాషలోనే కాకుండా ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో విడుదలైన సినిమాలు పైరేటెడ్ వెర్షన్ అన్నిటిని ఈ తమిళ్ రాకర్స్ తమ సైట్ లో అప్లోడ్ చేస్తూ వచ్చింది.
ఈ వెబ్ సైట్ వల్ల కోలీవుడ్ ఇండస్ట్రీకి భారీగా నష్టాలు వచ్చాయి. అన్నింటిని చవి చూసిందని కూడా చెప్పాలి. ఎంతోమంది సాంకేతిక నిపుణుల శ్రమను నిర్మాతల డబ్బుతో చెలగాటం ఆడుతున్న ఈ వెబ్ సైట్ పూర్తిగా మూసి వేయబడినట్లు సమాచారం అందుతుంది. సాధారణంగా ఈ వెబ్ సైట్ ద్వారా చాలామందికి చాలా నష్టం వచ్చిందని తెలియజేశారు.
ఇందుకు గల కారణం తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ అని చెప్పవచ్చు.డిజిటల్ మిలినియం కాపీరైట్ చట్టం ప్రకారం తాజాగా అమెజాన్ ఇంటర్నేషనల్ తమిళ్ రాకర్స్ కు వ్యతిరేకంగా పలు కంప్లైంట్స్ దాఖలు చేసింది. దీంతో ఇంటర్నెట్ కార్పొరేషన్ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్(ICANN) రిజిస్ట్రీ ద్వారా ఆ సైట్‌ను తొలగించారట.
అంతేకాదు నిన్నటి నుంచి ట్విట్టర్లో తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ కూడా షట్ డౌన్ చేసినట్లు సమాచారం అందింది. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం త్వరలోనే మళ్లీ కొత్త సైట్ డొమైన్ ద్వారా అందుబాటులోకి వస్తుందని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.ఇలా తమిళ్ రాకర్స్ చేసిన పనికి నిర్మాతల డబ్బులు నష్టపోయారని తెలియజేశారు.
ఇలాంటి వెబ్సైట్లో ఉంటే సినీ ఇండస్ట్రీకి చాలా నష్టం వస్తుందని వాళ్ళు తెలియజేశారు కాబట్టి అందుకే తమిళ్ రాకర్స్ వెబ్సైట్ ని తొలగించారని సమాచారం అందింది. ICANN ద్వారా తొలగించారు అని తెలిసింది.