తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా, తలైవాగా పేరు సంపాదించుకున్న వ్యక్తి రజనీకాంత్. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందించాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఆయన మేనరిజమ్స్ చాలా ఫేమస్. ఇప్పటికీ ఆయన అభిమానులు ఆయన మానరిజమ్స్ ని అనుసరిస్తూ ఉంటారు.
తనదైన స్టైల్ లో, తనదైన శైలిలో నటిస్తూ సినిమాలు చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తమిళ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా మొత్తం మీద కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రజినీకాంత్. ఆయన సినిమా రిలీజ్ అయింది అంటే చాలు థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంటుంది.
అటు తమిళ్ ఇండస్ట్రీలో, ఇటు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందించి ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేశాడు. ఆయన నటించిన “రోబో”మూవీ, రోబో 2.0 కూడా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. అయినా ఈ ఏజ్ లో కూడా ఎన్నో సూపర్ హిట్స్ అందిస్తున్నారు.
రీసెంట్ గా ఆయన 72వ పుట్టినరోజు కూడా జరుపుకున్నారు. ద్విపాత్రాభినయం లో కూడా బాగా ఎంటర్టైన్ చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి రజనీకాంత్.అలాగే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోస్ లో రజనీకాంత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. తాజాగా ఆయన 171 వ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ డైరెక్షన్లో రాబోతున్న” జైలర్ “అనే మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తుంది. ద్విపాత్రాభినయం ద్వారా ఈ మూవీలో రజనీకాంత్ అందరిని మరోసారి ఎంటర్టైన్ చేయబోతున్నారు.” జైలర్” అనే మూవీ ఆయన నటిస్తున్న 169వ చిత్రం. ఈ మూవీకి సంగీతాన్ని అనిరుద్ అందిస్తున్నాడు.
ఈ మూవీకి సంబంధించిన షూటింగ్స్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ తర్వాత రజనీకాంత్ మరో రెండు మూవీస్ చేయడానికి ఒప్పుకున్నాడు. మరో రెండు మూవీస్ తో ప్రేక్షకుల ముందుకి త్వరలో రాబోతున్నాడు. రెండు మూవీస్ లో “లాల్ సలాం”అనే మూవీ ఒకటి. ఈ మూవీ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్లో రాబోతుంది.
మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ మూవీకి సంబంధించి రెగ్యులర్ షెట్టింగ్ ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుంది. 171వ మూవీ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి డాన్ చికెన్ ద్వారా ఫేమస్ అయిన విను చక్రవర్తి డైరెక్షన్ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత ప్రదీపు రంగనాథన్ పేరు వినిపిస్తుంది. ఇటీవల ఈయన స్వీయ డైరెక్షన్లో, హీరోగా నటించిన”లవ్ టుడే”మూవీ భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
లవ్ టుడే అనే మూవీ ని చూసిన రజనీకాంత్ దీప్ రంగనాథన్ ను ఎంతగానో అభినందించాడు, ప్రశంసించాడు. వినోద్ చక్రవర్తి చెప్పిన కథ ఆయనకు నచ్చలేదని చెప్పి, తన 171వ మూవీకి ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్ చేసే విధంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. ఈ రెండు మూవీస్ ని లైకా ప్రొడక్షన్ లో రానున్నాయని సమాచారం.