Ram Charan: తండ్రి కాబోతున్న రామ్ చరణ్

Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో తన స్వయంకృషితో చిన్న చిన్న పాత్రలు చేస్తూ, తర్వాత సినిమా హీరోగా చేస్తూ ఎన్నో సినిమాలు చేసి చిరంజీవిగా తన పేరును మార్చుకుని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మెగా ఫ్యామిలీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా ట్విట్టర్ ద్వారా మెగా అభిమానులకు ఒక ట్వీట్ చేసి ఒక శుభవార్తను షేర్ చేసుకున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి గారు. హనుమాన్ జి ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఉపాసన, రామ్ చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారు

ఉపాసన, రామ్ చరణ్ దంపతులు తమ మొదటి బిడ్డను తన జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు అంటూ చిరంజీవి భార్య సురేఖ, శోభన అనిల్ కామినేని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ ,ఉపాసనలు 2012 జూన్ 14వ తేదీన వివాహం చేసుకున్నారు. మీరు ఇద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం కాగా 9వ తరగతి వరకు కూడా ఇద్దరు కలిసి చదువుకున్నారు.

ఈ దంపతులకు పెళ్లయి పది సంవత్సరాల అయినప్పటికీ ఎలాంటి శుభవార్త చెప్పలేదని ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్ననే అడుగుతూ వస్తున్నారు. సందర్భాల్లో ఉపాసనకు పిల్లలు ఎప్పుడూ అంటూ ఇలాంటి ప్రశ్న అనేకసార్లు ఎదురయింది. ఇటీవల కాలంలోనే ఆధ్యాత్మిక గురువు జగ్జీ వాసుదేవ్ కార్యక్రమంలో తాను వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఉపాసన వివరించడం జరిగింది.

నేను నా భర్తను, నా కుటుంబాన్ని చాలా ప్రేమిస్తున్నాను. వారిపై అమితమైన గౌరవం ఉంది. నా వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంది. అంటూ చెప్పకు వచ్చింది. మేము చాలా ఆనందంగా జీవిస్తున్నాము. కానీ ఇదంతా పక్కన పెడితే ఎప్పుడు ఒకే ప్రశ్న పిల్లలు ఎప్పుడు అందరూ నన్ను అడుగుతుంటారు. అని చెప్పారు ఉపాసన.

ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయం ట్విట్టర్ వేదికగా హనుమంతుని ఆశీర్వాదాలు ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నా అందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఒక ట్వీట్ ద్వారా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి.

నేను ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇష్టమైన వారితో కొంత సమయం గడిపే చాలా ఆనందంగా ఉంటుంది మన జీవితం చాలా అందంగా ఉంటుంది .అంటూ ఇలాంటి విషయాలు వివిధ సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఉపాసన. పెళ్లిళ్లు అనేవి స్వర్గంలో నిర్ణయించబడినది కావు భూమిపైన ఇద్దరు వ్యక్తులు ఎంతో శ్రమిస్తేనే వివాహ బంధం ఏర్పడుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజమే. మా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. వాటిని మేమిద్దరమే ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటుంటాం. లైఫ్ పార్ట్నర్ కి గిఫ్ట్లు, ఇవ్వడం కన్నా అపురూపమైన క్షణాలు వారికి ఇవ్వడం అనే దానిపైనే మేమిద్దరం ఓటేస్తుంటాం.

ఇలాంటి అపురూపమైన క్షణాలు నాకు ఎన్నో రాంచరణ్ ఇచ్చారు. వివాహమైన మొదటి వాలెంటైన్స్ డే నువ్వు నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ తన అభిప్రాయాలను వివిధ సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు ఉపాసన. ఫైనల్ గా వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న విషయం మీద అభిమానులకు పండగే.